HIV (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్) అనేది మానవులకు సంక్రమించే లెంటివైరస్ జాతికి చెందిన వైరస్. ఈ వైరస్ సోకిన వారు కాలక్రమంలోఎయిడ్స్ వ్యాధి బారిన పడతారు.[1][2] దీనివల్ల రోగనిరోధక శక్తి క్రమంగా విఫలమవుతూక్యాన్సర్, ఇంకా ఇతర ప్రాణాంతక అవకాశవాద సంక్రమణలను కలిగిస్తుంది.[3] ఎటువంటి చికిత్స చేయకపోతే, సోకినవారు వైరస్ ఉపవర్గాన్ని బట్టి, సగటున 9 నుంచి 11 సంవత్సరాలు జీవిస్తారు.[4]
చాలా కేసుల్లో ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా సంక్రమిస్తుంది. రక్త మార్పిడి, జననేంద్రియాల స్రావాల మార్పిడి సంక్రమణకు ప్రధాన కారణాలు.[5][6] లైంగిక సంబంధం కాకుండా గర్భిణీ స్త్రీలకు ఈ వైరస్ ఉంటే అది, జనన సమయంలో తల్లి రక్తం, ఉమ్మనీరు, తల్లి పాల ద్వారా కడుపులోని బిడ్డకు కూడా సోకే అవకాశం ఉంటుంది.[7][8][9][10]
హెచ్.ఐ.వి వైరస్ రెట్రోవైరస్ కుటుంబానికి చెందిన లెంటివైరస్ అనే జాతికి చెందినది.HIV-1, HIV-2 అనే రెండు రకాల వైరస్‌లు ఉన్నాయి. HIV-1 అనేది మొదట కనిపెట్టబడింది. HIV-1 అనేది HIV-2 తో పోలిస్తే ఎక్కువ సాంక్రమిక శక్తి, తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.[11] ప్రపంచ వ్యాప్తంగా HIV ఇన్‌ఫెక్షన్లు ఈ రకం ద్వారానే సోకుతున్నాయి.
HIV నిర్మాణంలో ఇతర రెట్రో వైరస్‌లను పోలి ఉంటుంది. ఇది దాదాపు గోళాకారంలో ఉంటుంది. దీని వ్యాసం సుమారు 120 నానోమీటర్లు. ఇదిఎర్ర రక్త కణం కన్నా సుమారు లక్ష రెట్లు చిన్నది.
↑Gilbert PB, McKeague IW, Eisen G, Mullins C, Guéye-NDiaye A, Mboup S, Kanki PJ (February 28, 2003). "Comparison of HIV-1 and HIV-2 infectivity from a prospective cohort study in Senegal".Statistics in Medicine.22 (4): 573–593.doi:10.1002/sim.1342.PMID12590415.S2CID28523977.