ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందినబోయింగ్ 777, అత్యాధునిక పాసెంజర్ జెట్.
విమానం (ఆంగ్లం Aeroplane) అనేది సాధారణ వాడుకలోగాలిలో ప్రయాణించడానికి వీలుగా తయారుచేయబడినవాహనము. వీటినేఎయిర్‌ప్లేన్‌లు అని ఉత్తర అమెరికాలో(యు.ఎస్. కెనడా),ఏరోప్లేన్‌లు అని కామన్‌వెల్త్ దేశాల్లో (ఒక కెనడా తప్ప),ఐర్లాండ్లో వ్యవహరిస్తారు. ఈ పదాలుగ్రీకు భాష నుండి ఆవిర్భవించాయి. గ్రీక్ భాషలోαέρας (ఏరాస్) అనగా "గాలి" అని అర్థం.[1] 1903లోరైట్ సోదరులు "ఏరోప్లేన్" అన్న పదాన్ని ఒక రెక్కను వివరించడానికి మాత్రమే వాడారు,[2] కాని అది పూర్తి విమానానికి పేరుగా వాడుకలోకి వచ్చింది.
విమానాన్ని సాంకేతిక పరిభాషలో ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ (fixed-wing aircraft) అని అంటారు - అంటే స్థిరంగా, కదలకుండా రెక్కలు ఉండే విమానం. ఇతర విమానాలతో (రోటరీ వింగ్ ఏర్‌క్రాఫ్ట్ లేదాఆర్నిథాప్టర్స్) వీటిని వేరు చేయడానికి అనువుగా ఈ పదాన్ని వాడతారు. ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ గాలికంటే బరువైనదై ఉండడంతో పాటురెక్కలు ఎగరడానికి కావాలసిన శక్తిని విమానానికి ఇవ్వలేవు.
గాలిలో ప్రయాణించే ఏ వస్తువు మీదైనా ప్రధానంగా నాలుగు బలాలు పని చేస్తాయని శాస్త్రజ్ఞుడుజార్జి కేలీ సూత్రీకరించాడు. అవి
పైన ప్రయాణిస్తుండే వస్తువును నిరంతరం కిందకు లాగుతుండే గురుత్వాకర్షణ శక్తి. అదే దాని బరువు. భౌతిక శాస్త్రంలో దీనినేభారము అని కూడ అంటారు.{{{భారము=ద్రవ్యరాశి * గురుత్వాకర్షణ శక్తి----(W=mg) (w=భారము;m=ద్రవ్యరాశి;g=గురుత్వాకర్షణ శక్తి)}}}
ఈ బరువుకు వ్యతిరేకంగా అది కిందకు పడిపోకుండా నిరంతరం దాన్ని పైకి లేపుతూ అదితేలుతూ ఉండేలా చూసే బలం రెండోది. అదే తేలు లేదా లిఫ్ట్. ఇది విమాన యానానికి అత్యంత కీలకమైన బలం. విమానం బరువుకు వ్యతిరేకంగా, బరువు కంటే ఎక్కువగా తేలు పని చేస్తున్నపుడే విమానం తేలుతుంది. పైపైకి లేస్తుంటుంది. ఈ "తేలు" బలాన్ని రెక్కలు సృష్టించాలి. విమానం చలన వేగాన్ని పెంచడం ద్వారా లేదా రెక్కల కోణాన్ని మార్చడం ద్వారా ఈ తేలు (లిఫ్ట్) బలాన్ని పెంచవచ్చు. కిందకు లాగే బరువు పైకి లేపే లిఫ్ట్ సరి సమానంగా ఉంటే విమానం గాలిలో అక్కడే తేలుతుంటుంది. లిఫ్ట్ ఎక్కువైతే విమానం పైకి లేస్తుంది. తక్కువైతే కిందకు దిగుతుంది.
విమానాన్ని బలంగా ముందుకు లాక్కుపోతుండే బలం... థ్రస్ట్. విమానం లోని ఇంజన్ , ప్రొఫెల్లర్లు గాలిని వేగంగా వెనక్కి నెడుతూ ఈ గుంజుడు బలాన్ని సృష్టిస్తాయి.
ఇదే సమయంలో పుట్టే ఎదురు గాలి సృష్టించే అవరోధం నాలుగోది. అదే డ్రాగ్. ఈ డ్రాగ్ కంటే కూడా దాన్ని ముందుకు లాగే బలం (థ్రస్ట్) ఎక్కువగా ఉంటేనే విమానం ముందుకు సాగిపోతుంది.
విమానము పనిచేసే సూత్రంచిన్న విమానము. హైదరాబాద్ లో తీసిన చిత్రము
అతి జోరుగా (దరిదాపు గంటకి 500 మైళ్లు లేదా ??? కిమీలు) ప్రయాణించే విమానం నేల మీదకి దిగి ఆగాలంటే దానీ వేసే మరకట్టుకి సాధనాలు ఏమిటో చూద్దాం. విమానం రెక్కకి కొద్దిగా వెనక ఉన్న కుర్చీలో కూర్చుని రెక్క వైపు జాగ్రత్తగా చూస్తే విమానం ఆఘడానికి చోదకుడు చేసే పని కొంతవరకు అర్థం అవుతుంది. ఇక్కడ చూడవలసిన అంశాలు మూడు: ఒకటి, రెక్క వెనక భాగం. విమానం ఇంఖా ఆకాశంలో ఎగురుతూ ఉండగానే ఇది వైశాల్యంలో విస్తరిస్తుంది. ఇది ఇలా వెడల్పు అవుతూన్న కొద్దీ బరువు పాలు ఎక్కువ అవుతుంది, తేలు పాలు తగ్గుతుంది కనుక విమానం నెమ్మదిగా దిగుతుంది. రెండు, విమానం చక్రాలు నేలని తగలగానే మళ్లా పైకి, గాలిలోకి, లేచిపోకుండా ఉంచేందుకుగాను, రెక్కల మీద ఉన్న రెండు రేకులలాంటివి పైకి లేస్తాయి. గాలికి ఎదురయి ఇవి కలిగించే అవరోధానికి విమానం జోరు తగ్గుతుంది. మూడు, ఇంజను వెనక భాగం చూస్తే అక్కడ ఒక చట్రం లాంటి ఉపకరణం ఇంజను నుండి ఊడిపోతోందా అనేటట్లు వెనక్కి వస్తుంది - ఒక్క క్షణం పాటు. అప్పుడు ఇంజను పెద్దగా హోరుమని శబ్దం చేస్తుంది. ఈ ప్రక్రియ ముందుకి వెళుతూన్న విమానాన్ని వెనక్కి తోస్తుంది. ఇదొక రకం మరకట్టు. అప్పటికి విమానం జోరు పందెపు కారు జోరంత ఉండొచ్చు. అప్పుడు పుంజుగుంటలో ఉన్న చోదకుడు తిరుగుతూన్న చక్రాలకి మరకట్టు వేస్తాడు. ఇంత హడావుడి చేస్తే కాని విమానాన్ని ఆపలేం!!