నమాజ్, (అరబ్బీ : صلاة ) (పర్షియన్,ఉర్దూలో : نماز ) (అరబ్బీ:صلوة)ఇస్లాంలో భక్తులుఅల్లాహ్ ముందు మోకరిల్లి చేసేప్రార్థన. ప్రతిదినం 5 సమయాలలో చేసే నమాజ్ ప్రతి ముస్లిం కచ్చితంగా పాటించవలసిన నియమం. ఇస్లామీయ ఐదు మూలస్థంభాలలో ఇది ఒకటి. నమాజ్ ను అరబ్బీలో "సలాహ్" అని అంటారు. ఇదే పదాన్ని పర్షియనులు, ఉర్దూ మాట్లాడేవారు "సలాత్" అని పలుకుతారు.పర్షియన్ భాషలో "నమాజ్" అని అంటారు. పర్షియన్ భాషాపదమైన "నమాజ్"నేభారత ఉపఖండంలో కూడా వాడుతారు.
ప్రార్థన ఆచరించే ముందు ప్రదేశం ద్వారా ఎవరూ నడిచేప్రదేశం లేకుండా వుంచడం, అనగా నమాజీ ముందు నుండి ఎవరూ రాకపోకలు చేయరాదు, అలా చేస్తే ప్రార్థనా నిష్ఠ భంగమౌతుంది.[6] .
ప్రార్థనా స్థలి పరిశుభ్రంగా వుండాలి. ఒకవేళ గాయాల కారణంగా శరీరం నుండి రక్తము ప్రవహిస్తూ వుంటే నమాజ్ ఆచరించరాదు. స్త్రీలు తమ ఋతుకాలములో నామాజ్ ఆచరించరాదు. అలాగే స్త్రీలు బిడ్డల ప్రసవించిన తరువాత ఒక నియమిత కాలం, ఉదాహరణ 40 రోజులవరకు నమాజ్ ఆచరించరాదు. ముహమ్మద్ ప్రవక్త ఈ విధంగా సెలవిచ్చారు "స్త్రీలు తమ ఋతుక్రమకాలంలోనూ, ప్రసవించిన తరువాత కొద్ది కాలం కొరకునూ నమాజు గాని ఉపవాసవ్రతంగానీ ఆచరించరాదు. "[7][8][9]
కుళాయి వద్ద వజూ చేసేటప్పుడు నీరు వృథా కాకుండా నివారించేందుకు ఆటోమేటిక్ సెన్సర్లు, బేసిన్లతో ఒక యంత్రాన్ని కూడా రూపొందించారు. ఈ యంత్రంలో వజూ చేసే ముందు చదివేదువా (ప్రార్థన) కూడా రికార్డు చేసి ఉంచారు. వజూ చేసే ముందు ఈ యంత్రం నుంచి దువా వినిపిస్తుంది. ఈ యంత్రం ద్వారా ఒక్కొక్కరు వజూ చేయడానికి కేవలం 1.3 లీటర్ల నీరు సరిపోతుంది.హజ్ సమయంలోమక్కాలో 20 లక్షల మంది వజూ చేసుకోడానికి రోజుకు 5 కోట్ల లీటర్ల నీరు అవసరం. అదే ఈ యంత్రాన్ని వాడితే రోజుకు 4 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది.[10]
ఇఖామా అంటే శ్రద్ధా భక్తులతో ప్రార్థనకోసం వరుసలుగా నిలబడటం అని అర్ధం.అజాన్ పలుకులు రెండు సార్లు ఇఖామా పలుకులు ఒకసారి పలకమని ప్రవక్త చెప్పారు (బుఖారీ 1:581) ఇఖామా విన్నప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా చేయగలిగినంత ప్రార్థన చేయండి (బుఖారీ 1:609)[1] నుండి వెలికితీశారు.
టర్కీ లోని ఒక మస్జిద్ లో నమాజు సమయాలను చూపెట్టే ఒక బోర్డు.
ఫజ్ర్ : ఫజ్ర్ అనగా సూర్యోదయం సమయం. సూర్యోదయాత్పూర్వం ఆచరించే నమాజ్ ని ఫజ్ర్ నమాజ్ లేదా " సలాతుల్ ఫజ్ర్ " (అరబ్బీ) గా వ్యవహరిస్తారు.
జుహర్ : జుహర్ అనగా మధ్యాహ్న సమయం. సూర్యుడు నడినెత్తినవచ్చి పడమట పయనించే సమయం. ఈ సమయంలో ఆచరించే నమాజ్ ని జుహర్ నమాజ్, లేదా నమాజ్ ఎ జుహర్, లేదా సలాతుల్ జుహర్ (అరబ్బీ) అని అంటారు.
అసర్ : అసర్ అనగా మధ్యాహ్నము, సూర్యాస్తమయ సమయానికి మధ్య గల సమయం, సాయంకాలం. ఈ సమయంలో ఆచరించే నమాజిని అసర్ నమాజ్, నమాజె అసర్, సలాతుల్ అసర్ (అరబ్బీ) అని అంటారు.
మగ్రిబ్ : మగ్రిబ్ అనగా సూర్యాస్తమయ సమయం. ఈ సమయంలో, సూర్యుడు అస్తమించిన వెనువెంటనే ఆచరించే నమాజ్. దీనిని మగ్రిబ్ నమాజ్, నమాజె మగ్రిబ్, సలాతుల్ మగ్రిబ్ (అరబ్బీ) అని అంటారు.
ఇషా : సూర్యాస్తమయ సమయం నుండి, అర్ధరాత్రి వరకు ఆచరించే నమాజుని ఇషా నమాజ్, నమాజె ఇషా, సలాతుల్ ఇషా (అరబ్బీ అని అంటారు.
↑See also[ఖోరాన్2:282]: "... and call in to witness from among your men two witnesses; but if there are not two men, then one man and two women from among those whom you choose to be witnesses, so that if one of the two errs, the second of the two may remind the other...".