మిరపకాయలనేవి మొదటఅమెరికాలోవెలుగుచూశాయి. అమెరికాలోయూరోపియన్లు కాలిడిన తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం, ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది.భారతదేశంలోగుంటూరు, పరిసరజిల్లాలు మిరపపంటకు ప్రసిద్ధి. ఈ పంటడిసెంబరు నుండిమే వరకు కోతలు వుంటాయి. భారత మసాల మండలి ప్రకారం సంవత్సరానికి 2,80,000 టన్నుల[2] పంట పండుతున్నది. ఇంకా ఇతర రకాలు దేశంలో పలు చోట్ల ప్రసిద్ధికెక్కాయి.
మిరపకాయలు ఘాటుగా వుంటాయి.తెలుగు వారికి మిరపకాయలను కూరలలో వాడటంతోపాటు, వాటితో చేసినబజ్జీలను తినడం చాలా ఇష్టం. మిరప పండ్లను తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతోంది.దీనిని సుదీర్ఘకాలం పాటు నిల్వచేయడానికి వీలుగా వాటిని ఎండబెట్టడం జరుగుతోంది. అలాగే తాజా మిరప పండ్లనుఊరగాయ వేయడం ద్వారా కూడా దీర్ఘకాలం నిల్వచేయడం జరుగుతోంది. మిరపకాయలను వంటలలో,వైద్యపరంగా,రక్షణకు, మనస్సుని దిటవు పరచుకోటానికి, ఆహర పరిరక్షణకు, ఆత్మ రక్షణకు వాడుతారు.
అమెరికాలోని ప్రజలఆహారంలో మిరపకాయలు భాగం కావడమనేది దాదాపు క్రీ.పూ. 7500 నాటినుంచే ప్రారంభమైంది. పురాతత్వశాస్త్ర సాక్ష్యాధారాల ప్రకారం, నైరుతిఈక్విడార్‌లో కొలువై ఉన్న ప్రాంతాల్లో 6000 సంవత్సరాలకు పైగా కాలం నుంచి మిరపకాయల పెంపకం అమలులో ఉంటోంది[3][4]. అలాగే మధ్య, దక్షిణ అమెరికాల్లో[5] మొట్టమొదట సాగు చేయబడిన పంటల్లో మిరప కూడా ఒకటిగా ఉండడంతో పాటు ఈ పంట స్వపరాగ సంపర్కం లక్షణం కలిగిఉంటోంది.
మిరపకాయలను మొట్టమొదటగా గుర్తించిన వారిలోక్రిస్టోఫర్ కొలంబస్ కూడా ఒకరు. ఆయన వీటిని (కరీబియన్‌లో కనుగొన్నారు), కనుగొన్న సమయంలో "పెప్పర్స్" అని సంబోధించారు. ఇతర ఆహారపదార్థాల మాదిరిగా కాకుండా కారంగా ఘాటైన రుచితో యూరోప్‌లో అప్పటికే సుపరిచితమైనపిపెర్ తరగతికి చెందిన నలుపు, తెలుపు పెప్పర్ (మిరియాలు) వలే ఉండడమే అందుకు కారణం. దీనితర్వాతయూరోప్‌లో పరిచయమైన మిరపకాయలు స్పానిష్, పోర్చుగీసు మఠాలకు చెందిన తోటల్లో ఔషధపరమైన మొక్కలుగా పెంచబడేవి. అయితే, సదరు మఠాల్లో ఉండేసన్యాసులు ఈ మిరపకాయలను వంట సంబంధిత అంశాల్లో ప్రయోగించి చూడడంతో పాటు మిరపకాయల్లో ఉండే కారం అనే గుణం నల్ల మిరియాల ఉపయోగానికి ప్రత్యామ్నాయంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. ఎందుకంటే, ఆరోజుల్లో ఈ నల్ల మిరియాలనేవి అత్యంత ఖరీదైనవిగా ఉండేవి. ఈ కారణంగా అప్పట్లో కొన్ని దేశాల్లో వీటిని చట్టబద్దమైన ద్రవ్యంగా కూడా వినియోగించేవారు.[6]
మిరపకాయలనుకొలంబస్ కనుగొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీటిని సాగుచేయడం ప్రారంభమైంది.[7][8] 1493లో వెస్టిండీస్‌కి రెండో నౌకాయానం చేసిన కొలంబస్‌కు ఫిజీషియన్ అయిన డిగో అల్వరేజ్ చన్కా, మొట్టమొదటగా మిరపకాయలనుస్పెయిన్‌కు తీసుకొని పోవడంతో పాటు వాటి వైద్యపరమైన ప్రభావాల గురించి 1494లో అక్షరబద్దం చేశారు.
మరోవైపు అప్పట్లోఆసియాతో వాణిజ్య సంబంధాలు నెరుపుతున్న స్పానిష్ కాలనీ అయినమెక్సికో నుండి మిరపకాయలు మొదటఫిలిప్పైన్స్‌కు వ్యాపించడంతో పాటు అటుపైభారతదేశం, చైనా,ఇండోనేషియా, కొరియా,జపాన్‌లకు సైతం వేగంగా విస్తరించాయి. ఇలా పలుదేశాలకు విస్తరించిన మిరపకాయలు నెమ్మదిగా అక్కడి స్థానిక వంటకాల్లో భాగమయ్యాయి.
స్పెయిన్ నుంచి మిరపకాయలను పొందిన పోర్చుగీస్ వీటిని భారతదేశంలో సాగుచేయడం సైతం మిరప అనేది అన్ని దేశాలకు విస్తరించడానికి మరో ముఖ్యమైన కారణంగా నిలిచింది.[9] అప్పట్లో మిరపకాయలనేవి పోర్చుగీస్ కాలనీ ప్రాంతమైనభారతదేశంలోనిగోవా ప్రాంతంలోని వంటకాల్లో (ఉదాహరణకు భారతీయత అన్వయింపబడిన పోర్చుగీసు వంటకమైన విందాలూ) ప్రముఖంగా దర్శనమిచ్చేవి. ఈ విధంగా మెళ్లగా విస్తరించడం ప్రారంభించిన మిరపకాయలు భారతదేశం నుండి మధ్య ఆసియా,టర్కీల ద్వారాహంగరీ వరకు వ్యాపించాయి.హంగరీలో ఇవి పాప్రికా రూపంలో జాతీయ సుగంధద్రవ్యంగా మారాయి.
సాధారణంగా ఉపయోగించే జాతులు కేవలం కొన్ని మాత్రమే ఉన్నప్పటికీ,వంటకు ఉపయోగించడంలో భాగంగా వివిధ రకాల పేర్లతో అనేక రకాల సాగు పద్ధతులు, మిరపకాయల తయారీ విధానాలు అమలులో ఉన్నాయి. ఉదాహారణకు పచ్చని, ఎర్రని బొద్దు మిరపకాయలు రెండూ కూడాసి. ఆనమ్ అనే ఒకే రకం జాతి నుంచి సాగు చేయబడుతాయి, అయితే, పక్వానికి రాని దశలో ఈ మిరపకాయలు పచ్చని రంగులో ఉంటాయి. జలపెనో, పోబ్‌లానో అంటారు. ఎండిన దశలో వీటిని ఆంకోగా పిలుస్తారు, న్యూ మెక్సికో ఇది చిల్, అనాహియమ్, సెరానో,, ఇతర సాగు రకాల వంటివి సైతం ఈ జాతుల్లో ఉన్నాయి.
బొద్దు మిరపకాయలు, తీపి మిరపకాయలు,, ఘాటైన మిరపకాయల రూపంలో మిరపకాయలనేవి సాధారణంగా మూడు బృందాలుగా విభజింపబడుతాయి. చాలావరకు ప్రసిద్ధి చెందిన మిరప రకాలన్నీ పైన పేర్కొన్న విభాగాల్లోనూ లేదా ఆయా రకాల మధ్య చోటు చేసుకున్న సంకర రూపాల్లోనో భాగంగా ఉంటాయి.,
హోస్టన్, టెక్సాస్‌లోని ఒక కిరాణా దుకాణంలో ప్రదర్శనకు ఉంచిన ఘాటైన మిరపకాయలు, స్కోవిల్ స్కేలు వివరించే ఒక బోర్డు
మిరపకాయలకు సహజ గుణమైన ఘాటుదనాన్ని అందించే అంశాలు వాటిలో లోపల గానీ లేదా పై భాగంలో గానీ ఉండవచ్చు. వీటిలో క్యాప్‌సైసిన్ (8-మిథైల్-ఎన్ -వనిల్లైల్-6-నోనెనామిడ్), అనేక సంబంధిత రసాయనాలు భాగం వహిస్తాయి, వీటన్నింటినీ కలిపిక్యాప్‌సైసినాయిడ్స్ అంటారు.[10][11] విపరీతమైన మంటను కలిగించేఆయుధంగా ఉపయోగించే పెప్పర్ స్ప్రేలో క్యాప్‌సైసిన్ అనేది ప్రధాన అంశంగా ఉంటుంది.
వినియోగించే సమయంలో, క్యాప్‌సైసినాయిడ్స్ అనేవి నోరు, గొంతు భాగాల్లోని నొప్పి గ్రాహకాలుతో బంధాన్ని ఏర్పాటు చేస్తాయి. ఈ కారణంగానే మిరపకాయలను తిన్న సమయంలో ఈ భాగాలు ఘాటుదనాన్ని గుర్తించగలుగుతాయి. మిరపకాయల్లోని క్యాప్‌సైసినాయిడ్స్ ద్వారా క్రియాశీలకం అయినపుడు నోరు, గొంతులో ఉన్న గ్రాహాకాలు తాము ఘాటైన పదార్థం చేత ప్రభావితమవుతున్నామనే సందేశాన్ని మెదడుకు అందజేస్తాయి. దీంతోహృదయ స్పందన రేటును పెంచడం,చెమట పట్టడాన్ని అధికం చేయడంతో పాటు ఎండార్ఫిన్‌ను విడుదల చేయడం ద్వారా మంట కలుగుతున్న భావానికి మెదడు ప్రతిస్పందన వ్యక్తం చేస్తుంది. 2008లో విడుదలైన ఒక అధ్యయనం[12] పేర్కొన్న ప్రకారం, ఎ టి పి యొక్క హైడ్రాలసిస్ ద్వారా ఉత్పత్తి అయిన శక్తిని శరీర కణాలు ఏవిధంగా ఉపయోగించుకుంటాయనే అంశాన్ని క్యాప్‌సైసిన్ మార్చివేస్తుంది. సాధారణ హైడ్రాలసిస్ ప్రక్రియలో సార్కోప్లాస్మిక్ రెటికులమ్‌లోకికాల్షియం ఆయాన్లు చలించడం కోసం సెర్కా ప్రొటీన్ అనేది ఈ శక్తిని ఉపయోగించుకుంటుంది. అయితే, ఈ ప్రక్రియ జరిగే సమయంలో క్యాప్‌సైసిన్ భాగస్వామ్యం వహించినట్టైతే, సెర్కా ఆకారాన్ని అది మార్చివేస్తుంది. ఆవిధంగా అది ఆయాన్ చలనాన్ని తగ్గించివేస్తుంది; తత్ఫలితంగా ఎ టి పి శక్తి (ఆయాన్లను ముందుకు కదించేందుకు ఇది ఉపయోగపడుతుంది) వేడి రూపంలో విడుదలవుతుంది.[13]
మిరపకాయల్లోని "ఘాటు" (వేడి) ని చారిత్రకంగా స్కోవిల్ హీట్ యూనిట్స్ (ఎస్ హెచ్ యు) లో కొలుస్తారు. రుచిని గుర్తించే చెప్పే కొంతమంది వ్యక్తులు గుర్తించలేని స్థాయికి ఒక మిరప రకంలోని ఘాటుదనం తగ్గిపోయేందుకు అది ఏస్థాయి చక్కర ద్రావణంలో కరిగించబడాలనే అంశాన్ని ఆధారం చేసుకుని ఈ రకమైన కొలతను నిర్థారిస్తారు.[14] ఈ రకమైన పరీక్షలో భాగంగా బొంత మిరప సున్నఎస్ హెచ్ యు యూనిట్ల ర్యాంకును పొందితే, న్యూ మెక్సికో పచ్చరంగు మిరపకాయలు 1,500 ఎస్ హెచ్ యుని, జలపెనోస్ 2,500–5,000 ఎస్ హెచ్ యు ని,, హబానెరోస్ 300,000 ఎస్ హెచ్ యు యూనిట్ల ప్రమాణాన్ని నమోదు చేస్తాయి. ఎస్ హెచ్ యు రేటింగ్ యొక్క పరిమాణాత్మక విశ్లేషణకు సంబంధించిన ఆధునికమైన సాధారణ పద్ధతిలో భాగంగా ఒక మిరప రకంలోని క్యాప్సినాయిడ్ పరిమాణాన్ని నేరుగా మదింపు చేయడం కోసం హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రొమటోగ్రఫీని ఉపయోగించడం జరుగుతోంది. స్వచ్ఛమైన క్యాప్‌సైసిన్ అనేది ఒక హైడ్రోఫోబిక్, రంగు రహితం, వాసనరహితంగా ఉండడంతో పాటు గదిఉష్ణోగ్రత వద్ద స్పటికాకారం మొదలుకొని మైనపు ముద్దల రూపంలో ఉండడంతో పాటు 16,000,000 ఎస్ హెచ్ యు ఘాటుదనాన్ని కలిగిఉంటుంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 2011 ఫిబ్రవరి 25 నాటికి,ప్రపంచంలోనే అతి ఘాటైన (కారం కలిగిన) మిరప రకంగా నాగా విపెర్ నిలుస్తోంది. 1,382,118 SHU స్కోవిల్ రేటింగ్‌తో అది ఈ ఘనతను సొంతం చేసుకుంది. అయితే, పైన పేర్కొన్న రికార్డు సైతం కొద్దిరోజుల్లోనే తుడిచిపెట్టుకుపోయే అవకాశముంది. "ట్రినిడాడ్ స్కార్పియోన్ బచ్ T" చిల్లీ పేరుతో 2.5 cm (1 అంగుళం) పొడవుతో ఆస్ట్రేలియాలో సాగుచేయబడుతోన్న ఒకరకంమిరప 1,463,700 SHUతో త్వరలోనే సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది.
2007లో, ఘోస్ట్ పెప్పర్/చిలీ పెప్పర్‌గా కూడా సుపరిచితమైనభుట్ జోలోకియాని టబాస్కో సాస్ కంటే 401.5 రెట్లు ఘాటైనదిగా గుర్తించడం ద్వారా ప్రపచంలోనే అతి ఘాటైన మిరపగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదుచేసింది.[15]
2010 డిసెంబరు 3న, నాగా విపెర్ పెపెర్ సరికొత్త రికార్డుతో ఘోస్ట్ పెప్పర్/చిలీ పెప్పర్ లేదా ఘోస్ట్ పెప్పర్‌గా కూడా సుపరిచితమైన భుట్ జోలోకియా సాధించిన గిన్నిస్ రికార్డు మరుగునపడిపోయింది. భుట్ జోలోకియా సాధించిన పాయింట్లతో పోలిస్తే స్కోవిల్ రేటింగ్ విషయంలో 300,000 కంటే ఎక్కువ పాయింట్లు సాధించడం ద్వారా నాగా విపెర్ కొత్త రికార్డును సాధించింది. అయితే, ప్రస్తుతం అత్యంత ఘాటైన మిర్చిగా రికార్డు సాధించిన డోర్‌సెట్ నాగాతో పోటీపడలేక ఈ నాగా విపెర్ వెనక్కు తగ్గింది.[16]
2011 ఫిబ్రవరిలో, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అందించిన "ప్రపంచపు అత్యంత ఘాటైన మిరప" అనే పురస్కారాన్ని గ్రాంతమ్,ఇంగ్లాండ్‌లో సాగవుతోన్న ఇన్ఫినిటీ మిరప దక్కించుకుంది. స్కోవిల్ స్కేలుపై ఈ మిరప 1,067,286 యూనిట్లను నమోదుచేసింది.[17]
2011 ఫిబ్రవరి 25న, గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకటించిన ప్రకారం, నాగా విపెర్ తన పాత రికార్డైన 314,832 (SHU) ని 1,382,118 పాయింట్ల కొత్త రికార్డుతో బద్దలు కొట్టింది.[18]
అయితే, ప్రస్తుతం మిరప పండే దేశాల మధ్య స్కోవిల్ రేటింగ్‌ల విషయంలో విపరీతమైన వివాదం నెలకొనడంతో పాటు "ప్రపంచపు అతి ఘాటైన" అనే నిర్ణయాన్ని వెలువరించడం కోసం అనేక మిరప రకాలపై అత్యంత కఠినమైన శాస్త్రీయ ప్రమాణాలను అమలుచేయడం జరుగుతోంది.
థాయ్ మిరప.ఆఫ్రికన్ బర్డ్‌సే రకాన్ని పోలిన మిరప రకం, దాని పరిమాణానికి సంబంధించిన పరిగణించదగిన బలాన్ని అది ప్రదర్శిస్తోంది.
మిరప పండ్లును తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతోంది. మిరపను సుదీర్ఘకాలం పాటు నిల్వచేయడానికి వీలుగా వాటిని ఎండబెట్టడం జరుగుతోంది. అలాగే తాజా మిరప పండ్లనుఊరగాయ వేయడం ద్వారా కూడా దీర్ఘకాలం నిల్వచేయడం జరుగుతోంది.
ఎండు మిరపను మళ్లీ పచ్చిగా ఉండే రూపానికి తెచ్చి చేసే కొన్ని మెక్సికన్ చిల్లీస్ రెల్లెనోస్ వంటకాల్లో వైవిధ్యాలు ఉండడం, ఇతరులు ఎండిన మిరపకాయలనుపచ్చడిలా చేయడానికి ముందు వాటిని పచ్చిగా చేయడం జరుగుతున్నప్పటికీ, ఎండిన మిరపకాయలను తరచూ పొడిగా చేయడమే జరుగుతోంది.పొగబెట్టడం ద్వారా కూడా మిరపకాయలను ఎండిన స్థితికి తేవచ్చు. జలపెనో రకానికి చెందిన మిరపను పొగబెట్టడం ద్వారా ఎండిన స్థితిలో ఉండే చిపోట్లే మిరపని తయారుచేస్తారు.
పోబ్లానో లాంటి అనేక తాజా మిరప రకాలు కఠినంగా ఉండే పై పొరను కలిగి ఉండడం వల్ల వండేటప్పడు సైతం అవి ఏమాత్రం చెదరవు.వంటల్లో భాగంగా మిరపకాయలను మొత్తంగా లేదా పెద్ద ముక్కల రూపంలో, వేయించి, లేదా ఇతర విధానాల్లో పైపొరని మాడేలా చేయడం లాంటి విధానాలను అనుసరించడం ద్వారా మిరపకాయల లోపల ఉండే కండ భాగాన్ని పూర్తిగా ఉడికేలా చేయడం జరుగుతుంది. మిరపకాయలు చల్లగా ఉండే సమయంలో వాటిపైన ఉండేచర్మం సాధారణంగా సులభంగా ఊడి వస్తుంది.
మిరప చెట్ల పత్రాలు సైతం కొద్దిగా చేదుగా ఉంటాయే తప్ప కారం విషయంలో మాత్రం అదే చెట్టు నుంచి వచ్చే కాయలంత కారంగా మాత్రం ఉండవు. మరోవైపు మిరప చెట్టుఆకులను సైతం ఫిలిపినో వంటకంలోఆకుకూరలు రూపంలో వండుతారు, అక్కడ వారు దీన్నిదహోన్ఎన్గ్ సిలీ (అక్షరబద్దంగా "మిరప పత్రాలు" అంటారు) అని పిలుస్తుంటారు. వారు దీన్నిటినోలాగా పిలిచే చికెన్ సూప్‌లో ఉపయోగిస్తారు. అలాగే కొరియన్ వంటకాల్లో ఈ మిరప పత్రాలను కించిలో ఉపయోగిస్తుంటారు. ఇక జపనీస్ వంటకంలో, ఆకుకూరల రూపంలో వీటిని వండుతుంటారు, దీంతోపాటు నిల్వచేయడం కోసంసుకుదానీ శైలిలో సైతం దీన్ని వండుతుంటారు.
మరోవైపుభూటాన్‌లో మిరప అనేది ఒక ముఖ్యమైన ఫలంగా ఉంటోంది. అక్కడి స్థానిక మార్కెట్లలోమిరప లేకపోవడమనేదే జరగదు, మార్కెట్లన్నీ ఎల్లప్పుడూ విభిన్న రకాల రంగులు, పరిమాణాల్లో తాజా, ఎండిన రూపంలోని మిరపకాయలను విక్రయిస్తుంటాయి. భూటానీయులు ఈ పంటని ఎమా (జోంగ్‌కాఖాలో) అని లేదా సోలో (షార్‌చోప్) అని పిలుస్తుంటారు. మిరప అనేది భూటాన్‌లో ఒక ముఖ్యమైన ఫలంగా ఉంటోంది;ఎమా డట్సీ అనే వంటకాన్ని స్థానిక జున్నులో మిరపను కలిపి తయారు చేస్తుంటారు. అలాగే ఈ దేశంలో మిరప అనేది దాదాపు అన్ని రకాల వంటకాలు, ఆహార పదార్థాల్లో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటోంది.
మిరపకాయలనేవి అనేక వంటకాల్లో కనిపిస్తుంటాయి. ఈ వ్యాసంలో ఎక్కడో ఒకచోట పేర్కొన్న పేర్కొన్న వంటకాలు మినహా కొన్ని ప్రసిద్ధ వంటకాలు గురించి కింద పేర్కొనడమైనది:
హంగేరికి చెందిన పాప్రికాష్—తక్కువ కారం కలిగిన, పొడిరూపంలోని, ఎండిన మిరపకాయలు, అకా పాప్రికాలను చికెన్ వంటకంలో ఉపయోగిస్తారు.
మెక్సికోలోని ప్యూబ్లా ప్రాంతానికి చెందిన చిల్లీస్ ఎన్ నొగడా—మాంసంతో కూరిన తక్కువ కారం కలిగిన తాజా మిరపకాయలను చిక్కగా ఉండే సాస్‌తో పూరించడం ద్వారా ఈ వంటకాన్ని తయారుచేస్తారు.
మెక్సికోలోని ప్యూబ్లా నగరానికి చెందిన మోల్ పోబ్లానో—పౌల్ట్రీ లేదా ఇతర మాంసాల కోసం చిక్కని, మందమైన సాస్ తయారీ కోసం ఎండిన మిర్చికి చెందిన అనేక రకాలతో పాటుగింజలు, మసాలా దినుసులు, ఫలాలను ఉపయోగిస్తారు.
ఇటలీకి చెందిన పుట్టనెస్కా సాస్—పాస్టా కోసం ఎండిన రూపంలోని ఘాటైన మిరపకాయలతో పాటుగా టోమోటాలు కూడా కలిపి తయారు చేసే సాస్.
చైనాలోని సిచువాన్‌కు చెందిన కంగ్ పావో చికెన్ (గాంగ్ బావోగా కూడా పలుకుతారు) -- వేయించే నూనెకు ఘాటు దనాన్ని తేవడం కోసం చిన్నని బాగా కారంగా ఉండే ఎండిన మిరపకాయలను సదరునూనెలో కొంతసేవు వేయిస్తారు. అటుతర్వాత ఆ నూనెను ఇతర పదార్ధాలను వేయించడం కోసం ఉపయోగిస్తారు.
నైజీరియన్ వంటకాలతో పాటు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో మిరపకాయల ఉపయోగం కనిపిస్తుంది.
ఘాటైన సాస్‌ల తయారీ కోసం తాజా లేదా ఎండిన మిరపకాయలను ఉపయోగిస్తుంటారు. సీసాల్లో సేకరించి ఉంచే ఈ పరిమళభరిత సాస్‌ని ఇతర పదార్థాలకి ఘాటుదనాన్ని ఆపాదించడం కోసం వాటిలో కలిపేందుకు ఉపయోగిస్తుంటారు. మధ్యప్రాచ్యానికి చెందిన హరిస్సా,జపాన్‌కి చెందిన లా యూ (లేదా రాయు),థాయిలాండ్‌కు చెందిన శ్రీరాచ లాంటి వంటకాలతో సహా అనేక వంటకాల్లో ఈ రకమైన ఘాటైన సాస్ ఉపయోగం కనిపిస్తుంది.
మసస్తత్వ శాస్త్రవేత్త అయిన పాల్ రోజిన్ సూచించిన ప్రకారం, మిరపకాయలనేవి రోలర్ కోస్టర్ మీద స్వారీ చేయడం లాంటి "పరిమిత ప్రమాదం"కు చక్కని ఉదాహరణ. ఎందుకంటే, ఇందులో భాగంగా బాధ, భయం లాంటి తీవ్రమైన అనుభూతులను వ్యక్తులు ఆనందంగా అనుభవిస్తారు. ఈ రకమైన అనుభూతులు నిజంగా బాధాకరమైనవి కావని వ్యక్తులు గ్రహించడమే అందుకు కారణం. శారీరక హాని ఏదీ లేకుండానే ఈ పద్ధతిలో వ్యక్తులు తీవ్రమైన భావాలను అనుభూతి చెందుతారు.[19]
బ్లాక్ పెరల్‌లో ఉండే నల్లటి గుండ్రని పండ్లు ఒక దశ తర్వాత గాఢమైన ఎరుపు రంగుకు మారుతాయి.కరేబియన్ మార్కెట్‌లో కొలువుదీరిన స్కాట్చ్ బొన్నెట్ మిరపకాయలు
మిరపకాయను తినడాన్నిజపాన్‌లో ఒక యుద్ధ వీరుని కార్యక్రమంగా చూడబడుతుంది. మిరపకు సంబంధించిన ఘాటుదనం వ్యక్తిగతమైన భయాన్ని, మానసికమైన శూన్యతను కలిగించడమే అందుకు కారణం. మిరపకాయలను తినేందుకు తమనితాము బలవంతపెట్టుకోవడం ద్వారా యుద్ధవీరుల మానసిక స్థితి బలీయంగా మారడంతో పాటు యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టిన సమయంలో అజేయంగా భావించేందుకు సైతం ఉపకరిస్తుంది. మరోవైపు మిరపకాయలను ఆరగించడమనేదికరాటే ఆటగాళ్ల విషయంలో ఒక ప్రసిద్ధ విషయంగా ఉంటోంది, తమ మనసు, నిర్ణయాన్ని బలీయంగా చేసుకునేందుకు వారు ఈ విధంగా చేస్తారు.
ఆర్థరైటీస్ నొప్పి, హెర్పెస్ జోస్టర్ సంబంధిత నొప్పి,డయాబెటిక్ న్యూరోపతి, పోస్ట్‌మ్యాస్టెక్టోమీ నొప్పి,,తలనొప్పల నుంచి ఉపశమనం పొందే విషయంలో క్యాప్‌సైసిన్ అనేది ఒక సురక్షితమైన, ప్రభావవంతమైన స్థానిక నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.[20]
ఏనుగుల దాడి నుంచి పంటను రక్షించే విషయంలో మిరప ఉపయోగాన్నిఆఫ్రికా, దక్షిణాసియాల్లోనిరైతులు బహు చక్కగా గుర్తించారు. ఏనుగులను పంటకు దూరంగా ఉంచేందుకు కంచె మీద, ఇతర నిర్మాణాల మీద మిరపకాయలను చల్లుతారు.ఏనుగులు పొడవైన, సున్నితమైన ఘ్రాణ అవయవం, నాసికా వ్యవస్థను కలిగి ఉండడం వల్ల మిరపకాయలను వాసన చూసిన సమయంలో ఏనుగులు అసౌకర్యానికి గురికావడంతో పాటు అవి పంటలను తినకుండా దూరంగా వెళ్లిపోవడం జరుగుతుంది. ఈ కారణంగా ప్రజలకు, ఏనుగులకు మధ్య ప్రమాదకరమైన భౌతికసంఘర్షణ తలెత్తే అవకాశాలు తగ్గించబడే అవకాశం కూడా ఉంది.
తక్కువ ఘ్రానశక్తి కారణంగా పక్షులు మిరపఘాటుకు తక్కువగానే గురికావడం వల్ల పక్షుల విత్తనాల (పరిణామాత్మక ఉపయోగాలను కింద చూడండి) నుంచిక్షీరద సంబంధితజంతువును దూరంగా ఉంచేందుకు ఇది ఉపయోగపడగలదు.
ఎర్ర మిరప అధిక మొత్తంలోవిటమిన్ సి, కెరోటిన్ (ప్రోవిటమిన్ ఎ) ను కలిగి ఉంటుంది.పసుపు, ప్రత్యేకించి పచ్చని మిరప రకాలు (ఇవి ప్రత్యేకించి పక్వానికి రాని ఫలాలు) మాత్రం పై రెండు అంశాలను గణనీయమైన స్థాయిలో తక్కువగా కలిగిఉంటాయి. మరోవైపు మిరపలో పైన చెప్పిన అంశాలే కాకుండా, అత్యధికభాగం బి విటమిన్లు,, విటమిన్ బి6 లాంటివి సంవృద్ధికరంగా ఉంటాయి. అలాగేపొటాషియం,మెగ్నీషియం,,ఇనుము లాంటివి కూడా అత్యంత పెద్ద మొత్తంలో ఉంటాయి. మిరపలో ఎక్కువగా ఉండే విటమిన్ సి అనేదిభోజనంలో భాగమైన బీన్స్, ధాన్యాల నుంచి హీమ్ రహిత ఇనుమునిశరీరం గ్రహించే తీరుని సైతం అధికం చేస్తుంది.
క్యాప్‌సైసిన్ విషయంలో క్షీరదాలు మాదిరిగానేపక్షులు కూడా అదేరకమైన సూక్ష్మగ్రాహత్యను కలిగిలేవు, ఎందుకంటే క్షీరదాల విషయంలో క్యాప్‌సైసిన్ అనేది ఒక ప్రత్యేకమైననొప్పి గ్రాహకాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. మిరపకాయలు పండే ప్రాంతంలో పక్షులు వాటిని ఏమాత్రంభయం లేకుండా తినేస్తుంటాయి. పక్షుల కారణంగా మిరపకాయల్లోని విత్తనాలు ఇతర ప్రాంతాలకు పంపిణీ అవుతుంటాయి. మిరప పండ్లను తిన్న సమయంలోపక్షులు విత్తనాలను వదిలేస్తుంటాయి, అలాగే పక్షి నోటిలోకి ప్రవేశించిన మిరప విత్తనాలు ఏవిధంగానూ రూపం మారకుండానే వాటి జీర్ణవ్యవస్థ మార్గం ద్వారా ప్రయాణించి వెలుపలికి వచ్చేస్తాయి. ఈ రకమైన సంబంధం అనేది రక్షణాత్మక క్యాప్‌సైసిన్‌కు సంబంధించిన పరిణామాత్మకతను పెంపొందించి ఉండవచ్చు.[21] కాబట్టే ఉడుతలు, ఇతర క్షీరదజాతికి చెందిన చిన్నజంతువులు మిరపకాయలను తినకుండా నిరుత్సాహపర్చడంతో పాటు పక్షులను సైతం నిరుత్సాహపరిచేందుకు పక్షులు తినే గింజల్లో ఉండే విత్తనాలను శుద్ధి చేయడానికి ఈ పదార్థం ఆధారంగా తయారయ్యే ఉత్పత్తులు అమ్ముడయ్యాయి. వివిధ రకాల కీటకాల ద్వారా బయటి చర్మానికి గాట్లు పెట్టడం ద్వారా శరీరంలోకి ప్రవేశించే మైక్రోబియల్ ఫంగి విషయంలోనూ క్యాప్‌సైసిన్ అనేది రక్షణాత్మక యంత్రాంగాన్ని కలిగి ఉంటుంది.[22]
ఎక్కువభాగం దక్షిణ అమెరికాలో మిరప మొక్క, దాని పండు లాంటివిఅజి,లొకోటో,చిల్లీ, లేదారొకోటో అనే పేరుతో సుపరిచితమైనప్పటికీ, చిల్లీ అనే అక్షరక్రమం విస్తారంగా ఉపయోగించబడుతోంది. అయినప్పటికీ,అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోన్ని కొన్ని ప్రాంతాలు ఈ రకమైన ఉచ్ఛారణ ఉపయోగించడాన్ని నిరుత్సాహపరుస్తున్నాయి. ప్రసిద్ధ నైరుతి అమెరికా వంటకం (చిల్లీ కాన్‌కర్న్‌గా కూడా సుపరిచితం కావడమే కాకుండా (చిల్లీ, మాంసంతో కలిపిచేస్తారు) టెక్సాస్ యొక్క అధికారిక రాష్ట్ర వంటకంగానూ ఉంటోంది[23]) గురించి చెప్పేందుకు, దాన్ని పరిమళభరితం చేసేందుకు ఉపయోగించే మిరప పొడి, ఇతర దినుసులను సూచించేందుకు సైతం సాధారణంగా ఈ అక్షరక్రమంతో కూడిన పదాన్నే ఉపయోగిస్తుండడమే అందుకు కారణం. మరోవైపుచిలీ అనే అక్షరక్రమాన్ని సిన్‌సినటి చిల్లీని సూచించే సందర్భంలోనూ ఉపయోగిస్తున్నారు. ఎలాంటి మిరపకాయలనూ కలిగి ఉండని ఆహారపదార్ధాల కోసం దీన్ని ఉపయోగించడం జరుగుతోంది. మిరప పొడి ఎండిన మిరపకాయల ద్వారా చేసిన పొడి అనే విషయాన్నే సూచిస్తాయి.
చిలీ అనే అక్షరక్రమం సైతం చిల్లీ పదానికి ప్రత్యామ్యాయంగా ఉపయోగించబడుతోంది, మెక్సికోలోను[24] అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలు,కెనడాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ రకమైన ఉపయోగం సర్వసాధారణం. ఇది ప్రత్యేకించి మిరపచెట్టు, దాన్ని ఫలం గురించి సూచిస్తాయి. అమెరికా నైరుతిలో (ప్రత్యేకించి ఉత్తర న్యూ మెక్సికో) చిలీ అనే మాట చిక్కని, ఘాటుగా, వెనీగర్ లేకుండా ఉండే ఒక సాస్‌ని సూచిస్తుంది. ఇది ఎర్రని, పచ్చ రంగుల్లో లభించడంతో పాటు తరచుగా ఈ సాస్‌ని న్యూ మెక్సికన్ ఆహారం మీద వడ్డిస్తారు.
చిలీ అనే అక్షర క్రమం మిరప పండును సూచించడం కోసం నహుటల్ భాష యొక్క అసలైన రోమనీకరణకు సంబంధించింది.[25]
మరోవైపు ఆంగ్లంలోచిల్లీగా పిలవబడే మిరపమొక్కకు చిలీ దేశం పేరుకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. క్యూచువాచిన్ ("శీతల"),చిలి ("మంచు"), లేదాచిల్లీ ("భూభాగం అంతమయ్యే చోటు") అనే అర్థం నుంచి ఈ దేశం పేరు ఉద్భవించింది. చిలీ, ప్యూర్టో రికో రెండూ కూడా స్పానిష్ మాట్లాడే దేశాలు. ఈ రెండు దేశాల్లో టైనో మూలానికి చెందిన పదమైనఅజి అనే పదాన్ని మిరపకాయలను సూచించడానికి ఉపయోగిస్తుంటారు.
మరోవైపు మిరపకాయలను సూచించేందుకుపెప్పర్ అనే పదం ఉపయోగించడం గురించి కూడా కొంత అనంగీకారం వ్యక్తమమవుతోంది. ఎందుకంటేపెప్పర్ అనేది నిజానికి పైపెర్ తరగతికి చెందినదే తప్ప క్యాప్సికమ్‌కు చెందినది కాదు; అయినప్పటికీ, ఈ రకమైన పదప్రయోగంఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ (పెప్పర్ యొక్క అర్థంలో), మెర్రియమ్-వెబ్‌స్టర్‌లతో సహా[26] అంతేకాకుండాపెప్పర్ అనే పదాన్ని సాధారణంగావృక్షశాస్త్ర, పాకశాస్త్ర రంగాల్లో వివిధ రకాల మిరపకాయలన్ని సూచించేందుకు ఉపయోగించబడుతోంది.
మిరపకాయ (చిల్లీ పెప్పర్) అనేది సొలనేసి కుటుంబం, సొలనేసి లోని మిరప కాప్సికమ్ తరగతికి చెందిన మొక్కలకు కాచే ఒక పండు. మిరపకాయలనేవి మొదట అమెరికాల్లో వెలుగుచూశాయి. కొలంబియన్ ఎక్ఛేంజ్ తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం, ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది.
మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి, ఘాటు గుర్తుకు వస్తుంది .. కాని మిరప లేకుండా వంట సాగదు,పచ్చి,పండు, ఎండు మిరప లను మనము వాడుతాం . మిరప భారతీయ మొక్క కాదు . మన వారు కారం కోసం మిరియం వాడేవారు .
వైద్యపరంగా : తగు మోతాదు లో మిరప కాయలను గాని మిరప గుండను గాని వాడితే :
ఆర్థరైటీస్ నొప్పి,హెర్పెస్ జోస్టర్ సంబంధిత నొప్పి,డయాబెటిక్ న్యూరోపతి,పోస్ట్‌మ్యాస్టెక్టోమీ నొప్పి,,తలనొప్పల ........ నుంచి ఉపశమనం పొందే విషయంలో క్యాప్‌సైసిన్ అనేది ఒక సురక్షితమైన, ప్రభావవంతమైన స్థానిక (Local) నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.
దీనిలో ఉండే "కాప్సాసిన్(Capsaicin)" కీళ్ళ నొప్పులు,తలనొప్పి, మున్నగు నొప్పులను తగ్గిస్తుంది .కాన్సర్ కణాలను నాశనం చేస్తుంది .స్థూల కాయం ఉన్నా వాళ్లుకి బరువు తగ్గెండుకు ఉపయోగపడుతుంది .పాంక్రియాస్ లోని నరాలు పై పనిచేసి ఆ కణాలు insulin తయారు చేసేందుకు దోహదపడుతుంది .కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది,అన్నంతో కనిపి తింటే ఆకలి తగ్గిమధుమేహ ఉన్నా వారికి, ఉబకాయం గల వారికి మేలుచేస్తుంది .
వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి
మిరపకాయలు, పచ్చిమిర్చి- - డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
భారతీయత,భారతీయ వంటకాలు వీటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరికైనా గుర్తుకు వచ్చేది మిరప, పచ్చిమిర్చి, పండు మిర్చి ఇవి రెండూ భారతీయ వంటకాల్లో కీలక స్థానం పోషిస్తాయి. నాలుగు వందల ఏళ్ల క్రితం భారతీయులకి మిరప తెలియదు. ఆ రోజుల్లో కారం రుచి కోసం మిరియాల మీదనే ఆధారపడేవాళ్లు. పొడవుగా, మెలికలు తిరిగి వాడిగా కనిపించే మిరపను చూసి,తేలులాగా కుడుతుందని భావించేవారు. పోర్చుగీసు వారు భారతదేశానికి మిరపను పరిచయం చేశారు. తరువాతి కాలంలో ఇది భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది.
మిరపలోని గుణాలను బట్టి ఆయుర్వేదం దీనిని కటువీర, రక్తమిర్చి, పిత్తకారిణి, లంక తదితర పేర్లతో వ్యవహరిస్తుంది. మిరప చెట్టులో అనేక రకాలున్నాయి. ముఖ్యంగా తెల్లపువ్వులు కలిగిన మొక్క మొదటిరకం. దీనిలో తీక్షణత ఎక్కువ.ఆకుపచ్చనిపువ్వులు కలిగినది రెండవ రకం. దీనిలో తీక్షణత తక్కువ. మిరప పండ్లు, కాయల్లో చాలా తేడాలున్నాయి. ఆకారాన్నిబట్టి, ఆకృతిని బట్టి, రంగును బట్టి, రుచిలో తీక్షణతను బట్టి మిరపకాయలు, పండ్లు రకరకాలుగా లభిస్తున్నాయి. అవసరాన్నిబట్టి వీటిని వాడుతుంటారు. మిరపలో ‘క్యాప్పైసిన్’ అనే పదార్థం తాలూకు మొత్తాన్నిబట్టి దీని తీక్షణత ఆధారపడి ఉంటుంది. మిరపలోని ఘాటుదనం లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. లాలాజలంలో పిండి పదార్థాలను పచనం చెందిందే సెలైవరీ ఎమైలేజ్ ఉంటుంది. ఈ కారణంగానే భక్ష్యాలను వండేటప్పుడు మిరపను తగలనిస్తే, అవి చక్కగా జీర్ణమవుతాయి. మిరపలో విటమిన్-ఎ, విటమిన్-సి తదితర పదార్థాలుంటాయి. ఇవి ఆరోగ్యానికి హితం చేస్తాయి. మిరపశరీరంలో పేరుకుపోయిన విష తత్వాలను నిర్వీర్యపరుస్తుంది. ముఖ్యంగా పెద్ద పేగులో సంచితమైన హానికర విష రసాయనాలను శుభ్రం చేస్తుంది. అలాగే మిరప రక్తశోధకంగా కూడా పనిచేస్తుంది. మద్రాస్‌కి చెందిన కేన్సర్ రీసెర్చ ఇన్‌స్టిట్యూట్ పచ్చిమిర్చిలో కేన్సర్‌ను నిరోధించే అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ధ్రువీకరించింది.
గొంతు బొంగురు (స్వర భంగం) --ఒక టీ స్పూన్ పంచదారను, ఒకటి రెండుబాదం గింజలను, ఒక పండు మిరపకాయను కలిపి దంచండి. దీనిని చిన్నచిన్న ఉండలుగా తయారుచేసి తీసుకుంటే గాయకులకు, ఉపన్యాసకులకు, టీచర్లకు, లెక్చరర్లకి గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది.
కడుపు నొప్పి—100 గ్రాముల బెల్లంలో ఒక గ్రాము ఎర్ర మిరప పొడిని కలిపి చిన్నచిన్న మాత్రలుగా తయారుచేసి నీళ్లతో తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది. అర గ్రాము ఎండు మిరప పొడిని 2 గ్రాముల శొంఠి చూర్ణంతో కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపునొప్పి తగ్గుతాయి.
అరుచి—125 గ్రాముల మిరపగింజలను అర కిలోనువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద గింజలు మాడిపోయే వరకూ వేడి చేయండి. తరువాత వడపోసి సీసాలో నిల్వ చేసుకోండి. మిరప గింజల తైలం సిద్ధమవుతుంది. శరీరంలో వేడి పెరిగిపోవటం, పైత్యం పెరగటం వంటి సమస్యల వల్ల ఆహార పదార్థాల రుచి తెలియకపోతుంటే, ఆకలి తగ్గితే, ఈ మిరప గింజల తైలాన్ని 5 నుంచి 30 చుక్కలు ఒక టీస్పూన్పంచదారతో కలిపి తీసుకోండి. దీంతో ఆకలి పెరుగుతుంది.
కలరా (వాంతులు, విరేచనాలు) --మిరప గింజలను చెరిగి శుభ్రం చేసి, మెత్తగా పొడిచేసి గుడ్డతో వస్తగ్రాళితం చేయండి. దీనిని ఒక చిటికెడు తీసుకొని చిటికెడు కర్పూరం, చిటికెడు పొంగించిన ఇంగువ పొడిని కలిపి, తగినంత తేనె కలిపి తీసుకోండి. లేదా వీటి మిశ్రమాన్ని 125 మిల్లీగ్రాముల మాత్రలుగా చేసి నిల్వ చేసుకొని ప్రతి రెండు గంటలకూ ఒక్కోటి చొప్పున నీళ్లతో వేసుకుంటేకలరా వ్యాధిలో నాడి తగ్గిన సందర్భాల్లో నాడి వేగం పెరుగుతుంది.
నల్ల మందు, పొంగించిన ఇంగువ వీటిని సమంగా కలిపి 125 మి.గ్రా. మాత్రలుగా చేయండి. దీనిని మిరప కషాయంతో తీసుకుంటే కలరా వ్యాధి తగ్గుతుంది. 125 గ్రాముల మిరపకాయలను అర కిలో నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద గింజలు మాడిపోయే వరకూ వేడి చేయండి. తరువాత దించి వడపోసి నిల్వ చేసుకోండి. మిరప తైలం సిద్ధం. కలరాలో విరేచనాలు,వాంతుల తరువాత ఈ తైలాన్ని పూటకు అర టీస్పూన్ మోతాదుగా రెండు మూడు పూటలు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎండు మిరపకాయల పొడిని తేనెతో కలిపి రేగు గింజలంత మాత్రలుగా తయారుచేసి పెట్టుకోండి. కలరా వ్యాధిగ్రస్థునికి గంటకో మాత్ర చొప్పున చన్నీళ్లతో ఇస్తే ప్రమాదం నుంచి బయటపడతాడు.
మధుమేహం --మిరియం తైలాన్ని రెండు మూడు చుక్కలు లస్సీతోకలిపి తీసుకుంటే మూత్రంలో మంట, మూత్రంలో సుద్ద పోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.
మూత్రంలో మంట--3 గ్రాముల ఈసబ్‌గోల్ గింజల పొడిని మూడు నాలుగు చుక్కలు మిరప తైలంతో కలపండి. దీనిని నీళ్లకు కలిపికషాయం తయారుచేసి తీసుకుంటే పైత్యం కారణంగా వచ్చిన మూత్రంలో మంట తగ్గుతుంది.
ఎగ్జిమా,దురద, కీళ్లనొప్పి, కుక్కకాటు,కందిరీగ కాటు వంటి సమస్యల్లో మిరప పండ్ల తైలాన్ని పై పూతగా వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
↑"HORT410. Peppers - Notes".Purdue University Department of Horticulture and Landscape Architecture. Archived fromthe original on 26 December 2018. Retrieved20 October 2009.Common name: pepper. Latin name: Capsicum annuum L. ... Harvested organ: fruit. Fruit varies substantially in shape, pericarp thickness, color and pungency.
↑పెర్రి, L.et al. 2007. స్టార్చ్ ఫొస్సిల్స్ అండ్ ది డొమెస్టికేషన్ అండ్ డిస్పర్సల్ అఫ్ చిల్లి పెప్పర్స్ (కాప్సికం spp. L.) ఇన్ ది అమెరికాస్.సైన్స్ 315: 986-988.
↑S కోసుగే, Y ఇనగాకి, H ఒకుమురా (1961). రెడ్ పెప్పర్ కారమైన సూత్రాలు పై అధ్యయనాలు భాగం VIII. కారమైన సూత్రాల యొక్కరసాయన నిర్మాణం. నిప్పాన్ నోయేగి కగకు కైషి (J. అగ్రిక్. కెం. Soc.), 35, 923–927; (en) కెం. అబ్స్టర్. 1964, 60, 9827g.
↑(ja) S కోసుగే, Y ఇనగాకి (1962) రెడ్ పెప్పర్ కారమైన సూత్రాలు పై అధ్యయనాలు. భాగం XI. రెండు తీక్ష్ణమైన వివరణ , విషయములు