మదీనా (అరబ్బీ المدينة المنورة అల్-మదీనతుల్-మునవ్వరా లేదా المدينة అల్-మదీనా; అధికారికంగాఅల్-మదీనతుల్-మునవ్వరా) ఇదిహిజాజ్,సౌదీ అరేబియాకు పశ్చిమాన గల ప్రాంతం,,అల్-మదీనా రాష్ట్రపు రాజధాని.ఇస్లాం లోని రెండవ అతిపవిత్రమయిన నగరం.ముహమ్మద్ సమాధిగల నగరం. ముహమ్మదుప్రవక్త తన అనుయాయులతో కలసిమక్కా నుండి వలసహిజ్రత్ చేసిన నగరం కూడానూ.
మదీనాలో ప్రస్తుతం జనాభా 1,300,000 కన్నా ఎక్కువ గలదు (2006). దీనికి ప్రాచీన నామంయస్రిబ్. దీనికి ఈనామం రోమన్లతో జరిగిన యుద్ధములో యూదులు ఓడిపోయి కాందిశీకులుగా అరేబియాలో నివాసమేర్పరచుకొన్నారు. తరువాతికాలంలో దీనికిమదీనతున్-నబి (مدينة ﺍﻟﻨﺒﻲ "ప్రవక్తగారి నగరం") లేదాఅల్ మదీనా అల్ మునవ్వరా (ప్రకాశింపబడిన నగరం) ("జ్ఞానోదయ నగరం" లేదా "తేజో నగరం""), సూక్ష్మంగామదీనా అర్థంనగరం. మదీనామక్కా నగరానికి 338 కి.మీ. ఉత్తరాన, ఎర్రసముద్రతీరానికి తూర్పున 193 కి.మీ. దూరాన గలదు.ఇస్లాంలో మక్కా తరువాత మదీనా 2వ పవిత్రనగరం.హిజాజ్ ప్రాంతంలోని సారవంతమైననేలపై వ్యాపించియున్నది. కొండలు, పర్వతపంక్తుల మధ్యలో వ్యాప్తి చెందిన నగరం.
ఈ నగరం 30 నుండి 40 అడుగుల ఎత్తుగల బలిష్ఠమైన వర్తులాకారపుకోటగోడలచే 12వ శతాబ్దంలో నిర్మింపబడింది. దీనికి నాలుగు ప్రధాన ద్వారాలుగలవు. అందులో అత్యంతప్రాశస్తమైనది అందమైనదిబాబ్-అల్-సలామ్ ద్వారం, లేదా 'ఈజిప్షియన్ గేట్'. కోటగోడలకు ఆవలగూడా పశ్చిమాన, దక్షిణాన ఇండ్లు, మైదానలు, తోటలు, వనాలు గలవు. వీటికిగూడా గోడలు, ద్వారాలు గలవు.
మస్జిద్-ఎ-నబవి (ప్రవక్తగారి మస్జిద్) నగరానికి తూర్పునగలదు. ఇదిమక్కా లోనిమస్జిద్-అల్-హరామ్ను పోలియుంటుంది. దీని దాలానము 500 అడుగులు గలదు. దీనిగుంబద్ మూడు ఎత్తైనమీనార్ లతో అత్యంత హుందాతనాన్నిగల్గివున్నది.మహమ్మదు ప్రవక్త గారి సమాధి, (సా.శ. 632) ఈ మస్జిద్ కు ఆనుకునేవున్నది. హాజీలందరూ ఇక్కడ పరమభక్తితో మెలగుతారు. ఇచ్చటదుఆ (మొర, ప్రార్థన) చేస్తే, ఇతరచోట్ల చేసే దుఆ కన్నా 1000 రెట్లు అధిక ప్రాధాన్యత గలిగినది.[1]
మదీనా నగరానికి బహుముఖప్రాముఖ్యంగలదు. దీనికి మహమ్మద్ ప్రవక్త జీవనకాలంలోనేప్రవక్తగారి నగరం అని పేరు వచ్చింది. ఇందుమస్జిద్-ఎ-నబవి గలదు.మహమ్మదు ప్రవక్త గారి సమాధి ప్రవక్తగారి ఇంటిలోనే గలదు.ఉమయ్యద్ ఖలీఫాఅల్-వలీద్ కాలంలో ప్రవక్తగారి సమాధి మస్జిద్-ఎ-నబవి అంతర్భాగము చేయబడింది.ఇస్లాం మతము లో మొదటి మస్జిద్ అయినమస్జిద్-ఎ-ఖుబా మదీనాలోనేగలదు. ఈమస్జిద్ సా.శ. 850 లో పిడుకుపాటుకారణంగా శిథిలమైనది. సా.శ. 1487లో ఈజిప్టుపాలకులైనఖైత్ బే కాలంలో పునర్మింపబడింది.[1]
మక్కా నగరంలోలాగ మదీనాలో కూడా ముస్లిమేతరులకు ప్రవేశం నిషిద్ధం. మదీనాలోని మస్జిద్-ఎ-నబవి, కొద్ది ప్రాంతంలోనే నిషిద్ధం. మదీనాలోని ఇతరప్రాంతంలో ముస్లిమేతరులకు ప్రవేశం గలదు. మదీనాలోనిమస్జిద్-ఎ-నబవిలో ప్రార్థనలు చేస్తే ఇతర మస్జిద్ లలో (మక్కాలోనిమస్జిద్-అల్-హరామ్ను తప్పించి) 1000 ప్రార్థనలకన్న మిన్న అని ధార్మికగ్రంథాలు చెప్పుచున్నవి.
బనూ ఆస్,బనూ ఖజ్రజ్లుయెమన్ నుండి మదీనా వచ్చి స్థిరపడ్డారు, దీంతో మదీనా స్థితి మారిపోయిది. ప్రథమంగా వీరు యూదుల వద్ద వర్తకం చేస్తూవుండేవారు. తరువాత తిరుగుబాటు చేసి వ్యాపారాన్ని స్వంతంగా చేపట్టారు.[4] 5 వ శతాబ్దాంతం[5], యూదులు క్రమంగా నగరంపై తమ పట్టును కోల్పోయారు. చాలా మంది నవీన చరిత్రకారుల ప్రకారం, యూదుల తెగలు బనూ ఆస్, బనూ ఖజ్రజ్ వద్ద వర్తకం చేయనారంభించారు.[6]విలియమ్ మాంట్ గామరి వాట్ ప్రకారం, యూదుల వర్తకం క్రమేపీ తగ్గడానికి కారణం, వారు రాజకీయంగా స్వతంత్రులుగా మెలగడమేనని.
ఇబ్న్ ఇస్ హాఖ్ (ఇస్లామీయ చరిత్రకారుడు) ప్రకారం యెమన్ కు చెందిన 'తుబ్బా' వంశపు రాజు, 'యస్రిబ్' ప్రజలకు మధ్య పరస్పరయుధ్ధాలు జరిగేవి.</ref> ఒక ఒయాసిస్సు దాటుతుండగా రాజకుమారుడిని అక్కడివాసులు దాడిచేసి చంపేశారు, ప్రజలను భయకంపితులనుచేసి తరిమివేయడానికి రాజు అక్కడవున్న ఖర్జూరపుతోటను నరికివేశాడు. రాజును నివారిస్తూ రబ్బీలు ఈ తోటను నరకవద్దని సూచిస్తారు. కారణం వివరిస్తూ ఇక్కడికి ఖురేషుల ప్రవక్త వస్తాడని ఇదే అతడి నివాసస్థలమని చెబుతారు. యెమన్ రాజు ఆ తోటను నాశనం చేయకుండా యూదమతాన్ని స్వీకరిస్తాడు. యెమన్ రాజు ఆ రబ్బీలను తనతో మక్కాకు తీసుకు వెళతాడు. రబ్బీలు కాబా చేరి, ఇదేఇబ్రాహీం పునర్నిర్మించిన ఆరాధనాగృహమని గ్రహించి యెమన్ రాజును ఈ విధంగా బోధిస్తారు; "మక్కావాసులు ఆచరించినట్లు నీవునూ ఆచరించుము, దీని చుట్టూప్రదక్షిణలు చేయి, ఈ గృహాన్ని గౌరవించు, తలనీలాలు తీసివేయి, నీలోని అహాన్నంతటినీ త్యజించు", యెమన్ చేరినపుడు, రబ్బీలు యెమన్ వాసులకు చూపిన ఎన్నో మహత్తులను చూసి యెమన్ వాసులు యూదమతములోకి ప్రవేశిస్తారు.[7]
తదనంతరం బనూ ఆస్, బనూ ఖజ్రజ్ వైరంపెంచుకొన్నారు, మహమ్మద్ ప్రవక్త హిజ్రత్ కాలం తరువాత వరకుకూడా యుద్ధాలు సాగిస్తూనేవచ్చారు. వీరి మధ్య వైరం 120 సంవత్సరాలుగా కొనసాగుతూనేవున్నది.[8] బనూ నాదిర్, బనూ ఖురైజా బనూ ఆస్ తో ఏకమయ్యాయి, బనూ ఖైనుఖా ఖజ్రజ్ తో సంబంధాలు పెంచుకొన్నవి.[9] వీరు మొత్తం నాలుగు యుధ్ధాలు చేశారు.[4]
వీరి మధ్య తీవ్ర రక్తపాత యుధ్ధం "బుఆత్ యుధ్ధం" జరిగింది.[4] మహమ్మదు ప్రవక్త రాక కొద్ది సంవత్సరాల మునుపు వరకూ ఈ యుధ్ధం జరుగుతూనే యున్నది.[2] ఈ యుధ్ధం ఏలాంటి ఫలితం లేకుండానే జరిగింది, 'అబ్దుల్లా ఇబ్న్ ఉబై' ఖజ్రజ్ నాయకుడు ఈ యుధ్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు, శాంతికాముకుల్లో ఇతడి పట్ల ఆదరణ పెరిగింది. మహమ్మదు ప్రవక్త రాక పూర్వం ఇతనే యస్రిబ్ లో అత్యంత గౌరవంతుడు.
622 లో మహమ్మదు ప్రవక్తముహాజిరూన్ (వలసచేసినవారు) లతో కలిసి మక్కాను వదిలి యస్రిబ్ చేరారు. ఇస్లాం స్వీకరించినకారణంగా ఆస్, ఖజ్రజ్ ల వైషమ్యాలు తొలగాయి. యస్రిబ్ లో రాజకీయ సమతౌల్యాలు చక్కబడ్డాయి. మహమ్మదు ప్రవక్త నానమ్మ వంశజులు ఖజ్రజ్ కు చెందిన వారు, ఖజ్రజ్ లు యస్రిబ్ కు నాయకులుగా ప్రజలు ఇస్లాం స్వీకరించుటకు సహకరించారు, ముస్లింలందరినీ ఏకీకృతం చేశారు వీరికిఅన్సార్ (పోషకులు) గా అభివర్ణించి అలాగే సంబోధించడం ప్రారంభించారు. మహమ్మదు ప్రవక్త వచ్చిన తరువాత యస్రిబ్ 'మదీనా' (నగరం) గా గుర్తింపబడింది.
ఇబ్న్ ఇస్ హాఖ్ అనుసారం, ముస్లింలు, యూదులు ఒక ఒడంబడిక చేసుకొన్నారు, దీనినే "మదీనా రాజ్యాంగం" అని అంటారు. దీని వల్ల ముస్లింల యూదుల మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి.
623 జనవరిలో "ఉబైదా ఇబ్న్ హారిస్" నాయకత్వంలో శత్రువులపై సమరభేరీకి మహమ్మదు ప్రవక్త ఆదేశించారు. ఈ శత్రువుల కారవాన్అబూ సుఫియాన్ ఇబ్న్ హర్బ్ నాయకత్వంలో సిరియానుండి మక్కాకు వెళ్ళేదారిలో ప్రయాణిస్తుండేది. వీరిపై అగ్నిబాణాల వర్షాన్ని కురిపించారు. కానీ ఎక్కువ నష్టాన్ని కలుగజేయలేక పోయారు.[10] ఉబైదాకు "ఇస్లాం కొరకు బాణంవిడిచిన మొదటి వీరుడి"గా గౌరవం దక్కింది. అబూ సుఫియాన్ యుధ్ధతాకిడికి తట్టుకోలేక మదీనాలో కల మక్కావాసులకు మొర పెట్టుకొన్నాడు, అనక ఉబైదా ఈ బద్ర్ యుధ్ధంలో మరణించాడు.[11]
మహమ్మదు ప్రవక్త , యూదుల మధ్య జరిగిన ఒడంబడికలు నిలువలేక పోయాయి, యూదులు మహమ్మదు ప్రవక్తకు ప్రవక్తగా అంగీకరించుటకు సిధ్ధపడలేదు, జరిగిన ఒడంబడికకూ కట్టుబడడానికి అంగీకరించలేదు. బద్ర్ యుధ్ధం లో ముస్లింలకు విజయం వరించింది, తెగల మధ్య వైషమ్యాలను పోషిస్తూవచ్చిన బనూ ఖానుఖా తెగపై పట్టు బిగించి యుధ్ధనివారణోపాయంగా తెగలోని వారందరికీ క్షమాబిక్ష ప్రసాదించి నగరంనుండి వెలి వేశారు.
625 లో అబూ సుఫియాన్ ఇబ్న్ హర్బ్ ఇంకొకసారి మక్కాబలగాలను మదీనాపై దండెత్తడానికి కొనసాగించాడు. మహమ్మదు ప్రవక్త తన బలగాలను తీసుకొని పోరాటానికి సిధ్ధమయ్యారు. ఈ యుధ్ధంలో మక్కా బలగాలు వెనుకడుగు వేశాయి, అయిననూ రణరంగంలో గల కొండను మదీనా వాసులు కోల్పోయారు, ఈ కొండవెనుకభాగంనుండి మక్కా సేనలు తీవ్రంగా విరుచుకు పడ్డాయి. ముస్లింలు "ఉహద్ యుధ్ధం" ఓడిపోయారు. మదీనా వాసులపై లభించిన విజయంతో మక్కావాసులకు ఏలాంటి లాభం కలుగని కారణంగా మక్కాకు తిరుగుప్రయాణమయ్యారు.
చిత్రకళాఖండం, మదీనాలోని మస్జిద్ ను సూచిస్తున్న కళాఖండం, ప్రస్తుతం ఇదిటర్కీ లోని ఇజ్ఞిక్ లో గలదు. ఈ చిత్రంలో సంపూర్ణ భాగం, సిలికేట్ కోటింగ్, పారదర్శక గ్లేజింగ్, ఈ గ్లేజింగ్ క్రింద రంగులు ఉన్నాయి.
627 లో అబూ సుఫియాన్, మదీనావాసులపై ఇంకోసారి దండయాత్ర సాగించాడు. ఈ సందర్భంలో మదీనావాసులు తమ నగరాన్ని కాపాడుకొనుటకు మదీనా చుట్టూ ఒక కందకాన్ని త్రవ్వించారు. దీని పేరుమీదుగానే ఈ యుధ్ధానికిఖందఖ్ యుధ్ధం అనే పేరు. ఈ సందర్భంలోనూ అబూసుఫియాన్ కు కొద్దిగా విజయం కలిగింది, అబూసుఫియాన్ మదీనాలో గల యూదు తెగ బనూ ఖురైజాలతో మంతనాలాడి వారితో ఒక సంధి చేసుకొన్నాడు, ఈ సంధి ప్రకారం నగరంలోగల ముస్లింలపై కుట్రపన్ని సంహరించుటకు నిశ్చయించడమైనది. ఈ విషయం తెలుసుకొన్న మదీనా ముస్లింలు యూదులతో చేసుకొన్న ఒడంబడిక విఫలంచేసినయూదులతో యుధ్ధానికి సిధ్ధమయ్యారు. బనూ ఖురైజా పై ఆక్రమించారు, బనూ ఖురైజా లొంగిపోయింది. బనూ ఆస్ కు చెందిన కొందరు మహమ్మదు ప్రవక్తతో సంప్రదించిసాద్ ఇబ్న్ ముఆజ్ను న్యాయమూర్తిని చేశారు.
ముహమ్మద్ ప్రవక్తగారిహిజ్రత్ (మక్కానుండి మదీనాకు వలస) తరువాత మదీనాకు అత్యంత ప్రాముఖ్యం ఏర్పడినది. మహమ్మద్ ప్రవక్తమక్కాను స్వాధీనంచేసుకొన్నతరువాతగూడా మదీనా ప్రాముఖ్యం తగ్గలేదు. తరువాతికాలంలోఖలీఫాల ముఖ్యపట్టణంగా విరాజిల్లినది.
20వ శతాబ్దంలో రెండవప్రపంచయుధ్ధకాలంలో ఆక్రమణలకు గురైంది. మదీనాఉస్మానియా సామ్రాజ్యపు నగరం. హాషిం సంతతికి చెందినమక్కా నగరపు 'షరీఫ్' లేక 'అమీర్' ఆధ్వర్యంలోగల నగరం.ఫఖ్రిపాషా ఉస్మానియా సామ్రాజ్యానికి చెందినమదీనా గవర్నరు. హుసేన్ బిన్ అలీ, మక్కాకు చెందిన షరీఫ్, మదీనాను ఆక్రమించుకొన్నాడు.సౌదీ అరేబియాకు చెందినఇబ్న్ సౌద్ హుసేన్ బిన్ అలీని ఓడించి మదీనానుహిజాజ్లో కలిపాడు.
మక్కా నగరంలోలాగా మదీనాలోకూడా ముస్లిమేతరులకు ప్రవేశం నిషిధ్ధం.విజ్ఞానవిత్తనగరంగా నిర్మించుటకు ఒక బృహత్తర కార్యక్రమంచేపట్టారు. ఈకార్యక్రమంద్వారా పరిశ్రమలుస్థాపించడం, ఉద్యోగాలను సృష్టించడం.[12]