పాట్నాబీహార్ రాజధాని నగరం. దీని ప్రాచీన నామంపాటలీపుత్ర. ప్రస్తుతం ఈ నగరంగంగానది దక్షిణ తీరాన కేంద్రీకృతమై ఉంది. ఇదే నగరంలో కోసీ, సోన్, గండక, పున్‌పున్ అనే నదులు కూడా ఉన్నాయి. 25 కి.మీ పొడవు 9 నుంచి 10 కిమీ వెడల్పు ఉంది. భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 14వ స్థానంలో ఉంది.
పాట్నా చాలా కాలం నుంచి నిరంతరంగా ప్రజలు నివసిస్తున్నటువంటి నగరంగా పేరు గాంచింది.[1]
పూర్వం ఒకప్పుడుపుత్రుడు అనే ఒక రాజు, ఆయన భార్యపాటలి కలిసి ఈ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది.[2]పూర్వ కాలంలో ఇది హర్యంక, నందులు, మౌర్య వంశం, సుంగ వంశం, గుప్తులు, పాల వంశస్థులు, సూరి వంశస్థులు పరిపాలించినమగధ దేశపు రాజధాని. అంతే కాకుండా ఈ నగరం అనేక కళలకు, విజ్ఞానాన్ని పంచడంలో కూడా మేటిగా విలసిల్లింది. మౌర్యుని కాలంలో ఇక్కడ సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు నివసించేవారు.[3] ప్రాచీన నగరం ఇప్పుడు ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతోంది.
హిందూ, బౌద్ధ, జైన తీర్థయాత్రా స్థలాలైన వైశాలి, రాజ్‌గిర్, నలంద, బుద్ధగయ, పావాపూరి మొదలైన ప్రదేశాలు పాట్నాకు అతి సమీపంలోనే ఉన్నాయి. పాట్నా సిక్కులకు కూడా పవిత్రమైన నగరమే. 10వ సిక్కు గురువైన తక్త్ పాట్నా సాహిబ్ ఇక్కడే జన్మించాడు.