పట్టణం: సాధారణంగా ఇది ఒక జనావాస ప్రాంతం. ఇదిగ్రామం కంటే పెద్దదిగానూనగరం కంటే చిన్నదిగానూ ఉంటుంది. దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగాపురపాలక సంఘం (మునిసిపాలిటి) కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు. పట్టణాలు సాధారణంగా గ్రామాల కంటే పెద్దవి, నగరాల కంటే చిన్నవే కానీ వాటిని వేరుచేసే ప్రమాణాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మధ్య గణనీయంగా మారుతుంటాయి.జనగణన పట్టణాలను చట్టబద్ధమైన పట్టణాలుగా పరిగణిస్తారు.
పట్టణాభివృద్ధిసంస్థల ప్రధాన విధులు ఆయా పట్టణాలలోభూమి ఉపయోగాన్ని పెంచటం, నీటి సరఫరా, మురుగుకాలవల నిర్మాణం, బైపాస్ రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మించటం, బలహీనవర్గాలకు గృహనిర్మాణం లాంటి ప్రాథమిక సదుపాయాలు కలిగించటంలో పాత్రవహిస్తాయి.