సినిమా నిర్మాణాన్ని పర్యవేక్షించే వ్యక్తిని నిర్మాత అంటారు.[1] నిర్మాణ సంస్థ ద్వారా స్క్రిప్టు రచన, దర్శకత్వం, ఎడిటింగ్, ఫైనాన్సింగ్ వంటి సినిమా నిర్మాణంలోని వివిధ అంశాలను నిర్మాత హోదాలో ప్రణాళికా చేసి, సమన్వయం చేస్తాడు.[2]
సినిమా విజయం కోసం సరియైన వారికి నియమించుకోవడం నిర్మాత బాధ్యత.[3] సినిమా ఇప్పటికే ఉన్న స్క్రిప్ట్‌పై ఆధారపడి ఉంటే తప్ప, నిర్మాత ఒక స్క్రీన్ రైటర్‌ని నియమించుకుని స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌ను పర్యవేక్షిస్తాడు.[4] సినిమా నిర్మాణాన్ని ప్రారంభించడానికి వీలు కల్పించే ఆర్థిక మద్దతును పొందేందుకు నిర్మాత నేతృత్వంలో ఇతర కార్యకలాపాలు జరుగుతాయి. అన్నీ విజయవంతమైతే, ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించబడుతుంది.
నిర్మాత సినిమా నిర్మాణంలోని ప్రీ-ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ దశలను కూడా పర్యవేక్షిస్తాడు. ఈ సినిమాకుదర్శకుడిని, అలాగే ఇతర కీలక వ్యక్తుతను నియమించే బాధ్యత కూడా ఒక నిర్మాత ఆధీనంలోనే ఉంటుంది. నిర్మాణ సమయంలో దర్శకుడు సృజనాత్మక నిర్ణయాలు తీసుకుంటే, నిర్మాత సాధారణంగా లాజిస్టిక్స్, వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తాడు, అయితే కొంతమంది దర్శకులు కూడా వారి స్వంత సినిమాలను నిర్మిస్తారు. నిర్మాత సినిమా నిర్ణీత సమయానికి బడ్జెట్ అందించడం, విడుదలకు ముందు చివరి దశలలో సినిమా మార్కెటింగ్, పంపిణీని పర్యవేక్షిస్తాడు.[5]
కొన్నికొన్ని సందర్భాలలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అసోసియేట్ ప్రొడ్యూసర్‌లు, అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌లు, లైన్ ప్రొడ్యూసర్‌లు లేదా యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్‌లను వివిధ పనులకోసం నియమించుకోవచ్చు, వారికి ఆయా పనులను అప్పగించవచ్చు.[6]
నిర్మాణ ప్రక్రియ దశలో నిర్మాత,దర్శకుడు,సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్ వంటి వ్యక్తులు ఒకచోట చేరి,[7] సినిమా స్క్రిప్ట్‌పై ఆధారపడి ఉండడంకోసం, నిర్మాత స్క్రీన్ రైటర్‌ని వెతకాలి.[8][9] స్క్రిప్టులో లోపాలుంటే కొత్త వెర్షన్‌ని అడగవచ్చు లేదా స్క్రిప్ట్ రైటర్‌ని నియమించుకోవాలని నిర్ణయించుకోవచ్చు.[10][11][12]దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులను నియమించుకునేటప్పుడు నిర్మాత తుది ఆమోదం కూడా ఇస్తాడు.[13][14] కొన్ని సందర్భాల్లో, కాస్టింగ్ విషయంలో నిర్మాతల మాట కూడా ఉంటుంది.[15] లొకేషన్‌లు, స్టూడియో అద్దె, చివరి షూటింగ్ స్క్రిప్టు, ప్రొడక్షన్ షెడ్యూల్, బడ్జెట్‌ను కూడా నిర్మాత ఆమోదిస్తాడు. ప్రీ-ప్రొడక్షన్‌లో ఎక్కువ సమయం, డబ్బు ఖర్చు చేయడం వల్ల బడ్జెట్ వృధా, ప్రొడక్షన్ దశలో జాప్యాలను తగ్గించవచ్చు.[7]
నిర్మాణం
నిర్మాణ సమయంలో, సినిమా షెడ్యూల్‌లో, తక్కువ బడ్జెట్‌లో ఉండేలా చూసుకోవడం నిర్మాత పని.[16] దీని కోసం నిర్మాత, దర్శకుడు, ఇతర కీలక వ్యక్తులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలి.[17][18][19]
నిర్మాతలు తమ సినిమా నిర్మాణంలోని అన్ని భాగాలను ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా పర్యవేక్షించలేడు కానీ బదులుగా అవసరమైన పనులను ఇతరులకు అప్పగిస్తాడు. ఉదాహరణకు, కొంతమంది నిర్మాతలు సినిమా పంపిణీని కూడా నిర్వహించే సంస్థను నడుపుతున్నారు.[20][21] అలాగే నటీనటులు, సాంకేతిక నిపుణుల టీం తరచుగా వేర్వేరు సమయాల్లో, ప్రదేశాలలో షూటింగ్ చేస్తారు. కొన్ని సినిమాలకు రెండవ యూనిట్ కూడా అవసరముంటుంది.
పోస్ట్ ప్రొడక్షన్
ఒక సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత కూడా, మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్మాతలు డిమాండ్ చేయవచ్చు. మొదటి కాపీ స్క్రీనింగ్ చూసిన తరువాత సినిమాలో మార్పులు చేర్చులు గురించి నిర్మాత డిమాండ్ చేయవచ్చు. ఉదాహరణకు,ఫస్ట్ బ్లడ్ సినిమా టెస్ట్ స్క్రీనింగ్‌లోరాంబో మరణంపై ప్రేక్షకుల నుండి ప్రతికూలంగా స్పందన వచ్చినప్పుడు, నిర్మాతలు కొత్త క్లైమాక్స్ ను చిత్రీకరించమని అభ్యర్థించారు.[22] నిర్మాతలు సినిమా విక్రయాలు, మార్కెటింగ్, పంపిణీ హక్కులను కూడా పర్యవేక్షిస్తారు, తరచుగా థర్డ్-పార్టీ స్పెషలిస్ట్ సంస్థలతో కలిసి పనిచేస్తారు.[23]
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ కింద ఇతర నిర్మాతలందరినీ పర్యవేక్షిస్తాడు. సినిమా ఆర్థిక వ్యవహారాలు, ఇతర వ్యాపార అంశాలను నిర్వహించే బాధ్యతను కూడా కలిగి ఉంటాడు.[24] టెలివిజన్ సిరీస్‌లో ఎగ్జిక్యూటివ్ లేదా కో-ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రచయితగా కూడా ఉంటాడు. సినిమారంగంలో ప్రాజెక్ట్‌కు నేరుగా నిధులు సమకూర్చే వ్యక్తి లేదా నిధుల కోసం పెట్టుబడిదారులను తీసుకురావడానికి నేరుగా బాధ్యత వహిస్తాడు.
ఒక లైన్ ప్రొడ్యూసర్ సిబ్బందిని, రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తాడు. సినిమా లేదా టెలివిజన్ ప్రోగ్రామ్‌ను రూపొందించడంలో పాల్గొన్న ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తాడు. లైన్ ప్రొడ్యూసర్‌ని కొన్ని సందర్భాల్లో "ప్రొడ్యూస్డ్ బై"గా క్రెడిట్ చేయవచ్చు.
పర్యవేక్షక నిర్మాత స్క్రీన్ ప్లే అభివృద్ధి ప్రక్రియను పర్యవేక్షిస్తుంటాడు. స్క్రిప్ట్‌ని వ్రాయడంలో సహాయపడుతాడు. ఇతర నిర్మాతలను పర్యవేక్షించే కార్యనిర్వాహక నిర్మాత బాధ్యతను కూడా నిర్వర్తిస్తాడు.
అసోసియేట్ లేదా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ నిర్మాణ ప్రక్రియలో నిర్మాతకు సహాయం చేస్తాడు. షెడ్యూల్‌లను రూపొందించడం, ఇతరులకు పనులకు అప్పగించడం వంటివి నిర్వర్తిస్తాడు.
↑"Dino De Laurentiis [obituary]".The Daily Telegraph. London. 11 November 2010.Archived from the original on 11 January 2022.He also stuck loyally by gifted American directors when they were out of favour or off form. Robert Altman made one of his less successful pictures, Buffalo Bill and the Indians (1976), for De Laurentiis, who also helped the luckless Michael Cimino back on his feet after the commercial disaster of Heaven's Gate
↑"Octopussy". Archived fromthe original on 10 May 2013.Cubby Broccoli personally broke his own golden rule and cast her as the mysterious Octopussy
↑"Producer".creativeskillset.org. Archived fromthe original on 16 September 2018. Retrieved2017-02-18.
↑Bergan, Ronald."Bernd Eichinger [obituary]".The Guardian. London.In 1979, Eichinger bought a large stake in the Munich-based production and distribution company Constantin Film, which he ran as a hands-on producer for over 30 years
↑Bergan, Ronald."Bernd Eichinger [obituary]".The Guardian. London.In 1979, Eichinger bought a large stake in the Munich-based production and distribution company Constantin Film, which he ran as a hands-on producer for over 30 years