ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలు చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికిమృత్యువు తరువాతభోగదేహం ప్రాప్తిస్తుందని మనపురాణాలు చెపుతున్నాయి. ఈ విధమైన బోగదేహం రెండు రకాలు. ఒకటిసూక్ష్మ దేహం ఇది మనిషి ఆచరించినసత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్ధ్వలోకాలకు చేరుతుంది. రెండవదియాతనా దేహం . ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరకాది లోకాలకు చేరుతుంది. మృత్యువు తరువాత వెంటనే కొత్త దేహం ధరించటం వీలుకాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి మనోమయ ప్రాణమయ దేహంచేత, సుకృత, దుష్కృత సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది.
ఏడు ద్వారాలుంటాయి.త్రాగటానికి సలసల కాగే నీరూ చీమూ నెత్తురూ ఇవ్వబడతాయి.అదిశుద్ధిచేసే అగ్నిగుండం హృదయాలను దహించే అగ్ని జ్వాల. ఈ నరకంలో కాఫిర్ (నాస్తికులు) ని పొయ్యిలో పెట్టి వంట చెరుకుగా ఉపయోగిస్తారు. వీళ్ళ నరకం ప్రకారం కూడా నరకానికి మాలిక్ (రాజు) ఉంటాడు. దేవ దూతలు చనిపోయిన మనిషి సమాధి దగ్గరకి వచ్చి అతని పాప పుణ్యాలు విచారించి, అతను పాపి లేదా నాస్తికుడు లేదా దేవున్ని నమ్ముతున్నట్టు నటించినవాడు అయితే అతన్ని నరకానికి తీసుకుపోతారు.