Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

టోలెమీ

వికీపీడియా నుండి
టోలెమీ
క్లాడియస్ టోలెమీ
జననంc. AD 90
మరణంసా.శ. 90 - 168
వృత్తిగణిత శాస్త్రవేత్త,భూగోళ శాస్త్రవేత్త,ఖగోళ శాస్త్రవేత్త,జ్యోతిష్య శాస్త్రవేత్త

క్లాడియస్ టోలెమీ (ఆంగ్లం:Ptolemy, (గ్రీకు: Κλαύδιος ΠτολεμαῖοςKlaudios Ptolemaios) ; క్రీ.పూ 90 నుండి క్రీ.పూ 168 మధ్య జీవించిన గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఆయన రచలనలను గ్రీకు భాషలో చేశారు[1].ఆయనగణిత శాస్త్రవేత్త,ఖగోళ శాస్త్రవేత్త,భూగోళ శాస్త్రవేత్త,జ్యోతిష్య శాస్త్రవేత్త, గ్రీకు భాషలో ఒక కవి.బాల్యమంతా గ్రీస్ లోనే గడిపి ఉన్నత విద్యను అభ్యసించడానికి టోలెమీ అలెగ్జాండ్రియా వచ్చినట్లు చెబుతారు.

సిద్ధాంతాలు

[మార్చు]

టోలెమీ రాసిన ఖగోళ శాస్త్ర గ్రంథం ఆల్మరెస్టు పేరుతో 9 వ శతాబ్దంలో అరబ్బీ భాషలోకి అనువదింప బదినది. ఈ గ్రంథంలో త్రికోణ శాస్త్రం ఖగోళ శాస్త్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈయన స్పష్టంగా తెలియజేశారు. ఒక వృత్తాన్ని 360 డిగ్రీలుగా విభజించి, ఈ విభాగాలను మళ్ళీ సూక్ష్మ భాగాలుగా విభక్తం చేసి నిముషాలు, క్షణాలు ఏర్పాటు చేశాడు. అనంత విశ్వంలో భూమి మధ్యగా ఉంటుందనీ, దాని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయని టోలెమీ నమ్మాడు. ఈ సిద్ధాంతమునే "భూకేంద్రక సిద్ధాంతము" అంటారు. ఈ భావన సరికాదని 16,17 శతాబ్దాలకు చెందిన శాస్త్రవేత్తలు నిరూపించారు.

ప్రత్యేకతలు

[మార్చు]

ఈయన గ్రీకుల ఖగోళ శాస్త్రజ్ఞులలో చివరివాడు. హిప్పార్కస్ ఈయన గురువని కొందరు నమ్ముతున్నారు. టోలెమీ ఖగోళ శాస్త్రంలో ఎంతో వైదుష్యాన్ని కనబరిచారు. అంతకు ముందు ఎవ్వరూ లెక్క పెట్టని 400 నక్షత్రాలను కలిపి మొత్తం 1028 నక్షత్రాల జాబితాను తయారు చేశాడు. వాటిలో టోలెమాయిక్ రూల్, అర్మిల్లరీ సర్కిల్, ఆర్మిల్లరీ స్పియర్, ఎస్టోనామికల్ రింగ్, మెరిటియన్ క్వాడ్రన్డ్స్ వంటివి ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి.

దృక్ శాస్త్రం

[మార్చు]

దృక్ శాస్త్రం గురించి కూడా టోలెమీ రాశాడు. కాంతి కిరణాలు పరావర్తనం చెంది మన కంటిని చేరినప్పుడు మనకు కనిపిస్తాయి. ఇలాగే కాంతి కిరణాలు యానకాలను మారేటఫ్ఫుడు మార్గాలలో మార్పులు తెచ్చుకుని వక్రీభవనం ప్రదర్శిస్తాయని మనకు తెలుసు. ఈ విషయాలను ప్లేటో కూడా స్పృశించాడు. టోలెమీ వీటి గురించి చర్చించి ఇవన్నీ వాస్తవాలే అని తీర్మానించాడు.

భూగోళ శాస్త్రం

[మార్చు]

ఈయన భూగోళ శాస్త్రజ్ఞుడు కూడా. ఈయన రాసిన గ్రంథంలో అక్షాంశాల, రేఖాంశాల ఆధారంగా బ్రిటిష్ దీవుల నుండి అరేబియా హిందూ దేశాల మధ్య వరకు గల ఎన్నో స్థలాల గురించి స్థాన నిర్ణయాలు చేస్తూ క్రమబద్ధమైన వివరణలు యిచ్చాడు. ఈయన చెప్పిన వన్నీ సారికాక పోవచ్చు కాని ఈయన ప్రదర్శించిన శాస్త్రీయ దృక్పధం మాత్రం ఎవరు సరికాదనగలరు?

చిత్ర మాలిక

[మార్చు]
  • Engraving of a crowned Ptolemy being guided by the muse Astronomy, from Margarita Philosophica by Gregor Reisch
    Engraving of a crowned Ptolemy being guided by the muse Astronomy, fromMargarita Philosophica byGregor Reisch
  • 15 వ శతాబ్దంలో టోలెమీ ప్రతిపాదించిన ప్రపంచ పటం
    15 వ శతాబ్దంలో టోలెమీ ప్రతిపాదించిన ప్రపంచ పటం
  • A printed map from the 15th century depicting Ptolemy's description of the Ecumene, (1482, Johannes Schnitzer, engraver).
    A printed map from the 15th century depicting Ptolemy's description of theEcumene, (1482, Johannes Schnitzer, engraver).
  • The mathematician Claudius Ptolemy 'the Alexandrian' as imagined by a 16th century artist
    The mathematician Claudius Ptolemy 'the Alexandrian' as imagined by a 16th century artist

{{ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు}}

  1. See 'Background' section on his status as a Roman citizen
Authority control
"https://te.wikipedia.org/w/index.php?title=టోలెమీ&oldid=4340360" నుండి వెలికితీశారు
వర్గాలు:
దాచిన వర్గం:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp