Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

జకాత్

వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని ఏమూలాల నుండి సేకరించిన సమాచారాన్నిఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు.
సరైన మూలాలను చేర్చివ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకుచర్చా పేజీని చూడండి.

జకాత్ (అరబ్బీ : زكاة )ఇస్లాం ఐదు మూలస్తంభాలలో నాలగవది. జకాత్ అనగా "శుద్ధి", తన ఆదాయాన్ని శుద్ధి చేసుకోవడం, అనగా, తన ఆదాయంలో కొంత భాగాన్ని అవసరమున్నవారికి పంచి లేదా సహాయం చేసి తన సంపదను ధార్మికం చేసుకోవడం. ప్రతి ముస్లిం తన సాంవత్సరిక ఆదాయం, ధనములో 2.5%అల్లాహ్ మార్గంలో అవసరమున్నవారికి లేదా పేదవారికి సహాయం చేయాలి, ఈధార్మిక విధానాన్ని జకాత్ అంటారు. ఈ జకాత్ నురంజాన్ మాసంలో లెక్కగట్టి చెల్లిస్తారు.

జకాత్ఇస్లాం ఐదు మూలస్తంభాలలో ఒకటి, దీని ప్రస్తావనఖురాన్ లోనూ,హదీసు లలోనూ ఉంది.

మొరాకోలోని ఫెజ్‌లోని జౌయా మౌలే ఇద్రిస్ II వద్ద జకాత్ ఇవ్వడానికి ఒక స్లాట్

ఖురాన్ లో జకాత్ గురించి

[మార్చు]

ఖురాన్ లో జకాత్ గురించి దాదాపు ముప్ఫైఆయత్ లలో వర్ణింపబడింది. మరీ ముఖ్యంగామదనీ సూరా లలో. ఖురాన్ ప్రకారం జకాత్ "ధన వికేంద్రీకరణ విధానము", ధనము ఒకే చోట కేంద్రీకృతం కాకుండా, అవసరనిమిత్తమైన వారి దగ్గరకు కూడా చేర్చబడే విధానము. జకాత్ కు ఇస్లాంలో "పన్ను" కన్నా ఉత్తమ స్థానమున్నది. ఇది మోక్ష మార్గాలకు దారులలో ఒకటి. ముస్లిమేతరులు దీనిని చెల్లించనక్కరలేదు, కానీజిజియా రూపంలో చెల్లించవచ్చును. కానీ ఖురాన్ లో ఈ విధంగా ప్రకటింపబడింది." ఎవరైతే జకాత్ చెల్లిస్తారో వారికి పరలోకంలో మంచి బహుమానాలున్నాయి, ఎవరైతే పట్టించుకోరో వారికి శిక్ష తప్పదు". జకాత్ చెల్లింపు ద్వారా తన ధనాన్ని, ఆత్మను శుద్ధి చేసుకోవచ్చును.[1]

ముస్లింలకు పన్నులు చెల్లించడం (జకాత్ తో సహా), పరమేశ్వరునికి మానవాళికి మధ్యన ఒక వారధి లాంటిది.[ఖోరాన్ 2:83][1]

జకాత్ ఎవరికి ఇవ్వవచ్చో దీనికి ఖురాన్ వర్ణిస్తుంది.[2]

హదీసులలో జకాత్ గురించి

[మార్చు]

హదీసు లలో జకాత్ ఇవ్వని వారి గూర్చి విమర్శించడం జరిగింది. జకాత్ చెల్లించకపోవడంమునాఫిక్ ల పని, ఇలాంటి వారి ప్రార్థనలను అల్లాహ్ అంగీకరించడు. హదీసుల ప్రకారం ధనికులు జకాత్ చెల్లిస్తే పేదలు ఆకలితో అలమటించరు. జకాత్ చెల్లించువారి ధనం జకాత్ చెల్లించడం ద్వారా శుద్ధి అగును, పరిపూర్ణ స్వచ్ఛత పొందును. జకాత్ చెల్లిస్తే, వారి ధన మాన ప్రాణ రక్షణల బాధ్యత అల్లాహ్ దే. చెల్లించని వారు ప్రళయదినాన లెక్కలు ఇవ్వవలసినదే, శిక్ష పొందవలసినదే.[2]

ఒక సంవత్సరం పాటు ధనం వుంచుకున్నట్లయితే దానిపై జకాత్ చెల్లించాలి. లేదా లావాదేవీల ప్రకారం మొత్తం ధనం, మొత్తం లాభం, వాటిపై "నిసాబ్" ప్రకారం ఏడున్నత తులాల బంగారం విలువ లేదా ఏభైరెండున్నర తులాల వెండి విలువ పోనూ మిగిలిన మొత్తం పై రెండున్నర శాతం జకాత్ ను చెల్లించాలి.[2]

హదీసుల ప్రకారం, ప్రభుత్వాలు జకాత్ ను వసూలు చేయవచ్చు. వసూలు చేసే అధికారులు, చెల్లించవలసిన జకాత్ కన్నా అధికంగా వసూలు చేయరాదు. జకాత్ చెల్లింపుదారులు జకాత్ ను ఎగ్గొట్టరాదు. జకాత్ వసూలు చేసే అధికారం లేని వారు జకాత్ వసూలు చేయడం నేరం, శిక్షార్హులు. (చూడుముbeneficiaries of zakat).[2]

ఇదీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.01.1Heck, Paul L. "Taxation."Encyclopaedia of the Qur'an
  2. 2.02.12.22.3A. Zysow, "Zakāt."Encyclopaedia of Islam, Second Edition.

పాదపీఠికలు

[మార్చు]
ఇస్లాం విషయాలు
విశ్వాసాలు
ఇస్లాం ఐదు మూలస్తంభాలు
ఇస్లామీయ చరిత్ర &ఇస్లామీయ ధార్మిక నాయకులు
ధార్మిక గ్రంధాలు
ఇస్లామీయ పాఠశాలలు
ముస్లిం ప్రపంచం andఇస్లామీయ సంస్కృతి
షరియా &
ఫిఖహ్
ఇస్లామీయ శాస్త్రం
ఇతర మతములు
సంబంధిత విషయాలు
* * ఇస్లాం సంబంధిత వ్యాసాలు * *
ఇస్లాం  · అల్లాహ్  · ముహమ్మద్  · ఖోరాన్  · మలాయిక  · ప్రవక్తలు  · మక్కా  · మదీనా  · రాషిదూన్ ఖలీఫాలు  · ఖిలాఫత్  · ఖలీఫా  · మస్జిద్-అల్-హరామ్  · మస్జిద్-ఎ-నబవి  · బైతుల్-ముఖద్దస్  · ఇస్లామీయ స్వర్ణయుగం  · ముస్లింల పవిత్ర స్థలాలు  · కాబా  · మస్జిద్  · హిజ్రత్  · ముస్లింల పండుగలు  · ఇస్లామీయ కేలండర్  · సున్నీ ఇస్లాం  · షరియా  · హదీసులు  · సున్నహ్  · ఈద్‍గాహ్  · ప్రపంచ ప్రసిద్ధ మస్జిద్‌ల జాబితా  · ముస్లిం పండితులు  · ఇస్లామిక్ దేశాలు  · ముస్లిం శాస్త్రవేత్తలు  · ముస్లింల సాంప్రదాయాలు  · యౌమ్-అల్-ఖియామ  · కాఫిర్  · మోమిన్  · ఖిబ్లా  · ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా  · భారతదేశంలో ఇస్లాం  · ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం  · సూఫీ తత్వము  · ఔలియాలు  · సూఫీలు  ·
"https://te.wikipedia.org/w/index.php?title=జకాత్&oldid=3690815" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp