చిలీ (అధికారిక నామం: చిలీ డి రిపబ్లిక్)దక్షిణ అమెరికాలోని ఒక దేశం. చిలీ పసిఫిక్ మహాసముద్ర తీరం పొడవునా విస్తరించి ఉంది. చిలీ ఉత్తర సరిహద్దులోపెరూ, ఈశాన్యసరిహద్దులోబొలీవియా, తూర్పుసరిహద్దులోఅర్జెంటీనా, దక్షిణాగ్రమునడ్రేక్ కనుమ ఉన్నాయి. చిలీ సముద్రతీర పొడవు 6,435 కి.మీ.[5] చిలీ దేశం ఒక అసాధారణ రిబ్బన్-ఆకృతిలో ఏర్పడి యున్నది. దీని పొడవు 4,300 కి.మీ., వెడల్పు 175 కి.మీ.లు. దీనికి తూర్పుదిశలో ఆండీస్ పర్వతశ్రేణి ఉంది. పశ్చిమదిశలో పసిఫిక్ మహాసముద్రం ఉంది. చిలీ భూభాగాలలో జుయాన్ ఫెర్నాడెజ్, సలాస్ వై గోమెజ్, డెస్వెంచురాడాస్, ఈస్టర్ ద్వీపాలు (ఓషియానియా)ఉన్నాయి. దేశంలో 12,50,000 చ.కి.మీ.అంటార్కిటికా జలభాగం అంతర్భాగంగా ఉంది. మరికొన్ని జలభాగ వివాదాలు కొనసాగుతున్నాయి.
చిలీ ఉత్తర భూభాగంలో ఉన్న అటకామా ఎడారిలో గొప్ప ఖనిజ సంపద (ప్రధానంగా రాగి) ఉంది. చిలీ కేంద్ర ప్రాంతంలో అధికంగా జనసాంద్రత, వ్యవసాయ వనరులు ఉన్నాయి. చిలీ 19 వ శతాబ్దంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలు విలీనం చేసికొని విస్తరించిన తరువాత కేంద్రప్రాంతం సాంస్కృతిక, రాజకీయ కేంద్రంగా ఉంది. దక్షిణ చిలీ అడవులు, మేత భూములతో సుసంపన్నంగా ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు, సరస్సులు, సెలయేరులు ఉన్నాయి. దక్షిణ తీరం ఫ్జోర్డ్స్, ప్రవేశద్వారాలు, కాలువలు, మెలితిప్పినట్లుండే ద్వీపకల్పాలు, ద్వీపాలు ఉన్నాయి.
16 వ శతాబ్దంలో స్పెయిన్ స్వాధీనం చేసుకుని కాలనీగా చేసుకున్న ఉత్తర, కేంద్ర చిలీ ప్రాంతంలో ఇంకా పాలన స్థానంలో స్పెయిన్ పాలన కొనసాగింది. అయినప్పటికీ దక్షిణ-మధ్య చిలీలోని స్వతంత్ర అరౌకేనియన్ జయించడంలోస్పెయిన్ విఫలమైంది. 1818 లో స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత 1830 లో చిలీ స్థిరమైన నిరంకుశ రిపబ్లిక్‌గా అవతరించింది. 19 వ శతాబ్దంలో చిలీలో మొదలై ఆర్థిక, భూభాగ అభివృద్ధి 1880 లో అరౌకేనియన్ ప్రతిఘటనతో ముగింపుకు వచ్చింది. చిలీ పసిఫిక్ యుద్ధంలో (1879-83)పెరూ,బొలీవియాలను ఓడించి ప్రస్తుత ఉత్తర భూభాగంగాన్ని విలీనం చేసుకుంది.1960 చివరిలో, 1970 ల ప్రారంభంలో దేశం తీవ్రమైన వామపక్ష, సాంప్రదాయ వాదుల రాజకీయ సంక్షోభం ఎదుర్కొంది. ఈ అభివృద్ధి 1973 లో తిరుగుబాటుగా రూపుదిద్దుకుని " సాల్వడార్ అల్లెండే " ప్రభుత్వం పడగొట్టబడి ప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నిక చేబడిన వామపక్ష ప్రభుత్వం స్థాపించబడింది. 16 ఏళ్ల సుదీర్ఘ మితవాద సైనిక నియంతృత్వం పాలనలో 3,000 మంది మరణించడం, కనిపించకుండా పోవడం జరిగింది. 1973లో ఆరంభమైన చిలియన్ ఆక్రమణ 1988 లో ఒక ప్రజాభిప్రాయం కోల్పోయిన తరువాత 1990లో తర్వాత " అగస్టో పినోచ్హేత్ " నేతృత్వంలోని పాలన ముగిసింది. 2010 వరకు అధికారంలో ఉన్న సెంటర్ లెఫ్ట్ సంకీర్ణంలో 4 మంది అధ్యక్షులు అధ్యక్షపీఠం అధిరోహించారు.
చిలీ దక్షిణ అమెరికా దేశాలలో అత్యంత స్థిరమైన, సంపన్న దేశాలలో ఒకటి. చిలీ లాటిన్ అమెరికన్ దేశాలలో మానవ అభివృద్ధి పోటీతత్వం తలసరి ఆదాయం, ప్రపంచీకరణ, శాంతి, ఆర్థిక స్వాతంత్ర్యం, తక్కువగా ఉన్న అవినీతి వంటి విషయాలలో ప్రత్యేకత కలిగినదేశంగా ఉంది. స్థిరత్వం, ప్రజాస్వామ్య అభివృద్ధిలో కూడా చిలీ ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రస్తుతం చిలీ దక్షిణ అమెరికాలో అతితక్కువ గృహాంతర హత్యల శాతం కలిగి ఉంది. చిలీ యునైటెడ్ నేషన్స్, సౌత్ అమెరికన్ నేషన్స్ యూనియన్, లాటిన్ అమెరికన్ అండ్ కరేబియన్ స్టేట్స్ సంఘం వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది.
చిలీ పదానికి పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయి.17వ శతాబ్ధానికి చెందిన స్పెయిన్ చరిత్రకారుడు " డియాగో డీ రొసాలెస్ "[6] ఇంకాలు " అకొంకాక్వా " లోయను చిలి అని పిలిచేవారు. పికంచె గిరిజన జాతి నాయకుడు ఈ ప్రాంతాన్ని " టిలి " అని పేర్కొన్నాడు. టిలీ అనే పదం రూపాంతరం చెంది ఇంకాల చేత చిలీ అని పిలువబడింది అని వివరించాడు. ఇంకాలు ఈప్రాంతాన్ని 15వ శతాబ్దం లో పాలించారు.[7][8] ఇతర అధ్యయనాలు పెరూ లోని కాస్మా లోయలో ఉన్న " చిలీ " నగరం పేరును ఇలాగే అకాంక్వా లోయకు వర్తింపజేసారని వివరిస్తున్నాయి.[8] మరికొన్ని అధ్యయనాలు స్థానిక అమెరికన్ల నుండి చిలీ పేరు వచ్చిందని భావిస్తున్నారు. స్థానిక్ అమెరికన్ల భాషలో చిలీ అంటే " భూమి చివరి భాగం " లేక " సీ గుల్స్ " అని అర్ధం.[9] మాపుచే పదం " చిల్లి " అంటే భూమి చివరి భాగం అని అర్ధం.[10] క్యుచుయా భాషలో " చిరి " అంటే " చలి " అని అర్ధం.[11] లేక త్చిలి అంటే " మంచు " అని అర్ధం.[11][12] లేక " భూమి లోతైన కేంద్రం " అని అర్ధం.[13] మరొక కథనం " చిల్లి " చీలె-చీలె " పదానికి కుదింపు అని వివరిస్తుంది.మాపుచే భాషలో చీలె-చీలే అనే పదం " ట్రిలె " పదానికి వర్తిస్తుంది.[10][14]స్పెయిన్‌కు చెందిన అన్వేషకులు పెరూ అనే పేరును ఇంకాల ద్వారా విన్నారు. 1535-36లో " డియెగో డి అల్మాగ్ " మొదటి అన్వేషణ యాత్రలో ప్రాణాలతో బయటపడిన వారు ఈ ప్రాంతాన్ని " మెన్ ఆఫ్ చిల్లి " అని పిలిచారు.[10] అల్మాగ్రో చివరిగా ఈప్రంతానికి " చిలె " అని నిర్ణయించాడు.[8] 1900 వరకు ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులు " చిలీ " అని పిలిచారు.[15]
మోంటే వర్డే ప్రాంతంలో లభించిన రాతి పనిముట్లు ఆధారంగా ఇక్కడ 18,500 సంవత్సరాల పూర్వం నుండి మానవులు నివసించారని భావిస్తున్నారు.[16] 10,000 సంవత్సరాలకు పూర్వం ప్రస్తుత చిలీ ప్రాంతంలో ఉన్న సారవంతనైన లోయలు, సముద్రతీర ప్రాంతాలకు స్థానిక అమెరికన్లు వలస వచ్చి స్థిరపడ్డారు. మానవ ఆవాసాల నివాససముదాయాల సాక్ష్యాధారాలు చిలీలోని మోంటే వర్డే, క్యూవా డెల్ మిల్డన్, ది పలి అయికే క్రేటర్స్, ఇవాట్యూబ్ ప్రాంతాలలో లభిస్తున్నాయి. ఇంకాలు ప్రస్తుత ఉత్తర చిలీ ప్రాంతం వరకు సామ్రాజ్య విస్తరణ చేసారు. మపుచే (స్పానియర్డ్లు వీరిని అరౌకేనియన్లు అంటారు) ప్రజలు పాలనావ్యస్థ పటిష్ఠంగా లేనప్పటికీ ఇంకాల సామ్రాజ్యవిస్తరణను విజయవంతంగా అడ్డుకున్నారు.[17] వారు " సపా ఇంకా ట్యూపాక్ యుపాంక్యూ "ను ఆయన సైన్యంతో పోరాడారు. " మౌలే యుద్ధం " ఫలితంగా ఇంకా ఆక్రమణలు మైలే నది ప్రాంతం వద్ద ఆగిపోయాయి.[18]
1520 లో భూగోళాన్ని చుట్టిరావడానికి ప్రయత్నించిన సమయంలో " ఫెర్డినాండ్ మాజెల్లాన్ " (ఇప్పుడు ఆయన గౌరవార్ధం ఈప్రాంతానికి " మగెల్లాన్ స్ట్రెయిట్ " అని పేరు పెట్టారు) దక్షిణ పాసేజ్ ప్రాంతాన్ని కనుగొన్నాడు. యురేపియన్లు ఈ ప్రాంతంలో పాదం మోపిన మొదటి సంఘటన ఇదే. చిలీకు చేరుకున్న తదుపరి యూరోపియన్లు స్పానిష్ అన్వేషకులైన " డియాగో డి అల్మాగ్రో " , అతని బృందం. వీరూ పెరు నుండి బయలుదేరి 1535 లో బంగారం కొరకు ఇక్కడకు చేరుకున్నారు. స్పానిష్ ప్రధానంగా స్లాష్-అండ్-బర్న్ వ్యవసాయం , వేట ద్వారా తమకు జీవనోపాధిగా గడుపుతున్న వివిధ సంస్కృతులను కలుసుకున్నారు.[18]1540లో చిలీలో యురేపియన్ల ఆక్రమణ మొదలైంది. ఈ ఆక్రమణకు 1541 ఫిబ్రవరి 12న " శాంటియాగో నగరాన్ని " స్థాపించిన " ఫ్రాన్సిస్కో పిజారో " లెఫ్టినెంట్లలో ఒకరైన " పెడ్రో డే వల్డివియా " నాయకత్వం వహించాడు. అయినప్పటికీ స్పెయిన్ వారు వారు వెతుకుతున్న విస్తృతమైన బంగారం, వెండి నిల్వలు ఈప్రాంతంలో కనుగొనలేక పోయారు. చిలీ కేంద్రప్రాంత లోయలలో వ్యవసాయ యోగ్యమైన సారవంతమైన భూమిని వారు గుర్తించారు. ఇలా చిలీ " స్పానిష్ సామ్రాజ్యం " లో భాగమైంది.[18]
Picture "The youngLautaro" ofPedro Subercaseaux that show to genius military and hero of the Arauco war after the arrival of the Spanish to Chilean territory.
స్పెయిన్ ఆక్రమణ నిదానంగా క్రమానుసారం జరిగింది. యూరోపియన్లు తరచుగా స్థానికుల అడ్డగింతలతో వెనుకడుగు వేస్తూ ముందుకు కొనసాగారు. 1553 లో ప్రారంభమైన బృహత్తరమైన మపుచియా తిరుగుబాటు కారణంగా వల్డివియా మరణం, కాలనీ ప్రధాన స్థావరాలు నాశనం చేయబడ్డాయి. 1598 లో, 1655 లో తరువాతి ప్రధాన దాడులు జరిగాయి. ప్రతిసారీ మాపుచే, ఇతర స్థానిక సమూహాలు తిరుగుబాటులో పాల్గొన్నాయి. కాలనీ పాలన ఉత్తరసరిహద్దుకు పరిమితమైంది. 1683 లో స్పానిష్ సామ్రాజ్యం బానిసత్వం రద్దుచేసింది. రాజ్యాంగ నిషేధాలు ఉన్నప్పటికీ, నిరంతర వలసవాద జోక్యం కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయి.[19]ఉత్తరభూభాగంలో ఎడారి దక్షిణభూభాగంలో మాపుచే, తూర్పు భూభాగంలో అండీస్ పర్వతాలు, పశ్చిమంలో మహాసముద్రం వంటి ప్రత్యేకతతో చిలీ స్పానిష్ అమెరికాలో అత్యంత కేంద్రీకృత, ఏకీకృత కాలనీల్లో ఒకటిగా మారింది. సరిహద్దు గారెసన్‌గా పనిచేయడంతో కాలనీ మపుచే, స్పెయిన్ యూరోపియన్ శత్రువులు (ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటీష్, డచ్) ల అక్రమంగా దాడులకు గురైంది. మాపుచేలతో పాటు బుకానీర్స్, ఇంగ్లీష్ సాహసికులు కాలనీకి బెదిరిపుగా మారారు. కాల్గరీ యొక్క ప్రధాన 1578లో కాలనీ ప్రధాన నౌకాశ్రయం " సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ " నాయకత్వంలో వల్పరైసో నౌకాశ్రయం మీద దాడి జరిగింది.చేసిన యొక్క దాడి ద్వారా చూపబడింది. చిలీలో అమెరికా ఖండాలలో అతిపెద్ద సైన్యాల్లో ఒకటిగా గుర్తించబడింది. స్పానిష్ స్వాధీన భూభాగాలలో, పెరూ వైశ్రాయిలిటీలో అత్యంత సైనికీకరణ చేయబడిన ప్రాంతంగా ఒకటిగా ఉంది.[10]
1777, 1778 మధ్యకాలంలో అగస్టిన్ డి జార్యూగి ప్రభుత్వం మొట్టమొదటి జనాభా గణాంకాల సేకరణ నిర్వహించింది. గణాంకాల ఆధారంగా చిలీ జనసంఖ్య 259,646. వీరిలో 73.5% యూరోపియన్ సంతతికి చెందిన ప్రజలు (లాటిన్ అమెరికాకు చెందిన శ్వేతజాతీయులు), 7.9% మేస్టిజో, 8.6%, స్థానిక అమెరికన్లు, 9.8% నల్లజాతీయులు ఉన్నారు. 1784 లో " చిలీ గవర్నర్ " ఫ్రాన్సిస్కో హుర్టోడో" నిర్వహించిన జనాభా గణన ఆధారంగా జనసంఖ్య 26,703.వీరిలో 64.4% శ్వేతజాతీయులు, 33.5% స్థానికులు ఉన్నారు.
1812 లో " మౌలే నది " దక్షిణప్రాంతంలో " కన్సెపిసియాన్ " జనాభా నిర్వహించిన జనగణనలో చిలీ నివాసితులు, స్థానికప్రజలు చేర్చబడ లేదు. జనసంఖ్య 210,567. వీరిలో 86.1% " స్పానిష్ చిలియన్ " లేదా యూరోపియన్ సంతతివారు 10% స్థానిక ప్రజలు, 3.7% మంది పురుషులు నల్లజాతీయులు, ములాట్టేలు ఉన్నారు.[20]
1808 లో " మొదటి నెపోలియన్ స్పానిష్ సామ్రాజ్యం సింహాసనం అధిష్ఠించిన తరువాత అతని సోదరుడు జోసెఫ్ బొనపార్టీ " చిలియన్ స్వంతత్రపోరాటం " ఎదుర్కొన్నాడు. 1810 సెప్టెంబరులో పదవీచ్యుతుడైన రాజుకుటుంబ వారసుడు " ఫెర్డినాండ్" జాతీయ సైనికాధికారి చిలీని స్పానిష్ రాచరికంలో స్వయంప్రతిపత్తి కలిగిన సైనికపాలిత దేశంగా ప్రకటించాడు. చిలీలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 18 న ఈ రోజును ఫియస్టాస్ పాట్రియాస్ (చిలీ)గా జరుపుకుంటుంది.
ఈ సంఘటనల తరువాత " జోస్ మిగ్యూల్ క్య్రేరా " (అత్యంత ప్రసిద్ధ దేశభక్తులలో ఒకరు), అతని ఇద్దరు సోదరులు " జువాన్ జోస్ ", " లూయిస్ కరేరే " ఆధ్వర్యంలో పూర్తి స్వాతంత్ర్యం కోసం ఉద్యమం విస్తృతస్థాయిలో ప్రారంభించాడు.అతిత్వరలో ఆయనకు అనేక అనుయాయుల మద్దతు లభించింది.స్పెయిన్ " రికాంక్విస్టా (స్పెయిన్) " పేరుతో చిలీలో తమపాలన పునఃస్థాపించడానికి ప్రయత్నించింది. సుదీర్ఘకాలం సాగిన పోరాటంలో మద్యలో కర్రారే ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ బెర్నార్డో ఓ'కిగ్గిన్ పోరాటం జరిగింది.
1817 వరకు యుద్ధం నిర,తరాయంగా కొనసాగింది. అర్జెంటీనాలో జైలులో ఉన్న కార్రెరాతో " అర్జెంటీనా స్వాతంత్ర్య యుద్ధం " నాయకుడైన " ఓ'హిగ్నిస్ ", యాంటీ-కారెరా కోహర్ట్ " జోస్ డి శాన్ మార్టిన్ " సైన్యం (" ఆర్మీ ఆఫ్ ది ఆండీస్ ") చిలీలో అండీస్ పర్వతాలను దాటి చిలీలో ప్రవేశించి స్పెయిన్ రాజరికప్రతినిధులను ఓడించారు.1818 ఫిబ్రవరి 12 న " చిలీ స్వతంత్ర ప్రకటన " చేయబడింది. రాజకీయ తిరుగుబాటు కొద్దిగా సామాజిక మార్పును తెచ్చిపెట్టింది. అయినప్పటికీ 19 వ శతాబ్దపు చిలీ సమాజంలో వలసవాద సామాజిక వ్యవస్థ స్వరూపం నిలిచి ఉంది. కుటుంబం రాజకీయాలు, రోమన్ క్యాథలిక్ చర్చ్ సమాజాన్ని చాలా ప్రభావితం చేయాయి. చివరకు బలమైన అధ్యక్ష పదవిని ఆవిర్భవించినప్పటికీ సంపన్న భూస్వాములు శక్తివంతవంతమైన వ్యవస్థగా నిలిచింది.[18]
చిలీ నెమ్మదిగా దాని ప్రభావాన్ని విస్తరించేందుకు, దాని సరిహద్దులను స్థాపించడానికి ప్రారంభించింది.1826లో టాంటౌకో ఒప్పందం తరువాత చిలీ ద్వీపసమూహాం దేశంలో విలీనం చేయబడింది. చానరిసిల్లో వెండి ధాతువును కనుగొన్న కారణంగా విప్లవాత్మకైన ఆర్థిఅభివృద్ధి ప్రారంభమైంది, " వల్పరైసో పోర్ట్ "వ్యాపారం అభివృద్ధిపెరూతో పసిఫిక్ సముద్రపు ఆధిపత్యంపై వివాదానికి దారితీసింది. అదే సమయంలో .1848 లో దక్షిణ ప్రాంతంలోని అరూన్నియ చొరబాటు తీవ్రతరం చేయడం , వల్డివియా, ఓస్రోన్ , లాన్క్విహ్యూలో జర్మన్ వలసలకు వ్యతిరేకంగా దక్షిణ చిలీలోని సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేయటానికి ప్రయత్నాలు జరిగాయి. 1843లో " జాన్ విలియమ్స్ విల్సన్ " ఆధ్వర్యంలో " షూనెర్ అన్కుద్ " మగల్లెన్స్ ప్రాంతంలో బుల్నెస్ కోట నిర్మించబడింది. ఆసమయంలోబొలీవియా ఆధీనంలో ఉన్న అంటోఫాగస్టా ప్రాంతాన్ని బొలీవియా ప్రజలతో నింపడం ప్రారంభమైంది.
19 వ శతాబ్దం చివరినాటికి శాంటియాగోలో ప్రభుత్వం దక్షిణ ప్రాంతంలోని అరౌకానియాను ఆక్రమించుకుని తన స్థానంను ఏకీకృతం చేసింది. చిలీ , అర్జెంటీనా మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం 1881లో మాగెల్లాన్ జలసంధిపై చిలీ సార్వభౌమత్వాన్ని నిర్ధారించింది. (1879-83) మద్యపెరూ ,బొలీవియా కొనసాగిన పసిఫిక్ యుద్ధం ఫలితంగా చిలీ భూభాగాన్ని ఉత్తరాన విస్తరించి పసిఫిక్ ప్రాంతానికి బొలీవియా ప్రవేశాన్ని తొలగించి విలువైన " కాలిచ్ ఖనిజ " (నైట్రేట్) నిక్షేపాలు స్వంతం చేసుకుంది.ఇది దురుపయోగం చేయబడి జాతీయసంపద దోపిడీకి దారి తీసింది.1870 నాటికి చిలీ దక్షిణ అమెరికా దేశాలలో అధిక ఆదాయం కలిగిన దేశాలలో ఒకటిగా నిలిచిం[21]" 1891 చిలియన్ అంతర్యుద్ధం యుద్ధం " అధ్యక్షుడు , కాంగ్రెస్ మధ్య అధికార పునఃపంపిణీ చేయబడిన సందర్భంలో చిలీలో పార్లమెంటరీ శైలి ప్రజాస్వామ్యాన్ని స్థాపించింది. అయినప్పటికీ అంతర్యుద్ధం స్థానిక పరిశ్రమల అభివృద్దికి , శక్తివంతమైన చిలీ బ్యాంకింగ్‌కు, విదేశీ పెట్టుబడిదారులతో బలమైన సంబంధాలు కలిగిన హౌస్ ఆఫ్ ఎడ్వర్డ్స్ అభివృద్ధికి అనుకూలంగా ఉంది. కొద్దికాలం తర్వాత అర్జెంటీనాతో మొదలైన ఆయుధపోటీ చివరికి ఇరుదేశాల మద్య యుద్ధానికి దారితీసింది.
చిలీ ఆర్థిక వ్యవస్థ పాక్షికంగా పరిపాలన అధికారంకలిగిన వ్యక్తుల ప్రయోజనాలను కాపాడడానికి ముఖ్యత్వం ఇచ్చి ఆర్ధిక వ్యవస్థ కలుషితం అయింది. 1920 ల నాటికి అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి , శ్రానికవర్గ తరగతులకు చెందిన ప్రజలు శక్తివంతులై సంస్కరణవాద అధ్యక్షుడైన " ఆర్టురో అలెశాండ్రి " ఎన్నుకోవడంలో విజయం సాధించారు. ఆయన కార్యక్రమాలను సాంప్రదాయిక కాంగ్రెస్ నీరుగార్చింది. 1920 లలో బలమైన ప్రజా మద్దతుతో మార్క్సిజం సమూహాలు ఏర్పడ్డాయి.[18]1924 లో జనరల్ లూయిస్ అల్టామిరానో నాయకత్వంలో జరిగిన సైనిక తిరుగుబాటు కారణంగా మొదలైన రాజకీయ అస్థిరత 1932 వరకు కొనసాగింది ఆ కాలంలో అధికారంలో ఉన్న పది ప్రభుత్వాలలో దీర్ఘకాలం కొనసాగిన జనరల్ " కార్లోస్ ఐబనీజ్ డెల్ కాంపో " ప్రభుత్వం 1925 లో , 1927-1931మధ్యకాలం అధికారం స్వంతం చేసుకుని నియంతృత్వ పాలన సాగించినప్పటికీ మిగిలిన లాటిన్ అమెరికాదేశాల సైనిక ప్రభుత్వాలలో ఉన్న అవినీతి ఇక్కడలేదు.[22][23]ప్రజాస్వామ్యంగా ఎన్నికయిన వారసుడికి అధికారాన్ని విడిచిపెట్టినపుడు ఇబనేజ్ డెల్ కాంపో తన అస్పష్టమైన స్వభావం , తరచుగా మారే స్వభావం ఉన్నప్పటికీ జనాభాలో గణించతగిన మందిలో అనుకూలమైన రాజకీయవేత్తగా ముప్పై సంవత్సరాల కంటే అధిక కాలం తగినంత గౌరవం పొందాడు.1932 లో రాజ్యాంగ పాలన పునరుద్ధరించబడినప్పుడు ఒక బలమైన మధ్య తరగతి పార్టీ, రాడికల్స్ ఉద్భవించాయి.అవి రాబోయే 20 ఏళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాలలో కీలక శక్తిగా మారాయి. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థలో రాడికల్ పార్టీ ఆధిపత్యం (1932-52)మద్య కాలంలో తగిన పాత్రను పోషించింది.1952 లో ఓటర్లు ఇబనేజ్ డెల్ కాంపోను మరో ఆరు స0వత్సరాల సమయం కార్యాలయానికి తిరిగి తీసుకువచ్చారు. " జార్జ్ అలెస్సాండ్రి " 1958 లో ఐబనేజ్ డెల్ కాంపోను విజయంసాధించి అయ్యి చిలీ సంప్రదాయవాదాన్ని మరొకసారి సంప్రదాయవాదానికి తిరిగి పదవీ వైభవం కలిగించాడు.
చిలీ అధ్యక్ష ఎన్నికలు (1964)లలో క్రిస్టియన్ డెమొక్రాట్ " ఎడ్యూర్డో " అమోఘమైన మెజారిటీతో విజయం సాధించడంతో సంస్కరణలు ప్రారంభం అయ్యాయి."రివల్యూషన్ ఇన్ లిబర్టీ" అనే నినాదంతో స్వేచ్ఛాయుతమైన పరిపాలన సాంఘిక, ఆర్థిక కార్యక్రమాలు, ప్రత్యేకించి విద్య, గృహ, వ్యవసాయ సంస్ధలలో గ్రామీణ సంఘం,కార్మిక సంఘం ఏర్పాటుచేయబడ్డాయి. అయితే 1967 నాటికి ఫ్రెయి వామపక్షాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఆయన సంస్కరణలు సరిపోవని వామపక్షాలు భావించగా సంప్రదాయ వాదులు అవి అధికమని భావించారు. అతని పదవీకాలంలో ఫ్రెయి తన పార్టీ ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను పూర్తిగా సాధించలేదు.[18]
1970 ఎన్నికలలో " సోవియట్ పార్టీ ఆఫ్ చిలీ " సెనేటర్సాల్వడార్ అలెండే " (అప్పుడు "పాపులర్ యూనిటీ (చిలీ) " సంకీర్ణంలో కమ్యూనిస్ట్లు, రాడికల్స్, సోషల్ -డెమోక్రాట్లు, అసమ్మతి క్రిస్టియన్ డెమొక్రాట్లు, పాపులర్ యూనివర్సిటీ యాక్షన్ మూవ్మెంట్, ఇండిపెండెంట్ పాపులర్ యాక్షన్)[18] పాక్షిక మెజారిటీతో విజయం సాధించాడు.[24][25]
1972 లో ఆరంభమైన ఆర్థిక మాంద్యం, మూలధన ప్రైవేటు పెట్టుబడులను పతనం చేసింది. అలెన్డే సామ్యవాద కార్యక్రమమునకు ప్రతిస్పందనగా బ్యాంకు డిపాజిట్లను ఉపసంహరించుకుంది. ఉత్పత్తి పడిపోయింది, నిరుద్యోగం పెరిగింది. అల్లెండే నివారణ చర్యలలో భాగంగా ధరల ప్రతిష్టంభన, వేతన పెంపుదల, పన్ను సంస్కరణలు, వినియోగదారుల ఖర్చులను పెంచడం, దిగుమతులను పునఃపంపిణీ చేయడం వంటి చర్యలను చేపట్టింది.[26] ప్రభుత్వ - ప్రైవే ఉద్యోగాలు నిరుద్యోగసమస్యలను కొంత తగ్గించింది.[27][page needed]
బ్యాంకింగ్ రంగం అత్యధికభాగం " జాతీయీకరణ చేయబడ్డాయి. రాగి ఉత్పత్తి, బొగ్గు, ఇనుము, కాలిచీ (ఖనిజ) (నైట్రేట్), ఉక్కు పరిశ్రమలు జాతీయం చేయబడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పెరిగింది , అల్లెండే పరిపాలన మొదటి సంవత్సరంలో నిరుద్యోగం పతనం అయింది.[27] అల్లెండే కార్యక్రమాలలో ఉద్యోగుల ప్రయోజనాలు చేర్చబడ్డాయి.[27][28] న్యాయవ్యవస్థ స్థానంలో " సోషలిస్ట్ లీగల్టీ " ప్రవేశపెట్టింది.[29] బ్యాంకుల జాతీయం , పలువురిని దివాలాస్థితికి తెచ్చింది.[29] అలాగే పాపులర్ మిలిషియస్‌ను శక్తివంతం చేసింది.[29]
రాజ్యాంగ సవరణ రూపంలో చిలీ ప్రధాన రాగి గనుల జాతీయం చేయాలని మాజీ ప్రెసిడెంట్ ఫ్రై పాపులర్ యూనిటీ వేదికపై పిలుపు ఇచ్చారు. దీనిని కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఫలితంగా[30] అల్లెండే ప్రభుత్వాన్ని వేగంగా అస్థిరపరిచేందుకు రిచర్డ్ నిక్సన్ ప్రభుత్వం చిలీలో రహస్య కార్యకలాపాలను నిర్వహించింది.[31] అదనంగా యునైటెడ్ స్టేట్స్ చిలీ మీద ఆర్థిక నిర్భంధం విధించింది.[32] ఆర్ధిక సమస్యలను ఎదుర్కొనడానికి అల్లెండే అధికగా కరెన్సీను ముద్రించడం, బ్యాంకులకు చెల్లింపులు తగ్గించడం వంటి చర్యలు చేపట్టాడు.[33]
రాజకీయవేత్తలు వ్యాపార సంస్థలు, ఇతర సంస్థలు, ప్రతిపక్ష మాధ్యమం, దేశీయ రాజకీయ, ఆర్థిక అస్థిరత ప్రచారం వేగవంతం చేసేందుకు దోహదపడ్డాయి. వాటిలో కొన్నింటికి యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఇచ్చింది.[32][34] 1973 ప్రారంభానికి ద్రవ్యోభణం నియంత్రణ పరిమితి దాటింది. ఆర్ధిక సమస్యలు కొనసాగాయి. వైద్యులు, ఉపాధ్యాయులు, ట్రక్ యజమానులు, రాగి పరిశ్రమలలో పని చేసిన శ్రామికులు, చిరు వ్యాపారులు తరచుగా సమ్మెలు చేసారు. 1973 మే 26న చిలీ సుప్రీం కోర్టు అల్లెండేస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది.[29][35]
Fighter jets bombing the Presidential Palace (La Moneda) in Santiago during theChilean coup of 1973Augusto Pinochet's authoritarian military government ruled Chile between 1973 and 1990.
1973 చిలియన్ తిరుగుబాటు 1973 సెప్టెంబర్ 11న అల్లెండే ప్రభుత్వాన్ని పడగొట్టబడింది. బాంబర్ల స్క్వాడ్ అధ్యక్షభవనం మీద బాంబులు వేసింది. అల్లెండే ఆత్మహత్య చేసుకున్నాడు.[36][page needed][37][page needed] తిరుగుబాటు తరువాత హెన్రీ కిసింగర్ యు.ఎస్.అధ్యక్షుడు రిచర్డ్స్ నిక్సన్‌తో యునైటెడ్ స్టేట్స్ తిరుగుబాటుకు సహకరించించదని చెప్పాడు.[38]" అగస్టో పినొచెట్ " నాయకత్వంలో సైనిక ప్రభుత్వం అధికారం హస్థగతం చేసుకుంది. సైనిక పాలన ఆరంభంలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని భావించారు.1973 అక్టోబర్‌లో కనీసం 72 మంది " కారవాన్ ఆఫ్ డెత్ " ద్వారా హతమార్చబడ్డారని భావిస్తున్నారు.[39] రెట్టింగ్ నివేదిక , వాలెచ్ కమీషన్ ఆధారంగా కానీసం 2,115 మంది హతమార్చబడ్డారని భావిస్తున్నారు.[40] , కనీసం 27,265 మంది[41] హింసలకు గురిచేయబడ్డారు. వీరిలో 12 సంవత్సరాలకు లోబడిన 88 మంది పిల్లలు ఉన్నారని భావిస్తున్నారు.[41] 2011 లో చిలీ అదనంగా 9,800 బాధితులను గుర్తించింది. హత్యచేయబడిన, హింసలకు గురిచేయబడిన , ఖైదుచేయబడిన మొత్తం ప్రజలసంఖ్య 40,018 ఉంటుందని అంచనా.[42] నిందితులతో నింపబడిన జాతీయ స్టేడియంలో హింసించిన , చంపిన వారిలో ఒకరు అంతర్జాతీయంగా కవి-గాయకుడు " విక్టర్ జరా " ఒకరు. ఈ స్టేడియానికి 2003 లో " జార " గా పేరు మార్చారు.
1980 సెప్టెంబర్ 11న ప్రజాభిప్రాయం ద్వారా అనుమతించబడిన కొత్త రాజ్యాంగం వివాదాస్పదమైంది. జనరల్ పినాచెట్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా ఎనిమిది సంవత్సరాల కాలం పదవికి నియమించబడ్డాడు. పినోచెట్ దేశపాలనాధికారం పొందిన తరువాత అనేక వందల మంది చిలీ విప్లవకారులునికరాగ్వా లోని " సార్డినిస్టా " సైన్యానికి చెందిన సైనికదళాలలో చేరారు. వీరిలో గెరిల్లా దళాలుఅర్జెంటీనాలో , క్యూబాలో శిక్షణా శిబిరాలలో,తూర్పు యూరప్ , నార్తరన్ ఆఫ్రికా దళాలలో చేరారు.[43]1980 సంఘటనల ఫలితంగా 1982లో ఆర్ధికరంగం కూలిపోయింది.[44] 1983-1988 మద్య తలెత్తిన బృహత్తరమైన ప్రజల ఎదిరింపు కారణంగా ప్రభుత్వం స్వేచ్ఛాయుతమైన అసెంబ్లీ, భావప్రకటన స్వాతంత్రం , ట్రేడ్ యూనియన్ అసోసేషన్ ఏర్పాటుకు , రాజకీయ కార్యకలాపాలకు స్వేచ్ఛ కల్పించింది.[45]
ప్రభుత్వం ఆర్థిక-మంత్రిగా " హెర్నాన్ బుచీ "తో సంస్కరణలను ప్రారంభించింది. చిలీ " స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికవ్యవస్థ " వైపు మళ్ళించబడింది. అది దేశీయ , విదేశీ ప్రైవేట్ పెట్టుబడుల అభివృద్ధికి దారితీసింది. అయినప్పటికీ రాగిపరిశ్రమ , ఇతర ప్రధానమైన ఖనిజ వనరులు పోటీకి తెరవబడలేదు. 1988 అక్టోబర్ 5 న చిలీ జాతీయ ప్రజాభిప్రాయ సేకరణలో " పినోహెట్ " రెండవ దఫా ఎనిమిది సంవత్సరాల కాలం అధ్యక్షుడిగా నియామకం ప్రతిపాదన అనుకూలంగా 44% వ్యతిరేకంగా 56% మద్దతు కారణంగా నిరాకరించబడింది. లభించింది. (44% వ్యతిరేకంగా 44%) తిరస్కరించబడింది. 1989 డిసెంబర్ 14న చిలీలు ద్విసభల కాంగ్రెస్ సభ్యుల మెజారిటీ ఓట్లతో కొత్త అధ్యక్షుడు కాంగ్రెస్ సభ్యుల మెజారిటీతో ఎన్నికయ్యాడు. 17 రాజకీయ పార్టీల సంకీర్ణ అభ్యర్థి క్రిస్టియన్ డెమొక్రాట్‌కు చెందిన " ప్యాట్రిసియో అయిల్విన్ " సంపూర్ణ మెజారిటీ ఓట్లను (55%) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[46] 1990 నుండి 1944 వరకు సాగిన అధ్యక్షుడు అయిల్విన్ పాలనాకాలం చిలీ పరిపవర్తనా శకంగా గుర్తించబడింది.1993 డిసెంబర్ ఎన్నికలలో క్రిస్టియన్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన , మాజీ అధ్యక్షుడు ఎడుయార్డో ఫ్రెయిమొంటాల్వా కుమారుడు అయిన " ఎడుయార్డో ఫ్రెయి రూయిజ్ - టాగ్లే " నాయకత్వంలో సంకీర్ణం 58% మెజారిటీతో విజయం సాధించింది.[47]
2000 లో సోషలిస్ట్ " రికార్డో లాగోస్ "తో రూయిజ్ - టాగిల్ అధ్యక్షుడయ్యాడు. ఇతను అపూర్వమైన " చిలీ అధ్యక్ష ఎన్నికలు 1999-2000 " ద్వారా వామపక్ష సంకీర్ణానికి చెందిన జోక్విన్ లావిన్‌ను ఎదిరించి విజయం సాధించాడు.[48] 2006 జనవరి ఎన్నికలలో చిలీ మొదటిసారిగా " మైచెల్లె బాచెలెట్ జెరియా " మహిళా అధ్యక్షురాలు ఎన్నిక చేయబడింది. ఆమె నేషనల్ రెన్యూవల్ పార్టీకి చెందిన " సెబస్టిన్ పినెరా " ను ఓడించి విజయం సాధించింది.ఆమె పాలన మరొక నాలుగు సంవత్సరాల కాలం పొడిగించబడింది.[49][50]
2010 జనవరి ఎన్నికలలో " చిలీ అధ్యక్షుడి ఎన్నిక (2009-2010)" లో చిలియన్లు " సెబాస్టియన్ పిన్నరా " ను 20 సంవత్సరాల తరువాత మొదటి వామపక్ష అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆయన మాజీ అధ్యక్షుడు " ఎడ్వర్డో ఫ్రై రూయిజ్-టగ్లే ఓడించి బాచెలెట్ తరువాత నాలుగు సంవత్సరాల పదవీకాలం కొనసాగించాడు. పదవీకాల పరిమితుల కారణంగా " సెబాస్టియన్ పిన్నరా" 2013 లో జరిగిన ఎన్నికలో అధ్యక్షపదవికి పోటీచేయలేదు. అతని పదవీ కాలం మార్చిలో ముగిసింది తరువాత " మిచెల్ బచెలెట్ " కార్యాలయానికి తిరిగి వచ్చింది.
2010 ఫిబ్రవరి 27న చిలీలో రిక్టర్ స్కేలులో 8.8 " 2010 చిలీ భూకంపం " సంభవించింది. ఇది ఆ సమయంలో అప్పటివరకు సంభవించిన భూకంపాలలో అంతర్జాతీయంగా ఐదవ స్థానంలో ఉంది.భూకంపం కారణంగా 500 కంటే ఎక్కువ మంది మరణించారు. తరువాత సంభవించిన సునామి కారణంగా ఒక మిలియన్ మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు. భూకంపం తరువాత కూడా అనేకమార్లు అఘాతాలు సంభవించాయి.[51] ఈ సంఘటనలలో మొత్తం 15-30 బిలియన్ల అమెరికన్ డాలర్ల నష్టం (చిలీ మొత్తం ఉత్పత్తిలో 10-15%) సంభవించింది.[52]2010 ఆగస్టు 5న " అటాకమ ఎడారి "లోని " శాన్ జోస్ రాగి , బంగారు గని " వద్ద యాక్సెస్ సొరంగం కూలిపోయి 700 మీ లోతున భూమిక్రింద 33 మంది శ్రామికులు గనిలో చిక్కుకు పోయిన సందర్భంలో గనులలో చిక్కుకున్న 33 మంది శ్రామికులను రక్షించడంలో చిలీ సాధించిన విజయం ప్రపంచదృష్టిని ఆకర్షించింది.చిలీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెక్యూ బృందం ఘటనా స్థలానికి 17 రోజుల అనంతరం చేరుకున్నారు. మొత్తం 33 మంది గని శ్రామికులు రెండు మాసాల తరువాత 2010 అక్టోబర్ 13న ఉపరితలానికి చేర్చబడ్డారు. ఈ కార్యక్రమం దాదాపు 24 గంటలపాటు దూరదర్శన్‌లో ప్రత్యక్షప్రసారం చేయబడింది.[53]
దక్షిణ అమెరికాలో పొడవైన , సన్నని సముద్రతీరం ఉన్న చిలీ ఆండెస్ ప్రత్వాల పశ్చిమభాగం వైపు ఉంది. ఉత్తరం నుండి దక్షిణం పొడవు 4300 కి.మీ. దేశంలో అత్యంత వెడల్పైన ప్రాంతం వెడల్పు 350కి.మీ. ఉంది.[54] దేశం వైవిధ్యమైన భౌగోళిక , నైసర్గిక స్వరూపం కలిగి ఉంది.దేశవైశాల్యం 7,56,950756,950 చదరపు కిలోమీటర్లు (292,260 చ. మై.) చిలీ " పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ " లో భాగంగా ఉంది. దేశంలో అంతర్భాగంగా ఉన్న పసిఫిక్ ద్వీపాలు , అంటార్కిటికా జలభాగం ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌కు వెలుపల ఉంది. చిలీ 17-56 డిగ్రీల దక్షిణ అక్షాంశం , 66-75 డిగ్రీల పశ్చిమ రేఖాంశంలో ఉంది.ఉత్తర-దక్షిణాలుగా పొడవైన దేశాలలో చిలీ ఒకటి. ప్రధాన భూభాగం మాత్రమే ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంది. తూర్పు పశ్చిమాలుగా ఇరుకుగా ఉండే దేశాలలో చిలీకి మాత్రమే ప్రత్యేకత ఉంది.ఉత్తర దక్షిణాలు అధికంగా విస్తరించి ఉన్న ఇతర దేశాలలోబ్రెజిల్,రష్యా,కెనడా , యునైటెడ్ స్టేట్స్ దేశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇవి తూర్పు పడమరలుగా అధికంగా వెడల్పు కలిగి ఉన్నాయి.1,250,000 కి.మీ2 (480,000 చ. మై.)చీలీలో అంటార్కిటికా జలభాగం భాగంగా ఉంది. అయినప్పటికీ " అటార్కిటిక్ ఒప్పందం " మీద చిలీ సంతకం చేసిన తరువాత అంటార్కిటిక జలభాగం మీద చిలీ హక్కులు వివాదాలమద్య చిక్కుకున్నాయి.[55] భౌగోళికంగా ప్రంపంచపు దక్షిణకొనలో ఉంది.[56]చిలీ నియంత్రణలో ఈస్టర్ ద్వీపం , సాలా య గోమెజ్ ద్వీపం పాలినేషియా తూర్పున ఉన్న ద్వీపాలు ఉన్నాయి. చిలీ 1888 లో ఈభూభాగాలను , రాబిన్సన్ క్రూసో ద్వీపం ప్రధాన భూభాగం నుండి 600కి.మీ దూరంలో ఉన్న " జువాన్ ఫెర్నాండెజ్ దీవులు " లను విలీనం చేసుకుంది. శాన్ ఆంబ్రోసియో , సాన్ ఫెలిక్స్ ప్రాంతంలోని చిన్న ద్వీపాలు కూడా చీలీ నియంత్రణలో ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది స్థానిక మత్స్యకారులు తాత్కాలికంగా మాత్రమే నివసిస్తారు. తీరానికి వెలుపలపసిఫిక్ మహాసముద్రంలో ప్రాదేశిక జలాల్లో చిలీ హక్కులకు ఇవి ఆధారంగా ఉన్నాయి కనుక ఈ ద్వీపాలకు ప్రత్యేకత ఉంది.[57]
ఉత్తరభూభాగంలో ఉన్న అటాకమ ఎడారి అతిపెద్ద ఖనిజ సంపదను కలిగి ఉంది. ప్రధానంగా రాగి , నైట్రేట్‌లు. శాంటియాగో అంతర్భాగంగా ఉన్న సెంట్రల్ వ్యాలీలో జనసంఖ్య , వ్యవసాయ వనరులతో దేశాన్ని ఆధిపత్యం చేస్తుంది.19 వ శతాబ్దంలో చిలీ ఉత్తర , దక్షిణ ప్రాంతాలను విలీనం చేసుకున్న తరువాత ఈ ప్రాంతం చారిత్రాత్మక కేంద్రం కూడా మారింది. దక్షిణ చిలీ అడవులు, పచ్చిక భూములు , అగ్నిపర్వతాలు , సరస్సులతో సుసంపన్నంగా ఉంది. కలిగి ఉంది. దక్షిణ తీరం ఫ్జోర్డ్స్, ఇన్లెట్లు, కాలువలు, ట్విస్టింగ్ పెనిన్సులాస్ , ద్వీపాలతో సంక్లిష్టంగా ఉంది. తూర్పు సరిహద్దులో ఆండీస్ పర్వతాలు ఉన్నాయి.
ఈశాన్య ద్వీపంలో " తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం మధ్యలో, ప్రపంచంలోని ఎత్తైన ఎడారి అటకామ ఎడారిలో మధ్యధరా వాతావరణం, తూర్పు , దక్షిణ ప్రాంతంలో ఆల్పైన్ టండ్రా , గ్లేసియర్స్‌తో సముద్ర పర్యావరణం ఉంటుంది.[58] కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ఆధారంగా సరిహద్దులలోని చిలీ కనీసం పది ప్రధాన శీతోష్ణస్థితుల ఉపరితలాలను కలిగి ఉంది. చిలీ వాతావరణం నాలుగు సీజన్లుగా విభజించబడింది.వేసవి కాలం (డిసెంబరు నుండి ఫిబ్రవరి), శరదృతువు (మార్చి నుండి మే), శీతాకాలం (జూన్ నుండి ఆగస్టు వరకు), వసంత (సెప్టెంబరు నుండి నవంబరు) వరకు నాలుగు సీజన్లు ఉన్నాయి.
Note: All lengths exclusively through Chilean territory.
భూభాగం లక్షణాల కారణంగా చిలీలో ప్రాంతాన్ని సాధారణంగా పొడవు తక్కువగా ఉన్న నదులు , తక్కువ ప్రవాహలు కలిగిన నదులు అధికంగా ఉన్నాయి. అవి సాధారణంగా ఆండీస్ నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి తూర్పు నుండి పశ్చిమదిశలో ప్రవహిస్తున్నాయి.
నార్త్ గ్రాండేలో విస్తరించి ఉన్న ఎడారి కారణంగా 440 కిలోమీటర్ల పొడవైన నది లోవా , కేవలం చిన్న ఎండోహెరిక్ ప్రవాహాలు ఉన్నాయి.[59]
అధిక లోయలలో తడి భూభాగాలు సముద్ర మట్టానికి 4500 మీటర్ల ఎత్తులో " చుంగర సరస్సును " ఉత్పత్తి చేస్తాయి. ఇది నది లాకా నదిని అలాగే లలూటా నదినిబొలీవియా పంచుకుంది.దేశం ఉత్తర మధ్యభాగంలో ప్రవహిస్తున్న పలు నదీప్రవాహాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి.వీటిలో 75 కి.మీ. పొడవైన ఎలిక్వీ[59] అకోంకాగు 142 కిలోమీటర్లు అకోన్కాగు, మాపో 250 కిలోమీటర్లు[59] మాపొచొ 110 కి.మీ Mapocho, మౌలె Maule 240 కి.మీ km. వేసవి , శీతాకాల వర్షాలలో వాటి జలాలతో ఆండియన్ స్నోమెట్ నుండి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రధాన సరస్సులలో కృత్రిమ సరస్సు రాపెల్, కోల్బున్ మాలే సరస్సు , లా లాజా సరస్సు ప్రధానమైనవి.
Torres del Paine from Lake Pehoé, Torres del Paine National Park, Chile
చిలీ యొక్క వృక్షజాలం , జంతుజాలం చిలీ నిర్దిష్ట భౌగోళికస్థితి కారణంగా అధికం స్థానిక జంతుజాలం ఉంటుంది. చిలీలో ఉత్తరభూభాగంలో ఉన్న అటాకమ ఎడారి , తూర్పున అండీస్ పర్వతాలు వృక్షాలు , జంతుజాలానికి ప్రత్యేకత సంతరించుకుంది. చిలీ అపారమైన పొడవు (4300 కి.మీ.)4,300 కి.మీ. (2,672 మై.)) , ఇది మూడు వాతావరణ మండలాలుగా విభజించబడింది; ఉత్తరభూభాగం, సెంట్రల్ చిలీ , దక్షిణార్ద్ర ప్రాంతాలలోని ఎడారి రాష్ట్రాలు.
చిలీలోని స్థానిక వృక్షజాలం ఇతర దక్షిణ అమెరికా దేశాల వృక్షజాతుల కంటే తక్కువగా ఉంటుంది. ప్రపంచంలో పూర్తిగా ఎడారిగా ఉన్న ఉత్తర తీరప్రాంతం , కేంద్ర ప్రాంతం ఎక్కువగా వృక్షరహితంగా ఉంటాయి.[60]అండీస్ పర్వతసానువులలో చెదురుమదురుగా ఎడారి పొదలు, గడ్డిజాతులు కనిపిస్తాయి. కేంద్ర లోయలో అనేక రకాల కాక్టస్, హార్డీ అకాసియా కావెన్, చిలీ పైన్, దక్షిణ బీహెచ్ , కోపిహ్యూ (చిలీ జాతీయ పువ్వు ఉన్న ఎర్ర గంట ఆకారపు పుష్పం) ఉన్నాయి.[60] దక్షిణ చిలీలో ఉన్న బియోబియో నది దక్షిణప్రాంతంలో అధికవర్షపాతం కారణంగా దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఇక్కడ ల్యూరెల్స్, మంగోలియాస్ , పలు జాతుల కోనిఫర్లు ఉన్నాయి.[61] శీతలవాతావరణం , గాలులు దక్షిణప్రాంతాన్ని దట్టమైన వన్యప్రాంతంగా మార్చాయి. అట్లాంటిక్ చిలెలో (పటగోనియాలో)పచ్చిక మైదానాలు ఉంటాయి. చిలీ వృక్షజాతులు పొరుగున ఉన్నఅర్జెంటీనా కంటే వ్యత్యాసంగా ఉంటాయి.[61] చిలీలోని కొన్ని వృక్షజాతులు అంటార్కిటిక్ పూర్వీకతను కలిగి ఉన్నాయి. మంచు యుగంలో ఏర్పడిన " లాండ్ బ్రిడిజ్ " కొన్ని జాతులు వృక్షాలు అంటార్కిటిక్ నుండి దక్షిణప్రాంతాలకు విస్తరించడానికి అనుకూలంగా మారింది.[62] చిలీలో 3,000 జాతుల నాచు నమోదు చేయబడింది.[63][64] అయినా ఇది పూర్తి సంఖ్యకాదు.చిలీలోని పూర్తి నాచుజాతుల సంఖ్య అపరిమితంగా ఉందని భావిస్తున్నారు.ప్రపంచంలోని అన్ని నాచుజాతులలో 7% చిలీలో కనిపిస్తున్నాయని భావిస్తున్నారు.[65] ప్రస్తుతం లభిస్తున్న సమాచారం స్వల్పమైనప్పటికీ అధికసమాచారం కొరకు మొదటి ప్రయత్నాలు ప్రారంభం అయింది.[66]
చిలీ భౌగోళికమైన ఏకాంతం చట్టవిరుద్ధ జీవితం , వలసలను పరిమితం చేసింది. అందువలన ప్రత్యేకంగా దక్షిణ అమెరికన్ జంతువులలో కొన్ని మాత్రమే ఇక్కడ కనుగొనబడ్డాయి. పెద్ద క్షీరదాల్లో ప్యూమా (కౌగర్) లామా-లాంటి గ్వానాకో , నక్కలు లాంటి దక్షిణ అమెరికన్ గ్రే ఫాక్స్ (చిల్లా) మొదలైనవి ఉన్నాయి. అటవీ ప్రాంతంలో, అనేక రకాల మార్సుపుయల్లు , పుడు పుడు అని పిలువబడే చిన్న జింక కనుగొనబడ్డాయి.[60]చిన్న పక్షులు అనేక జాతులు ఉన్నాయి కానీ చాలా సాధారణ లాటిన్ అమెరికన్ దేశాలలో కనిపించే పెద్ద పక్షులు ఎక్కువగా లేవు. స్థానికజాతులకు చెందిన కొన్ని మంచినీటి చేపలు ఉన్నాయి. అండియన్ సరస్సులలో ఉత్తర అమెరికా ట్రౌట్ విజయవంతంగా ప్రవేశపెట్టారు.[60] సమీపంలో హుమ్బోల్ట్ కర్రెంట్ ఉన్న కారణంగా చేపలు , సముద్ర జీవుల ఇతర ఆకృతులతో సముద్ర జీవులు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో అనేక పెంగ్విన్లతో సహా నీటి వనరుల జాతులకు చెందిన వాటర్ ఫౌల్ వంటి సముద్రపు పక్షులకు మద్దతునిస్తాయి. తిమింగలాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఆరు రకాల సీల్స్ కనిపిస్తాయి.
సౌత అమెరికన్ ప్లేట్లైన నాజ్కా , అంటార్కిటికా ప్లేట్లు చిలీ అత్యున్నతమైన సెయిస్మిక్ , అగ్నిపర్వత ప్రాంతంలో " పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ "లో భాగంగా ఉంది.
Topographic map of Chile. To view maps based onSRTM topographic relief of the country, seehere.Nevado Ojos del Salado: View from the top Chilean Argentine side.TheAtacamaDry lake, in Chile. At the horizon, theLicancabur volcano.Conguillío National Park, south-central area of the country.A glacier at the Beagle Channel
251 మిలియన్ సంవత్సరాల క్రితం పాలియోజోయిక్ చివరలో చిన్ గోండ్వానాలో భాగంగా ఉంది. దక్షిణ అమెరికా పలకల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా 66 మిలియన్ సంవత్సరాల క్రితం మెసోజోయిక్ చివరలో పెరిగిన సముద్రపుఘర్షణ ఫలితంగా అండీస్ పర్వతాలు ఏర్పడ్డాయి. శిలల మడత కారణంగా లక్షలాది సంవత్సరాలు పూర్వం ఈ భూభాగం రూపుదిద్దుకుంది.
ఈభూభాగం చిలీ సరిహద్దులను దాటి విస్తరింది. చిలీలోని భూభాగంలో 80% వరకు రెండు పర్వత శ్రేణులచే ఆక్రమితమై ఉంది. ఆండెస్ పర్వత తూర్పు సరిహద్దులోబొలీవియా ,అర్జెంటీనా ఉన్నాయి.దేశంలోని ఆల్టన్ 18 (6891.3 మీ) " నెవాడో ఓజోస్ డెల్ సలోడో "లో భాగంగా ఉంది.ఆల్టన్ ప్రపంచంలో అత్యున్నత అగ్నిపర్వతంగా గుర్తించబడుతుంది. అటకామ ప్రాంతంలో , తీరప్రాంతంలో ఉన్న తక్కువ ఎత్తైన పశ్చిమ-ఆండెస్ ఉంది. ఈపర్వతశ్రేణిలోఉన్న అత్యంత ఎత్తైన శిఖరం (3114 మీటర్ల పొడవు) ఉన్న వికునమా మక్కెన్నా కొండ ఈప్రాంతంలో ఉంది. సియెర్రా వికునా మాకెన్నాకు దక్షిణంలో " అంటోఫాగస్టా రీజియన్ "కు ఉంది. తీరప్రాంత పర్వతాలలో పసిఫిక్ తీర ప్రాంతమైదానాలు ఉన్నాయి.విభిన్నమైన పొడవు కలిగిన ఈ మైదానాలు పెద్ద నౌకాశ్రయాలు , సముద్రతీర పట్టణాలు ఏర్పడాడానికి అనుకూలంగా ఉన్నాయి. అండీస్ యొక్క తూర్పు ప్రాంతంలో పటాగోనియన్ సోపానాలు , మాగెల్లాన్ ఆల్టిప్లానో పునా డి అటాకమా వంటి అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులలో ఉండే పీఠభూములు అధికంగా ఉన్నాయి.
దేశంలోని ఉత్తర సరిహద్దుల మద్య " ఫార్ నార్త్ (చిలీ )" ఉంది. దేశంలోని అటాకామ ఎడారి ప్రపంచంలో అత్యంత శుష్కత కలిగిన ఎడారిగా గుర్తించబడుతుంది. పంపా డెల్ టమరుగల్ అని పిలువబడే ప్రదేశంలో ఉద్భవించిన ప్రవాహాలచే ఎడారి విభజించబడుతూ ఉంది.రెండు భాగాలుగా విభజించబడుతున్న ఆండీస్ తూర్పుదిశలోబొలివియా ఉంది. ఇక్కడ అధిక ఎత్తులో ఉండే అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడ అండియన్ ఆల్టిప్లానో , " సలార్ డి అటాకమా " ఉప్పు నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఇది కాలక్రమేణా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది.
Note:1 shared with Argentina,2 shared with Bolivia.
దక్షిణభూభాగంలో ఉన్న " నార్టే చికో (చిలీ)" అకోన్కాగు నది వరకు విస్తరించింది. లాస్ ఆండీస్ దక్షిణభూభాగం నుండి ఆండి పర్వతాలు ఎత్తు తగ్గుముఖం పడుతూ తీరప్రాంత సమీపంలో 90 కిలోమీటర్ల దూరంలో చిలీ భూభాగం ఇరుకైన భాగమైన ఇపపెల్ వద్దకు చేరుకుని ఇక్కడ రెండు పర్వత శ్రేణులు కలుస్తాయి. ఈ భూభాగం గుండా ప్రవహించే నదుల ఉనికి ఇటీవలి కాలంలో తీర మైదానాలు విస్తరణకు విస్తారమైన వ్యవసాయానికి అనుకూలంగా మారుతున్నాయి.
" జోనా సెంట్రల్ (చిలీ)" ప్రాంతం దేశంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంగా ఉంది. తీరప్రాంత పర్వతశ్రేని ఎత్తు తగ్గుముఖం పట్టిన విస్తారంగా ఉన్న తీరప్రాంత మైదానాలు పసిఫిక్ మహాసముద్రతీరాలలో నగరాల స్థాపనకు , నౌకాశ్రయాల నిర్మాణాలకు అనుకూలంగా ఉన్నాయి. , పసిఫిక్ పక్కన నగరాలు , నౌకాశ్రయాల స్థాపనకు అనుమతిస్తాయి, తీర పర్వతాలు దాని ఎత్తులో ఉన్నాయి. 6000మీ పైన ఉన్న ఎత్తైన ఆండెస్ పర్వతశ్రేణి సరాసరి ఎత్తు 4000మీ.మద్యలో ఉండే మైదానాలు సారవంతమైన వ్యవసాయక్షేత్రాలు మానవ ఆవాసాల ఏర్పాటుకు అనుకూలంగా ఉంది.దక్షిణప్రాంతంలో " కోర్డిల్లెర డి లా కాస్టా " నహెయిల్బూట శ్రేణిలో తిరిగి కనిపిస్తుంది. అయితే హిమనదీయ అవక్షేపాలు " లా ఫ్రోంటెరా (చిలీ) " ప్రాంతంలో అనేక సరస్సులను సృష్టిస్తున్నాయి.
రిలేంకావిలో పటగోనియా విస్తరించి ఉంది. లియాంక్యుహ్యూ హిమనదీయ సమయంలో ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉండేది. చిలీ ప్రాంతం వైపు బలంగా కుదించబడ్డాయి. తత్ఫలితంగా సముద్ర మట్టాం అధికమై తూర్పున ద్వీపకల్పంలో కనుమరుగవుతున్న తీరప్రాంత పర్వతాలలో " చిలో ద్వీపం , చోనోస్ ద్వీపసమూహం ఏర్పడ్డాయి. ఆండీస్ పర్వత శ్రేణి హిమానీనదం చర్య కారణంగా ఆండెస్ పర్వతశ్రేణి ఎత్తు తగ్గి , కోత వలన " ఫ్జోర్డ్స్ " ఏర్పడింది.ఖండంలో లోని ఉత్తరభాగంలో ఉన్న ఆండీస్ పర్వత తూర్పు ప్రాంతం " టియెర్రా డెల్ ఫ్యూగో (ప్రధాన ద్వీపం)" అనేక చదునైన మైదానాలు ఉన్నాయి.
ఆండెస్ గతంలో " కార్డిల్లెరా డి లా కోస్టా " గతంలో ఏర్పడిన విధంగా సముద్రంలో విచ్ఛిన్నం కావడంతో ద్వీపాలు , చిరు ద్వీపాలను పదిలపరుచుకొని దానిలో అదృశ్యమవుతుంది. దక్షిణ అంటిల్లెస్ ఆర్క్లో తరువాత మునిగిపోతూ తిరిగి అంటార్కిటిక్ ద్వీపకల్పంలో చిలీ అంటార్కిటిక్ భూభాగంలో " మెరిడియన్స్ "గా కనిపిస్తుంది.
దేశంలో అంతర్భాగంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న " ఇంసులర్ చిలీ " అని పిలువబడుతున్న పలు అగ్నిపర్వతాతో ఉన్న ద్వీపసమూహాలు ఉన్నాయి. వీటిలో " ఆర్చిపెలాగో జుయాన్ " , ఈస్టర్ ఐలాండ్లు ఉన్నాయి.ఇవి ఈస్ట్ పసిఫిక్ అనబడే నజ్కా ప్లేట్ , ది పసిఫిక్ ప్లేట్ మద్య ఉన్నాయి.
Chilean (blue) and average Latin American (gray)GDP per capita (1950–2008).Sanhattan, the financial district in Santiago de Chile.Vineyard in the commune ofPuente Alto, in the Metropolitan Region of Santiago. Chile is the fifth largest exporter of wine in the world.Chuquicamata copper mine
శాంటియాగో లోని " చిలీ సెంట్రల్ బ్యాంక్ " చిలీ ప్రజలకు ఆర్ధికసేవలను అందిస్తుంది. చిలియన్ కరెంసీని " చిలియన్ పెసో " అంటారు. దక్షిణ అమెరికా దేశాలలో అత్యంత స్థిరమైన , సంపన్నమైన దేశాలలో చిలీ ఒకటి.[58] లాటిన్ అమెరికన్ దేశాలలో మానవవనరుల అభివృద్ధి, పోటీమనస్తత్వం, తలసరి ఆదాయం, అంతర్జాతీకరణ, ఆర్ధికస్వాతంత్రం , తక్కువ శాతంగా ఉన్న లంచం మొదలైన విషయాలలో చిలీ ఆధిఖ్యత వహిస్తుంది.[67] 2013 జూలై నుండి వరల్డ్ బ్యాంక్ చిలీని " అత్యధిక ఆదాయం లిగిన దేశం " గా వర్గీకరించింది.[68][69][70] చిలీ అమెరికా ఖండాలలో అత్యున్నత ఆర్ధిక స్వాతంత్రం కలిగిన దేశంగా , ప్రంపంచంలో 7 వ దేశంగ గుర్తించబడుతుంది.[71] 2010 మేలో చిలీ అమెరికా ఖండాలలో మొదటి దేశంగా " ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్- కో ఆపరేషన్ అండ్ డెవెలెప్మెంటు " సభ్యత్వం కలిగి ఉంది.[72] 2006 లో చిలీ అత్యధిక నామినల్ జి.డి.పి. కలిగిన దేశంగా గుర్తించబడింది.[73] చిలియన్ జి.డి.పి.లో రాగి గనుల పరిశ్రమ 20% నికి భాగస్వామ్యం వహిస్తుంది.[74] ఎస్కాండిడా ప్రంపంచంలో అత్యంత పెద్ద రాగి గనిగా , ప్రపంచ రాగి సరఫరాలో 5%నికి భాగస్వామ్యం వహిస్తుంది.[74] మొత్తంగా ప్రపంచ రాగి ఉత్పత్తిలో చిలీ మూడవ భాగానికి భాగస్వామ్యం వహిస్తుంది.[74] ప్రభుత్వ మైనిగ్ ఫాం " కొడెల్కొ " ప్రైవేట్ కంపెనీలతో పోటీగా పనిచేస్తుంది.[74] 1980 నుండి బలమైన ఆర్ధికవిధానాలు నిరంతరాయంగా అనుసరించబడుతున్నాయి.చిలీ ఆర్ధికాభివృద్ధి కారణంగా పేదరికం సంగంకంటే అధికంగా తగ్గించబడింది.[18][75] 1999లో చిలీ స్వల్పంగా ఆర్ధికపతనాన్ని ఎదుర్కొన్నది. 2003 వరకు ఆర్ధికరంగం మందకొడిగాసాగింది. తరువాత ఆర్ధికరంగం కోలుకుని 4% జి.డి.పి అభివృద్ధి చెందింది.[76] 2004లో ఆర్ధికరంగం 6% అభివృద్ధిచెందింది. 2005 లో 5.7% 2006 లో 4% అభివృద్ధి చెందింది. 2007లో 5% ఆర్ధికాభివృద్ధి చెందింది.[18]
" 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం " ఎదుర్కొన్న ప్రభుత్వం ఉపాధి , అభివృద్ధిని పెంచటానికి ఆర్థిక ఉద్దీపన ప్రణాళికను ప్రకటించింది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఉన్నప్పటికీ 2009 లో జి.డి.పి. 2 -3 % అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్ధిక విశ్లేషకులు ప్రభుత్వం అంచనాలతో విభేదించారు 1.5% మధ్యస్థంలో ఆర్థిక వృద్ధిని ఊహించారు.[77] 2012లో జి.డి.పి. 5.5% అభివృద్ధి చెందింది.2013 మొదటి చతుర్ధంలో 4.1% అభివృద్ధిని సాధించింది.[78]2013 ఏప్రెల్‌లో నిరుద్యోగం శాతం 6.4%కు చేరుకుంది.[79] వ్యవసాయం, గనులు , నిర్మాణరంగంలో కూలీల కొరత ఏర్పడింది.[78] అధికారికంగా ప్రకటించినదానికంటే పేదల సంఖ్య అధికంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.[80] జుయాన్ కార్లోస్ ఫెరెస్ వ్రాతల ఆధారంగా యురేపియన్ దేశాలలో 27% చిలియన్లు పేదవారుగా ఉన్నారని భావిస్తున్నారు.[81] 2012 నవంబర్ గణాంకాల ఆధారంగా 11.1 మిలియన్ల ప్రజలు (64% ప్రజలు) ప్రభుత్వ సంక్షేమపధకాల ప్రయోజనాలను అందుకుంటున్నారని అంచనా.[82][విడమరచి రాయాలి] " సోషల్ ప్రొటైషన్ కార్డ్ " ఆధారంగా పేదరింకంలో నివసిస్తున్నవారు , పేదరికంలో జారుతున్న వారూ ఉన్నారని భావిస్తున్నారు.[83]" చిలీ పెంషన్ సిస్టం " ప్రైవేటీకరణ చేయబడింది. అది దేశీయపెట్టుబడులకు , పొదుపు పథకాలకు ప్రోత్సాహం అందించిన కారణంగా పొదుపు మొత్తం జి.డి.పి.లో 21% నికి భాగస్వామ్యం వహించింది.[84] నిర్భంధ పెంషన్ పధకం కొరకు ఉద్యోగులు తమ జీతంలో 10% ప్రైవేట్ ఫండ్స్‌కు చెల్లించారు.[18] 2009 నాటికి అది అంతర్జాతీయ ఆర్ధికసంక్షోభం కారణంగా పెంషన్ పధకం వదిలివేయబడింది.[85]" 2003 లో చిలీ " ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు " మీద సంతకం చేసింది.2003 లో యునైటెడ్ స్టేట్స్‌తో చేసిన ఒప్పందం 2004లో అమలు చేయబడింది.[86] యునైటెడ్ స్టేట్స్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం , రాగి ధరలు అధికరించిన కారణంగా ద్రవ్యోల్భణం 60% నికి చేరుకున్నదని గణాంకాలు సూచిస్తున్నాయి.[18] 2006లోచైనాతో చిలీ మొత్తం యు.ఎస్. స్థాయికి చేరుకుంది.అది చిలీ- ఆసియా వాణిజ్యంలో 66% నికి భాగస్వామ్యం వహిస్తుంది.[18] 2005-2006లో ఆసియాకు ఎగుమతులు 29.9% అధికరించిందని భావిస్తున్నారు.[18] చిలీ దిగుమతులు వార్షికంగాఈక్వడార్ (123%), తాయ్‌లాండ్ (72.1%,దక్షిణ కొరియా 52.6% ,చైనా (36.9% అధికరించింది.[18]విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు చిలీ విధానం దేశం విదేశీ పెట్టుబడి చట్టంలో క్రోడీకరించబడింది. రిజిస్ట్రేషన్ సులువుగా , పారదర్శకంగా ఉందని నివేదించబడింది. విదేశీ పెట్టుబడిదారులు అధికారిక " విదేశీ మారకం మార్కెట్"కు తమ లాభాలు , రాజధానిని తిరిగి స్వదేశానికి అప్పగించాలని హామీ ఇచ్చారు.[18] అదనపు పెట్టుబడులను ఆకర్షించడానికి చిలీ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది.[18] చిలీ ప్రభుత్వం విదేశీఋణాలు చెల్లించడం కొనసాగించింది. 2006 నాటికి ఋణం జి.డి.పి.లో 3.9% నికి చేరుకుంది.[18] 2012 గణాంకాల ఆధారంగా రాగి నుండి ప్రభుత్వానికి 14% ఆదాయం లభిస్తుందని అంచనా.[78]
ఆర్థిక వ్యవస్థకు రవాణా వ్యవస్థ చాలా ముఖ్యమైనది. రైల్వే నెట్వర్క్ క్షీణించిన తరువాత ఇప్పుడు చిలీలో సుదూర రవాణాకు బస్సులు ప్రధాన మార్గంగా ఉన్నాయి.[88] బస్ వ్యవస్థ మొత్తం అరికా (చిలీ) నుండి శాంటియాగో 30 గంటల ప్రయాణం , శాంటియాగో నుండి పుంటా ఎరీనాస్‌కు 40 గంటల ప్రయాణం, ఓస్రోరో (చిలీ) వరకు కొంతమార్పు ఉంటుంది.
చిలీ మొత్తం 372 రన్వేలను కలిగి ఉంది (62 మెరుగైనవి , 310 చదును చేయనివి).చిలీలోని ముఖ్యమైన విమానాశ్రయాలలో " చాచుల్లూతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " (అరికా), " డియెగో అరాసెనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " (ఇక్విక్), " సెర్రో మోరోనో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " (అంటోఫాగస్టా ), ఎల్ టెప్యూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " (ప్యూర్టో మానంట్), " అధ్యక్షుడు కార్లోస్ ఐబనీజ్ డెల్ కామ్పో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ", " కారియెల్ సుర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ " (పుంటా అరేనాస్), " మాతావరి అంతర్జాతీయ విమానాశ్రయం " (ఈస్టర్ ద్వీపం)(ప్రపంచంలో అత్యంత మారుమూల విమానాశ్రయం) ప్రధానమైనవి.[dubious –discuss], , 2011 లో 12,105,524 మంది ప్రయాణీకుల రాకపోకలకు సౌకర్యం కలిగిస్తున్న " కొమోడోరో ఆర్టురో మెరినో బెనితెజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (శాంటియాగో)". లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఎయిర్‌లైన్ " హోల్డింగ్ కంపెనీ " ప్రధానకార్యాలయం , లాన్ కారియర్ (చిలియన్ ఫ్లాగ్ కారియర్) ప్రధాన కార్యాలయం శాంటియాగోలో ఉన్నాయి.
చిలీ టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ చిలీ ద్వీపకల్పం , అంటార్కిటిక్ స్థావరాలు సహా దేశంలోని చాలా ప్రాంతాలకు సమాచారసేవలు అందిస్తూ ఉంది.1988 లో టెలిఫోన్ వ్యవస్థ ప్రైవేటీకరణ ప్రారంభమైంది. విస్తృతంగా మైక్రోవేవ్ రేడియో రిలే సౌకర్యాలు , దేశీయ ఉపగ్రహ వ్యవస్థ (3 ఎర్త్ స్టేషన్లు ఉన్నాయి)ఆధారిత చిలీ అత్యంత అధునాతన టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ దక్షిణ అమెరికాలోని అత్యంత అధునాతన సమాచారవ్యవస్థలలో ఒకటిగా గుర్తించబడుతుంది.[75] 2012లో చిలీలో 3.276 మిలియన్ల మెయిన్ లైన్లు , 24.13 మిలియన్ల మొబైల్ లైన్లు ఉపయోగంలో ఉన్నాయి.[75] " ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషంస్ యూనియన్ " డేటాబేస్ ఆధారంగా 61.42% చిలియన్లు అంతర్జాలం ఉపయోగిస్తున్నారని భావిస్తున్నారు.దక్షిణామెరికాలో అంతర్జాలం అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశాలలో మొదటి స్థానంలో ఉంది.[89]
నీటి సరఫరా , పారిశుధ్యం రంగం అధిక స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంది.చాలా ఇతర దేశాలతో పోలిస్తే చిలీ ఉన్నత సేవా నాణ్యత కలిగి ఉంటుంది. చిలీలోని మంచినీటి సరఫరా , పారిశుధ్యం బాధ్యతలను అన్ని పట్టణాలలోని జల సంస్థలు ప్రైవేటు యాజమాన్యం చేత నిర్వహించబడుతున్నాయి. ఆధునిక , సమర్థవంతమైన నియంత్రణ పేద ప్రజల నీటి అవసరాలను తీరుస్తూ ఉందని చిలీ సగర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది.
Many ofChile's vineyards are found on flat land within the foothills of the Andes.
చిలీలో వ్యవసాయం దేశప్రత్యేక భూగోళ స్థితి, వాతావరణం , భూగర్భస్థితి , మానవచర్యల కారణంగా పలు వైవిధ్యాలను కలిగి ఉంది. 2007 గణాంకాల ఆధారంగా చారిత్రాత్మకంగా చిలీ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ఒకటిగా ఉంది. ప్రస్తుతం వ్యవసాయం , అనుబంధ రంగాలైన అటవీ, లాగింగ్ , చేపల పెంపకం 4.9% జీడీపీకి భాగస్వామ్యం వహిస్తున్నాయి. వ్యవసాయరంగంలో దేశంలోని శ్రామిక శక్తిలో 13.6% మందికి ఉపాధి కలుగజేస్తుంది. చిలీలోని వ్యవసాయ ఉత్పత్తుల్లోద్రాక్ష,ఆపిల్, పియర్,ఉల్లిపాయలు,గోధుమ,మొక్కజొన్న, వోట్స్,పీచు,వెల్లుల్లి, ఆస్పరాగస్, బీన్, గొడ్డు మాంసం, పౌల్ట్రీ,ఉన్ని,చేపలు,కలప , హేమ్ప్ ప్రధానమైనవి. చిలీ భౌగోళికస్థితి , కచ్చితమైన కస్టమ్స్ పాలసీల కారణంగా చిలీ మాడ్ కౌ డిసీస్,ఫ్రూట్ ఫ్లై , ఫైలోక్జేరారా వంటి వ్యాధుల నుండి సురక్షితంగా ఉంది.దక్షిణ అర్ధగోళంలో ఉన్న కారణంగా చిలీ ఉత్తరార్ధగోళంలోని వ్యవసాయ పంటలకంటే వైవిధ్యమైన పంటలను పండిస్తుంది. చిలీలోని విస్తృత వ్యవసాయ అనుకూల పరిస్థితులు చిలీ అనుకూల ప్రయోజనాలుగా భావిస్తారు. చిలీ పర్వత భూభాగం వ్యవసాయం పరిమాణాన్ని , తీవ్రతను పరిమితం చేస్తుంది. మొత్తం భూభాగంలో వ్యవసాయ అనుకూల భూభాగం 2.62% మాత్రమే ఉంటుంది.
చిలీలో పర్యాటక రంగం గత కొన్ని దశాబ్దాల్లో స్థిరంగా అభివృద్ధి చెందుతూ ఉంది.2005 లో పర్యాటక రంగం 13.6 అభివృద్ధి చెందింది.పర్యాటక రంగం నుండి దేశానికి 4.5 బిలియన్ డాలర్లకంటే అధికమైన ఆదాయం లభించింది. అందులో విదేశీ పర్యాటకుల నుండి 1.5 బిలియన్ లభించింది. " నేషనల్ సర్వీస్ ఆఫ్ టూరిజం " (సేనాటూర్) అనుసరించి వార్షికంగా 2 మిలియన్ల మంది పర్యాటకులు చిలీని సందర్శిస్తున్నారు. ఈ పర్యటకులలో చాలామంది అమెరికా ఖండాలలోని ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. ప్రధానంగాఅర్జెంటీనా తరువాత యునైటెడ్ స్టేట్స్, ఐరోపా ,బ్రెజిల్ నుండి పర్యాటకుల సంఖ్య అధికరిస్తుంది.దక్షిణ కొరియా , పి.ఆర్. చైనా నుండి చిలీని సందర్శించడానికి వస్తున్న ఆసియన్ల సంఖ్య అధికరిస్తుంది.[90]చిలీ లోని పర్యాటక ఆకర్షణలలో ప్రధానమైన ఉత్తరభూభాగంలో ఉన్న " సాన్ పెడ్రో డి అటకామా " విదేశీ పర్యాటకులను బాగా ఆకర్షిస్తూ ఉంది.పర్యాటకులు ఇంకాల నిర్మాణ శైలిని, ఆప్టిప్లానాలోని సరస్సులు , " వల్లే డి లా లూనా (వ్యాలీ ఆఫ్ ది మూన్)చూసి ఆనందిస్తుంటారు.[మూలం అవసరం] ఉత్తరాన పుట్రే లో, చుంగర లేక్, అలాగే పెరనాకోటా అగ్నిపర్వతం , పోమ్రేప్ అగ్నిపర్వతాలలో 6,348 మీటర్లు , 6,282 మీటర్ల ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. మద్య అండీస్ అంతటా అంతర్జాతీయ స్థాయి స్కై రిసార్ట్లు అనేకం ఉన్నాయి.[మూలం అవసరం] ఇవికాక పోర్టిలో, వాలె నవాడో , టెర్మాస్ డీ చిలియన్.దక్షిణ ప్రాంతంలో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా ఉన్న నేషనల్ పార్కులలో " కాంగుయిలో నేషనల్ పార్క్ " చాలా ప్రబలమైనదిగా ఉంది.[మూలం అవసరం] తీరప్రాంతాలలో తిరుయా , సెనెటే ప్రాంతాలలో ఇస్లా మొచ, నహుయల్బుటా నేషనల్ పార్క్, చిలీ ఆర్చిపిలాగో , పటగోనియా నేషనల్ పార్క్ ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.[మూలం అవసరం] పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈస్టర్ ద్వీపం చిలియన్ ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది.పర్యాటకం వేసవిలో అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా సముద్రతీర పట్టణాలలో వేసవి మరింత అనుకూలం.[మూలం అవసరం] ఉత్తరభూభాగంలో అరికా, ఇక్విక్, అంటోఫాగస్టా, లా సెరీనా(చిలీ) , కోక్విమ్బో ప్రధాన వేసవి కేంద్రాలుగా ఉన్నాయి. ఉత్తర , పశ్చిమ తీర ప్రాంతాలలో పుకాన్ లేక్ విల్లారికా దక్షిణప్రాంతాలలో ప్రధాన కేంద్రంగా ఉంది. శాంటాగోగోకు సమీపంలో ఉన్న కారణంగా వల్పరైసో ప్రాంతం తీరంలో ఉన్న అనేక బీచ్ రిసార్టులతో అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. కాసినో , వార్షిక " వినా డెల్ మార్ ఇంటర్నేషనల్ సాంగ్ ఫెస్టివల్ ", లాటిన్లో అతి ముఖ్యమైన సంగీత కార్యక్రమం, ఎందుకంటేవినా డెల్ మార్ వల్పరైసో ఉత్తర సంపన్న పొరుగు దేశాలైన లాటిన్ అమెరికా పర్యాటకులను ఆకర్షిస్తుంది.[మూలం అవసరం]ఒ హిగ్గింస్ ప్రాతంలోని పిచిలెము దక్షిణ అమెరికాలో " బెస్ట్ సర్ఫింగ్ స్పాట్ " గా ఉంది.[మూలం అవసరం]2005 నవంబర్‌లో ప్రభుత్వం " చిలీ ఆల్ వేస్ సర్ప్రైజింగ్ " పేరుతో పర్యాటకరంగంలో , వాణిజ్యరంగంలో అభివృద్ధి చెందడానికి ప్రచార పోరాటం ఆరంభించింది.[91] 1880లో చిలీలోని " చిలియన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ " నిర్మించబడింది.ఇక్కడ చిలియన్ కళాఖాండాలు భద్రపరచి ఉన్నాయి.
Population of Chile from 1820, projected up to 2050
2002 చిలీ గణామకాల ఆధారంగా ప్రజలసంఖ్య 15 మిలియన్లు.1990 నుండి జసంఖ్యాభివృద్ధి జననాలశాతం క్షీణించిన కారణంగా క్షీణిస్తూ ఉంది.[92] 2050 నాటికి జనసంఖ్య చిలీ జనసంఖ్య 20.2 మిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.[93] దేశంలోని 85% ప్రజలు నగరప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరిలో 40% శానిటియాగో మహానగర ప్రాంతంలో నివసిస్తున్నారు.2002 గణాంకాల ఆధారంగా శాంటియాగో మహానగర జనసంఖ్య 5.6 మిలియన్లు, గ్రేటర్ కాంసెప్షన్ జనసంఖ్య 8,61,000 , గ్రేటర్ వల్పారాయిసొ 8,24,000.[94]
" నేషనల్ అటానిమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికొ " మెక్సికన్ ప్రొఫెసర్ ఫ్రాంసిస్కొ లిజాంకొ అంచనా ఆధారంగా చిలియన్లలో 52.7% శ్వేతజాతీయులు, 39.3% మెస్టిజోలు , 8% అమెరిండియన్లు ఉన్నారని భావిస్తున్నారు.[95] సమీకాల కాండ్లే ప్రాజెక్ట్ అధ్యయనాలు 52% యురేపియన్లు, 44% జెనోం (అమెరిండియన్ సంతతి) , 4% ఆఫ్రికన్లు ఉన్నారు.మెస్టిజోలలో ఆఫ్రికన్ మూలాలు ఉన్నాయని జన్యుశాస్త్ర అధ్యయనాలు సూచిస్తున్నాయి.[96] " యూనివర్శిటీ ఆఫ్ బ్రసిలియా " వెలువరించిన మరొక జన్యుశాస్త్ర అధ్యయనం ఆధారంగా పలు అమెరికన్ దేశాలు చిలీ గురించిన జెనెటిక్ కంపొజిషన్ వెలువరిస్తున్న ఆధారాలు 51.6% యురేపియన్లు, అమెరికన్ స్థానికులు 42.1% , ఆఫ్రికన్ ప్రజలు 6.3% ఉన్నారని వివరిస్తున్నాయి.[97]యూనివర్శిటీ ఆఫ్ చిలీ వెలువరించిన హెల్త్ బుక్‌లెట్ ఆధారంగా చిలీలో 30% కౌకాసియన్ సంతతికి చెందిన ప్రజలు (వీరిలో శ్వేతజాతీయ మెస్ట్జోలు అధికంగా ఉన్నారు), స్థానిక ప్రజలు (అమెరిండియన్లు) 5% ఉన్నారని భావిస్తున్నారు.[98] చిలియన్లు అధికంగా తమను శ్వేతజాతీయులుగా చెప్పుకుంటారు. 2011 లాటినొబారొమెట్రో సర్వే చిలీ ప్రజలను వారి పూర్వీకత గురించి అడిగినప్పుడు వారిలో అత్యధికులు వారి శ్వేతజాతీయులుగా (59%) చెప్పారు, 25% మెస్టిజో అని చెప్పారు , 8% స్థానికులమని చెప్పారు.[99] 2002 జాతీయ గణాంకాలు 43% కొంత స్థానికి పూర్వీకత కొంత శాతం (8.3%) స్థానిక పూర్వీకత, 40.3% వారి పూర్వీకత వెల్లడించలేదు.[100]
1907 గణాంకాలు 1,01,118 (3.1%) ఇండియన్లు వారి సంస్కృతిని అనుసరిస్తూ వారి స్థానిక భాషలు మాట్లాడుతున్నారని భావిస్తున్నారు.[101]2002 లో గణాంకాలలో వారు 8 చిలియన్ సమూహాలకు చెందినట్లు అంగీకరించారు. 4.6% (6,92,192)ప్రజలు స్థానికజాతికి చెందిన వారుగా అంగీకరించారు.87.3% ప్రజలు వారిని వారు మపుచే అని అంగీకరించారు.[102] స్థానిక జాతి ప్రజలలో అధికులు మిశ్రిత సంతతికి చెందిన ప్రజలుగా అంగీకరించారు.[103]" ఇండిజెనీస్ అండ్ ట్రైబల్ పీపుల్స్ కాంవెంషన్ 1989)" అంగీకరిస్తూ సంతకం చేసిన 22 దేశాలలో చిలీ ఒకటి.[104] 1989 లో " ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ " కాంవెంషన్‌లో పాల్గొన్నది.[105] వలసప్రజలకు చిలీ ఎప్పుడూ ఆకర్షణీయదేశంగా లేదు.యూరప్ నుండి దూరంగా ఉండడం , ప్రంపాచికి దూరంగా ఏకాంతప్రాంతంలో ఉండడం ఇందుకు ప్రధానకారణమై ఉండవచ్చు.[106][107] యురేపియన్లు అధికంగా తమ జన్మభూమికి అందుబాటులో ఉండే ప్రాంతాలకు ఆకర్షితులైయారు.జలసంధిలో దూరప్రయాణాలు , ఆండెస్ పర్వతాలు దాటడంలో వారు ఆసక్తి చూపలేదు.[106] యురేపియన్ వలసలు చిలీలోని మాగెల్లాన్ ప్రాంతంలో మినహా మిగిలిన చిలీలోని స్థానిక ప్రజలమీద తన ప్రభావం చూపలేదు.[108] చిలీ వలసప్రజలలో స్పెయిన్ ప్రజలు అధికంగా ఉన్నారు.[106]అర్జెంటీనా ,ఉరుగ్వే దేశాలలో జరిగినట్లు చిలీలో పెద్దసంఖ్యలో విదేశీ వలసలు సంభవించలేదు.[107] 1851-1924 మద్యకాలంలో చిలీకి 0.5% లాటి అమెరికా దేశాల నుండి యురేపియన్ వలసలు సంభవించాయి. అర్జెంటీనాకు, 46%, బ్రెజిల్‌కు 33%, క్యూబాకు 14% , 4% ఉరుగ్వేకు వలసలు సంభవించాయి.[106] చిలీసొసైటీలో వలసప్రజలు గణనీయమైన పాత్రవహించారు.[107]ఇతర యురేపియన్లు ఆస్ట్రియన్ల[109] , డచ్ ప్రజల మాదిరి స్వల్పసంఖ్యలో ఉన్నారు.వీరు 50,000 మంది ఉన్నారు.[110] జర్మన్ దేశంలో 1948 లిబరల్ రివల్యూషన్ విఫలం అయిన తరువాత[107][111] గుర్తించతగిన సంఖ్యలో జర్మన్లు వలసగా చిలీ చేరుకున్నారు.వారు జర్మన్- చిలియన్ సమూహం అభివృద్ధి చెందడానికి పునాది వేసారు.[107] వీరిలో జర్మన్ మాట్లాడే స్విజ్ ప్రజలు, సిలెసియన్లు, అల్సాటియన్లు , ఆస్ట్రియన్లు ఉన్నారు. వీరు వాల్డివియా,ఒసొర్నొ , లాంక్విహ్యూ ప్రాంతాలలో స్థిరపడ్డారు.[112] వివిధసంప్రదాయాలకు చెందిన యురేపియన్ ప్రజలు మద్య జాత్యంతర వివాహాలు జరిగాయి.ఈవివాహాలు మిశ్రిత సంప్రదాయం , జాతులు ప్రస్తుత చిలీ మద్యతరగతి , పైతరగతి సాంఘిక సాంస్కృతిక స్వరూపం రూపొందడానికి సహకరించింది.[113] దేశ ఆర్ధికభవిష్యత్తు కారణంగా చిలీ ప్రస్తుతం వలసప్రజల ఆకర్షణీయ ప్రాంతంగా మారింది. ప్రధానంగా అర్జెంటీనా, బొలీయియా , పెరూ దేశాల నుండి.[114] 2002 జాతీయ గణాంకాల ఆధారంగా 1992 నుండి విదేశీలలో జన్మించిన చియన్ల సంఖ్య 72% అధికరించింది.[115] 2008 డిసెంబర్ " మైగ్రేషన్ అండ్ ఫారిన్ రెసిడెంసీ డిపార్టుమెంటు " చిలీలో 3,17,057 మంది విదేశీయులు నివసిస్తున్నారని తెలియజేస్తుంది.[116] 5,00,000 చిలియన్లు పాలస్థీనా పూర్వీకత కలిగిఉన్నారని భావిస్తున్నారు.[117][118]
[119] 15 సంవతరాలకు పైబడిన చిలీ ప్రజలలో కాథలిక్ సంప్రదాయానికి చెందిన వారు 70%[120] 2002 జనాభా లెక్కల ప్రకారం - 17 %. ప్రజలు ఎవాంజికల్ చర్చికి కట్టుబడి ఉన్నారు. జనాభా గణనలో ఆర్థోడాక్స్ చర్చి (గ్రీకు, పెర్షియన్, సెర్బియన్, ఉక్రేనియన్ , ఆర్మేనియన్) మినహా అన్ని క్రైస్తవ-యేతర కాథలిక్ క్రిస్టియన్ చర్చీలు ఎవాంజికల్ చర్చీలుగా పరిగణించబడ్డాయి. వీటిలో ఎవాంజికల్, ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్ (మొర్మాన్స్), సెవెంత్ రోజువారీ అడ్వెంటిస్ట్స్ , యెహోవాసాక్షులు (ముఖ్యంగా దీన్ని ప్రొటెస్టంట్లకు పరిమితం చేశారు)ఉన్నాయి. (అయితే అడ్వెంటిసిజం తరచూ దానిలో భాగంగా పరిగణించబడుతుంది). ప్రొటెస్టంట్లు సుమారు 90 శాతం (సువార్తికులు) పెంటెకోస్టల్. వెస్లియన్, లూథరన్, రిఫార్ండ్ ఎవాంజెలికల్, ప్రెస్బిటేరియన్, ఆంగ్లికన్, ఎపిస్కోపాలియన్, బాప్టిస్ట్ , మెథడిస్ట్ చర్చిలు కూడా ఉన్నాయి.[121] నాస్తికులు , అజ్ఞేయవాదులు జనాభాలో సుమారు 12 శాతం మంది ఉన్నారు.ప్రస్తుతం 2015 లో చిలీలోని మెజారిటీ కలిగి ఉన్న మతం క్రైస్తవ మతం (68%), కాథలిక్ చర్చికి చెందిన చిలీయులు 55%, 13% ప్రొటెస్టంట్ లేదా ఇవాంజెలికల్ , ఇతరమతస్థులు 7% ఉన్నారు. అజ్ఞేయతావాదులు , నాస్తికులు 25% ఉన్నారు.[122] రాజ్యాంగం మతం యొక్క స్వేచ్ఛను కల్పిస్తుంది. ఇతర చట్టాలు , విధానాలు మతం స్వేచ్ఛగా ఆచరించడానికి దోహదం చేస్తుంది. అన్ని స్థాయిలలోని చట్టం ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పూర్తి హక్కును పరిరక్షిస్తుంది.[121]" చర్చి ఆఫ్ స్టేట్ " చిలీలో ప్రత్యేకత కలిగి ఉంది.అయినప్పటికీ కాథలిక్కు చర్చీలు విశేషాధికారం కలిగి ఉంది. ప్రభుత్వాధికారులు ప్రొటెస్టెంట్ , జ్యూయిష్ చర్చీ ఉత్సవాలలో తరచుగా పాల్గొంటూ ఉంటారు.[121]ప్రభుత్వ మతపరమైన శలవుదినాలలో క్రిస్మస్‌తో గుడ్ ఫ్రైడే, కార్మెన్ వర్జిన్ విందు, సెయింట్స్ పీటర్ , పాల్ విందు, అస్సప్షన్ ఫీస్ట్, ఆల్ సెయింట్స్ డే , జాతీయ సెలవులు వంటి ఇమ్మక్యులేట్ కాన్సెప్షన్ విందులకు శలవు కల్పిస్తుంది.[121] ప్రభుత్వం దేశం ప్రొటెస్టంట్ చర్చిల గౌరవార్థం ఒక పబ్లిక్ జాతీయ సెలవుదినం ఇటీవల అక్టోబర్ 31 రిఫార్మేషన్ డే శలవు దినంగా ప్రకటించింది.[123][124]చిలీ పేట్రాన్ సెయింట్స్ మౌంట్ కార్మెల్ అవర్ లేడీ , సెయింట్ జేమ్స్ గ్రేటర్ (శాంటియాగో).[125] 2005 లో సెయింట్ అల్బెర్టో హర్టాడో పోప్ బెనెడిక్ట్ XVI చేత నియమింప బడింది , సెయింట్ తెరెసా డి లాస్ ఆండెస్ తరువాత దేశం రెండవ సెయింట్గా మారింది.[126]
చిలీలో మాట్లాడే స్పానిష్ ప్రత్యేకమైనది , పొరుగున ఉన్న దక్షిణ అమెరికా దేశాల కంటే భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే చివరి అక్షరాలను , "శబ్దాలు" తరచుగా పడిపోతాయి , కొన్ని హల్లులు మృదువైన ఉచ్ఛారణ కలిగి ఉంటాయి. మాండలికంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు బేధంచాలా కొద్దిగా ఉంటుంది. ఇది సాంఘిక తరగతిపై ఆధారపడిన స్వభావం లేదా నగరంలో లేదా గ్రామాలలో నివసిస్తున్న ప్రజలలో మాండలికాలలో గుర్తించదగిన తేడాలు ఉన్నాయి. చిలీ జనాభా ఎక్కువగా దేశంలోని మధ్యభాగంలో ఒక చిన్న విభాగంలో ఏర్పడింది , ఉత్తరం , దక్షిణప్రాంతాలకు ప్రజలు పరిమిత సంఖ్యలో వలస పోయారు. భిన్నత్వం లేమిని వివరించడానికి సహాయపడింది. ఇది జాతీయ రేడియో , ప్రస్తుత టెలివిజన్ సంభాషణ వ్యక్తీకరణలను విస్తరించడానికి , సమన్వయపరచడానికి కూడా సహాయపడుతుంది.[18]చిలీలో మాట్లాడే అనేక దేశీయ భాషలు ఉన్నాయి: మాపుదుంగున్, క్వెచువా, ఐమారా , రాపా నుయ్. స్పానిష్ దండయాత్ర తరువాత స్పానిష్ లింగువా ఫ్రాంకాగా పేర్కొనబడింది.దేశీయ భాషలు మైనారిటీ భాషలుగా మారాయి. కొంత భాషలు ఇప్పుడు అంతరించిపోవడం లేదా అంతరించడానికి దగ్గరగా ఉన్నాయి.[127] దక్షిణ చిలీలో జర్మన్ ఇప్పటికీ వాడుకలో ఉంది.[128] చిన్న గ్రామాలలో లేదా పెద్ద నగరాల వర్గాల మధ్య రెండవ భాషగా ఉంది.ఇంగ్లీష్ ఓపెన్ డోర్స్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఐదవ గ్రేడ్ , పైన విద్యార్థులకు ప్రభుత్వం ఆంగ్ల తప్పనిసరి చేసింది. చిలీలో చాలా ప్రైవేటు పాఠశాలలు కిండర్ గార్టెన్ నుండి ఆంగ్ల భాషను బోధించడం ప్రారంభించాయి.[129] రోజువారీ స్పానిష్ సంభాషణలలో సాధారణ ఆంగ్ల పదాలు వాడుకలో ఉన్నాయి.[130]
ప్రాచీన వ్యవసాయ స్థావరాల మధ్య , కాలం చరిత్రపూర్వ మధ్యకాలం వరకు ఉత్తర చిలీ ఆండియన్ సంస్కృతికి కేంద్రంగా ఉంది. ఇది ఉత్తరాన తీర లోయలకు విస్తరించే అల్లిప్టానో సంప్రదాయాలతో ప్రభావితం కాగా దక్షిణ ప్రాంతాలు మాపుచే సాంస్కృతిక కార్యకలాపాల ప్రాంతాలుగా ఉన్నాయి. ఆక్రమణ తరువాత కాలనీల కాలంలో , ప్రారంభ రిపబ్లికన్ కాలంలో దేశం సంస్కృతిని స్పానిష్ ఆధిపత్యం చేసింది.ఇతర ఐరోపా ప్రభావాలు ప్రధానంగా ఇంగ్లీష్, ఫ్రెంచ్ , జర్మన్లు 19 వ శతాబ్దంలో ప్రారంభమై , ఈ రోజు వరకు కొనసాగాయి. జర్మనీ వలసదారుల ప్రభావం వారు అధికంగా నివసిస్తున్న వాల్డివియా, ఫ్రూటిల్లర్, ప్యూర్టో వరాస్, ఓస్రోనో, ట్యూముకో, ప్యూర్టో ఒక్టే, లాన్క్విహ్యూ, ఫాజా మైసన్, పిట్రుఫక్యూన్, విక్టోరియా, పకోన్ , ప్యూర్టో మానంట్ వంటి నగరాల్లో చిలీకి దక్షిణాన ఉన్న బవేరియన్ శైలి గ్రామీణ నిర్మాణం , వంటకాలలో ప్రభావితం చేస్తూ ఉన్నాయి.[131][132][133][134][135]
The historical district of the port city of Valparaíso
చిలీ యొక్క సాంస్కృతిక వారసత్వం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన కళలు, కళాప్రదర్శనలు, నృత్యాలు,హస్థకళలు, సంప్రదాయ ఉత్సవాలు, వంటకాలు, ఆటలు, సంగీతం, సస్కృతి సంబంధిత శలవులు , సంప్రదాయాలు ఉన్నాయి. చిలీ భూభాగం చెదురుమదురుగా పురావస్తు, నిర్మాణ కళ, సాంప్రదాయ, కళాత్మక, జాతిపరమైన, జానపద, చారిత్రక, మత లేదా సాంకేతిక ప్రాంతాలు, వస్తువులు , ప్రాంతాలు వస్తువుల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది, 1972 కన్వెన్షన్ నిబంధనలకు అనుగుణంగా ప్రపంచ సాంస్కృతిక , సహజ వారసత్వ రక్షణ 1980 లో చిలీచే ధ్రువీకరించబడింది. ఈ సాంస్కృతిక ప్రాంతాలలో రాపా నుయ్ జాతీయ ఉద్యానవనం (1995), చిల్లే యొక్క చర్చిలు (2000), పోర్ట్పౌట్ నగరం వల్పరైసో (2003), హంబెర్స్టోన్ , శాంటా లారా సాల్ట్పెటర్ వర్క్స్ (2005) , మైనింగ్ సిటీ సెవెల్ (2006)ఉన్నాయి.
గౌరవసూచకంగా , చిలెస్ సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుకు తీసుకురావడానికి 1999 లో సాంస్కృతిక వారసత్వ దినం స్థాపించబడింది. ఇది ప్రతి సంవత్సరం మే మాసంలో జరుపుకుంటారు. ఇది అధికారిక జాతీయ సెలవుదినంగా ప్రకటించబడింది.
చిలీలో సంగీతం జానపద, పాపులర్ , సాంప్రదాయిక సంగీతానికి చెందినది. దీని పెద్ద భూగోళస్థితి దేశంలోని ఉత్తర, మధ్య , దక్షిణాన వేర్వేరు సంగీత శైలులను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో ఈస్టర్ ద్వీపం , మాపుచే సంగీతం కూడా ఉన్నాయి.[136] జాతీయ నృత్యం క్యూకా. సాంప్రదాయ చిలియన్ పాట మరో రూపం టొనాడా. స్పానిష్ వలసవాదులచే దిగుమతి చేసుకున్న సంగీతం క్యూయకా కంటే శ్రావ్యంగా , అధిక శ్రావ్యత కారణంగా విభిన్నంగా ఉంటుంది.1950 , 1970 ల మధ్యలో లాస్ డె రామోన్, లాస్ క్యూటారో హుసాస్ , లాస్ హువాసోస్ క్విన్చెరోస్ వంటి ఇతర సమూహాలు జానపద సంగీతానికి పునర్జన్మ ఇచ్చింది.[137] రౌల్ డే రామోన్, వైయోలేటా పార్ , ఇతర సంగీతకారులతో. 1960 ల మధ్యకాలంలో స్థానిక సంగీత రూపాలు పారివా కుటుంబంలో న్యూవా కెసియోన్ చిలీనాతో పునరుద్ధరించబడ్డాయి. ఇది రాజకీయ కార్యకలాపాలతో సంబంధితమై , విక్టర్ జరా, ఇంటీ-ఇల్లిమాని , క్విలాపౌను వంటి సంస్కర్తలతో సంబంధం కలిగి ఉంది. జానపద , చిలియన్ ఎథ్నోగ్రఫీ ఇతర ముఖ్యమైన జానపద గాయకుడు , పరిశోధకుడు, మార్గోట్ లోయోలా. లాస్ జైవాస్, లాస్ ప్రిసిరోస్, లా లే , లాస్ టర్స్ వంటి అనేక చిలియన్ రాక్ బ్యాండ్లు అంతర్జాతీయ విజయాన్ని సాధించాయి. ఫిబ్రవరిలో వార్న డెల్ మార్ లో వార్షిక సంగీత ఉత్సవాలు జరుగుతాయి.[138]
చిలియన్లు వారి దేశాన్ని " పాయిస్ పాయిస్ " కవుల దేశం అని పిలుస్తుంటారు.Chileans call their countrypaís de poetas—country of poets.
[139][140] సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి లాటిన్ అమెరికన్ గాబ్రియేలా మిస్త్రల్ (1945). చిలీ యొక్క ప్రఖ్యాత కవి పాబ్లో నెరుడా, అతను సాహిత్యానికి నోబెల్ బహుమతి (1971) అందుకున్నాడు, ఆయన తన విస్తృతమైన శృంగార, ప్రకృతి, రాజకీయ సంబధిత గ్రంథాలు ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతి సంతరించి పెట్టాయి. ఇస్లా నెగ్రా, శాంటియాగో, వల్పరైసోలో ఉన్న ఆయన మూడు వ్యక్తిగత గృహాలు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి.
ఇతర చిలియన్ కవుల జాబితాలో కార్లోస్ పెజోవా వెలిజ్, విసెంటే హివిడోరో, గోన్జలో రోజాస్, పాబ్లో డి రోఖా, నినాన పార్, రౌల్ జురిటా ఉన్నారు. ఇసాబెల్ అల్లెండే అత్యుత్తమంగా అమ్ముడుపోయిన నవలలు వ్రాసిన చిలీ నవలా రచయితగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె 51 మిలియన్ల నవలలు అమ్ముడయ్యాయి.[141] నవలా రచయిత జోస్ డోనోసో నవల ది అబ్సెసే బర్డ్ ఆఫ్ నైట్ ను 20 వ శతాబ్దపు పాశ్చాత్య సాహిత్యం కానానికల్ రచనగా విమర్శకుడు హారొల్ద్ బ్లూంస్‌చేత పరిగణించబడింది. మరొక అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చిలీ నవలా రచయిత, కవి రాబర్టో బోలానో ఉన్నారు. అయన ఆంగ్ల అనువాదాలకు విమర్శకుల నుండి మంచి స్పందన పొందింది.[142][143][144]
చిలియన్ ఆహార సంస్కృతిలో భౌగోళిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది.ఆహారంలో సముద్ర ఆహారాలు, గొడ్డుమాసం, పండ్లు, కూరగాయలు ప్రాధాన్యత వహిస్తాయి.సంప్రదాయ ఆహారాలలో అసాడో, కాజుయేలా, ఎంపానడా, హ్యూమిటా, పాస్టెల్ డీ చొక్లొ, కురాంటో, సొపియపిల్లాస్ ప్రధానమైనవి.[145] చిలీలో వివిధ జాతి ప్రభావాల నుండి పాక రచనల మిశ్రమానికి క్రుడోస్ ఒక ఉదాహరణ. ముడి మృదువుగా ఉండే లామా,అత్యధికంగా వాడే షెల్ఫిష్, బియ్యం రొట్టె భారీగా ఉపయోగంలో ఉన్నాయి.ఇవి స్థానిక క్వెచువా ఆండియన్ వంటకాల నుండి తీసుకోబడ్డాయి (ఇప్పుడు యూరోపియన్లచే చిలీకు తీసుకువెళుతున్న గొడ్డు మాంసం కూడా లామా మాంసం స్థానంలో ఉంది). లిమోన్, ఉల్లిపాయలు స్పానిష్ వలసవాదులచే తీసుకునిరాబడ్డాయి. జర్మన్ వలసదారులు మేయోనైస్, పెరుగును ఉపయోగించారు.అలాగే బీరు ఉపయోగం వీరు పరిచయం చేసారు.
దేశంలోని సాంస్కృతిక, జనాభా లక్షణాలు చిలీ జానపద, వలసరాజ్యాల కాలంలో జరిగిన స్పానిష్, అమెరిన్డియన్ అంశాల మిశ్రమం ఫలితంగా ఉంది. సాంస్కృతిక, చారిత్రక కారణంగా అవి దేశంలో నాలుగు ప్రధాన ప్రాంతాలుగా వర్గీకరింపబడి గుర్తించబడ్డాయి: ఉత్తర ప్రాంతాలు, కేంద్ర, దక్షిణం. చిలీ సంస్కృతి చాలా సంప్రదాయాల్లో పండుగలు భాగంగా ఉంటాయి. అయితే కొన్ని నృత్యాలు, వేడుకలు వంటివి మతపరమైన సంప్రదాయాలలో భాగాలుగా ఉన్నాయి.[మూలం అవసరం]
1902 మే 26 న వల్పరైసోలో డాక్యుమెంటరీ ఎక్సర్సైజ్ జనరల్ ఫైర్ బ్రిగేడ్ ప్రీమియర్‌తో మొదలైంది. మొదటి చిత్రం పూర్తిగా దేశంలో చిత్రీకరించబడింది, ప్రాసెస్ చేయబడింది. తరువాతి దశాబ్దాల్లో మైలురాళ్ళుగా " ది డెక్కర్ (లేదా లార్డ్ స్ట్రీట్ యొక్క ఎనిగ్మా) (1916)", చిలీ కథ ప్రధానాంశంగా చిత్రీకరించిన మొట్టమొదటి చిత్రం " ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ (1920)", దేశంలో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం, ఉత్తర, దక్షిణ చిలీ మొదటి సౌండ్ చిత్రం " నార్త్ సౌత్ " (1934)లో చిత్రీకరించబడింది.
చిలీలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ అసోసియేషన్ ఫుట్ బాల్. 9 ఫిఫా (ఎఫ్.ఐ.ఎఫ్.ఎ) వరల్డ్ కప్ క్రీడలలో చిలీ భాగస్వామ్యం వహించింది.చిలీ 1962 లో ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్ క్రీడకు ఆతిథ్యం ఇచ్చి ఈక్రీడలలో చిలీ జాతీయ ఫుట్‌బాల్ జట్టు మూడవ స్థానంలో నిలిచింది. జాతీయ ఫుట్‌బాల్ జట్టు సాధించిన ఇతర విజయాలలో రెండుమార్లు కోప అమెరికా టైటిల్స్ (2015, 2016), రెండు రన్నర్లు స్థానాల్లో ఉన్నాయి. పాన్ అమెరికన్ గేమ్‌లో ఒక వెండి, రెండు కాంస్య పతకాలు, 2000 సమ్మర్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం, రెండో స్థానంలో నిలిచింది.ఎఫ్.ఐ.ఎఫ్.ఎ.అండర్ -17, అండర్ -20 యువ టోర్నమెంట్లలో పాల్గొన్నది. చిలియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో టాప్ లీగ్ చిలీ ప్రామిరా డివిజన్. దీనిని ఐ.ఎఫ్.ఎఫ్.హెచ్.ఎస్. ప్రపంచంలో తొమ్మిదవ బలమైన జాతీయ ఫుట్‌బాల్ లీగ్‌గా పేర్కొన్నది.[146]ప్రధాన ఫుట్బాల్ క్లబ్లు కోలో-కోలో, యునివర్సిడాడ్ డే చిలీ, యునివర్సిడాడ్ కాటోలిక్. కోలో-కోలో దేశం అత్యంత విజయవంతమైన ఫుట్ బాల్ క్లబ్, ఇది చాలా జాతీయ, అంతర్జాతీయ చాంపియన్షిప్‌తో పాటు కోప లిబెర్టాడోర్స్ దక్షిణ అమెరికా క్లబ్ టోర్నమెంట్‌తో సహా. యునివర్సిడాడ్ డి చిలీ గత అంతర్జాతీయ ఛాంపియన్ (కోప సుడమేరికానా 2011) ప్రధానమైనవి.
టెన్నిస్ చిలీలో అత్యంత విజయవంతమైన క్రీడగా ఉంది. చిలీ జాతీయ జట్టు రెండుసార్లు (2003 - 2004) ప్రపంచ కప్ కప్ క్లే టోర్నమెంట్ గెలుచుకుంది, 1976 లో ఇటలీతో జరిగిన డేవిస్ కప్ ఫైనల్‌లో పాల్గొన్నారు. 2004 వేసవి ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్‌లో బంగారు, కాంస్య పతకాలను దేశం స్వాధీనం చేసుకుంది. మార్సెలో రియోస్ ఎ.టి.పి.సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానానికి చేరుకున్న మొట్టమొదటి లాటిన్ అమెరికన్ వ్యక్తి అయ్యాడు. అనీటా లిజానా 1937 లో యు.ఎస్. ఓపెన్ గెలిచింది. లాటిన్ అమెరికా గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ గెలుచుకున్న మొట్టమొదటి మహిళగా నిలిచింది. లూయిస్ అయల ఫ్రెంచ్ ఓపెన్లో రన్నర్‌గా రెండుసార్లు, రియోస్, ఫెర్నాండో గొంజాలెజ్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. బీజింగ్లో జరిగిన 2008 సమ్మర్ ఒలింపిక్స్లో సింగిల్స్‌లో గోంజాలెజ్ ఒక రజత పతకాన్ని కూడా గెలుచుకుంది.
సమ్మర్ ఒలింపిక్ క్రీడలలో చిలీ మొత్తం రెండు బంగారు పతకాలు (టెన్నిస్), ఏడు వెండి పతకాలు (అథ్లెటిక్స్, గుర్రపు స్వారీ, బాక్సింగ్, షూటింగ్, టెన్నిస్), నాలుగు కాంస్య పతకాలు (టెన్నిస్, బాక్సింగ్, ఫుట్బాల్) గెలుచుకుంది. 2012 లో చిలీ మొట్టమొదటి పారాలింపిక్ గేమ్స్ బంగారు పతకాన్ని (అథ్లెటికక్‌లో బంగారు) గెలుచుకుంది.
చిలీ జాతీయ క్రీడ రోడియో. ఇది దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అభ్యాసంలో ఉంది. స్పానిష్ కాంక్వెస్ట్ సమయంలో చౌకా అని పిలువబడే హాకీకి సంబంధించిన ఒక క్రీడను మాపుచే ప్రజలు ఆడారు. స్కీయింగ్, స్నోబోర్డింగ్ సెంట్రల్ అండీస్‌లో స్కై కేంద్రాలు ఉన్నాయి. దక్షిణ స్కీ కేంద్రాలు ఒసోరో, ప్యూర్టో వీస్, టెముకో పూంటా అరేనాస్ వంటి నగరాలకు సమీపంలో ఉన్నాయి. సర్ఫింగ్ కొన్ని తీర పట్టణాలలో ప్రసిద్ధి చెందింది. పోలో వృత్తిపరంగా చిలీలో సాధన చేయబడింది. 2008, 2015 ప్రపంచ పోలో చాంపియన్షిప్‌లో దేశం అగ్ర బహుమతి సాధించింది.
చిలీలో బాస్కెట్‌బాల్ ఒక ప్రముఖ క్రీడగా ఉంది. ఇందులో చిలీ 1950 లో జరిగిన మొదటి పురుషుల ఎఫ్.ఐ.బి.ఎ.వరల్డ్ ఛాంపియన్షిప్‌లో ఒక కాంస్య పతకం సాధించి, 1959 ఎఫ్.ఐ.బి.ఎ. ప్రపంచ ఛాంపియన్షిప్‌లో చిలీకు రెండవసారి కాంస్య పతకాన్ని సాధించింది. చిలీ 1953 లో మహిళల కొరకు మొదటి ఎఫ్.ఐ.బి.ఎ.ప్రపంచ చాంపియన్షిప్ టోర్నమెంట్ వెండి పతకం సాధించింది. శాన్ పెడ్రో డి అటకామ వార్షిక "అటాకామా క్రాసింగ్", ఆరు-దశల, 250 కిలోమీటర్ల (160 మైళ్ళ) ఫూట్ రేస్‌లకు ఆతిధ్యం ఇస్తుంది. ఇది ప్రతి సంవత్సరం 35 దేశాల నుండి 150 మంది పోటీదారులను ఆకర్షిస్తుంది. 2009 నుంచి చిలీ, అర్జెంటీనాలో డక్కర్ ర్యాలీ రహదారి ఆటోమొబైల్ రేసు నిర్వహించబడింది.
చిలీలో, 5 సంవత్సరాల వయస్సు వరకు ప్రీస్కూల్తో విద్య మొదలవుతుంది. 6, 13 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు ప్రాథమిక పాఠశాల అందించబడుతుంది. అప్పుడు విద్యార్థులు 17 ఏళ్ళ వయసులో గ్రాడ్యుయేషన్ వరకు ఉన్నత పాఠశాలకు హాజరవుతారు.సెకండరీ విద్య రెండు భాగాలుగా విభజించబడింది: మొదటి రెండు సంవత్సరాలలో విద్యార్థులు సాధారణ విద్య పొందుతారు. తరువాత వారు ఒక విభాగాన్ని ఎంచుకుంటారు: శాస్త్రీయ మానవీయ విద్య, కళాత్మక విద్య, లేదా సాంకేతిక, నిపుణులు. సెకండరీ పాఠశాల రెండు సంవత్సరాల తరువాత ఒక సర్టిఫికేట్ (లైసెన్సియస్ డి ఎన్సెనాంజా మాధ్యమం) అందచేయడంతో సెకండరీవిద్య ముగుస్తుంది.[147]చిలీ విద్యను మూడు అంచెల వ్యవస్థలో విభజింపబడుతుంది - పాఠశాలల నాణ్యత సామాజిక ఆర్థిక నేపథ్యాలు ఆధారంగా విద్యావిధానం ఉంటుంది:నగరప్రాంత పాఠశాలలు (కోల్లెగియోస్ పురపాలక సంఘాలు) ఎక్కువగా ఉచితవిద్యను అందిస్తుంటాయి అయినప్పట్కీ వీటిలో నాణ్యతాప్రమాణాలు అధ్వానస్థితిలో ఉంటాయి.వీటిలో ఎక్కువగా పేద విద్యార్థులు హాజరవుతారు;విద్యార్థుల కుటుంబంచే చెల్లించే రుసుముతో భర్తీ చేయగల ప్రభుత్వ నుండి కొంత సొమ్ము స్వీకరించే సబ్సిడీ పాఠశాలలకు మధ్యతరగతి విద్యార్థులు హాజరవుతారు. ఇవి సాధారణంగా మధ్య స్థాయి ఫలితాలను అందిస్తాయి.నిరంతరం ఉత్తమ ఫలితాలను పొందడానికి పూర్తిగా ప్రైవేట్ పాఠశాలలు పనిచేస్తాయి. చాలా ప్రైవేటు పాఠశాలలు మధ్యస్థ గృహ ఆదాయం హాజరు రుసుమును వసూలు చేస్తాయి.[148]
విజయవంతమైన గ్రాడ్యుయేషన్ తరువాత విద్యార్థులు ఉన్నత విద్యలో కొనసాగవచ్చు. చిలీలోని ఉన్నత విద్యాలయ పాఠశాలలు చిలీ సాంప్రదాయ విశ్వవిద్యాలయాలను కలిగి ఉన్నాయి. ఇవి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలుగా విభజించబడ్డాయి. వైద్య పాఠశాలలు, యునివర్సిడాడ్ డి చిలీ, యునివర్సిడాడ్ డియెగో పోర్టల్స్ రెండూ కూడా యాలే యూనివర్శిటీ భాగస్వామ్యంలో న్యాయ పాఠశాల విద్యను అందిస్తున్నాయి[149]
ఆరోగ్యం మంత్రిత్వశాఖ (మినిసల్) అనేది ప్రణాళిక, దర్శకత్వం, సమన్వయం, అమలు, నియంత్రణ, చిలీ అధ్యక్షుడు రూపొందించిన ప్రజా ఆరోగ్య విధానాలకు సమాచారం అందించే కేబినెట్-స్థాయి పరిపాలనా కార్యాలయం బాధ్యత వహిస్తుంది. 1979 లో " నేషనల్ హెల్త్ ఫండ్ (ఫోనాసా) " పేరుతో చిలీలో ఆరోగ్యానికి ప్రభుత్వ నిధులను సేకరించేందుకు, నిర్వహించడానికి, పంపిణీ చేయడానికి సహకరించే ఆర్థిక సంస్థ స్థాపించబడింది. ఇది ప్రజలచే స్థాపించబడింది. ఉద్యోగులు అందరూ తమ నెలసరి ఆదాయంలో 7% ఈ ఫండుకు చెల్లించాలి.
ఎన్.హెచ్.ఎస్.ఎస్.లో భాగం ఉన్న ఫోనోసా, ఆరోగ్య శాఖ (చిలీ) కార్యనిర్వాహక అధికారం కలిగించింది. దీని ప్రధాన కార్యాలయం శాంటియాగోలో ఉంది ఇది వికేంద్రీకృత ప్రజా సేవలను అందించడానికి వివిధ ప్రాంతీయ కార్యాలయాలు నిర్వహిస్తాయి. ఫోనసా నుండి 12 మిలియన్ లకు పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారు. ఇప్రాప్ ద్వారా లబ్ధిదారులకు మరింత ఖరీదైన ప్రైవేటు భీమాను కూడా ఎంపిక చేసుకోవచ్చు. చిలీలోని హాస్పిటల్స్ ప్రధానంగా శాంటియాగో మెట్రోపాలిటన్ రీజియన్లో ఉన్నాయి.
↑"Chile".Encyclopedia Americana. Grolier Online. 2005. Archived fromthe original on 21 జూలై 2002. Retrieved2 March 2005.The name Chile is of Native American origin, meaning possibly "ends of the earth" or simply "sea gulls."
↑11.011.1"CHILE". Encyclopædia Britannica. 11th ed. 1911. ("derived, it is said, from the Quichua chiri, cold, or tchili, snow")
↑"Chile (república)".Enciclopedia Microsoft Encarta Online. 2005. Archived fromthe original on 10 May 2008. Retrieved26 February 2005.The region was then known to its native population as Tchili, a Native American word meaning "snow".
↑Pearson, Neale J. (2004)."Chile".Grolier Multimedia Encyclopedia. Scholastic Library Publishing. Archived fromthe original on 10 ఫిబ్రవరి 1999. Retrieved2 March 2005.Chile's name comes from an Indian word, Tchili, meaning "the deepest point of the Earth."
↑de Olivares y González SJ, Miguel (1864) [1736].Historia de la Compañía de Jesús en Chile. Vol. 4. Santiago: Imprenta del Ferrocarril.{{cite book}}:|work= ignored (help)
↑"Report on CIA Chilean Task Force activities".Chile and the United States: Declassified Documents relating to the Military Coup, 1970–1976. The National Security Archive: Electronic Briefing Books (George Washington University). Retrieved11 March 2010.
↑61.061.1Smith-Ramírez, Cecilia (27 October 2006). "Distribution patterns of flora and fauna in southern Chilean Coastal rain forests: Integrating Natural History and GIS".Biodiversity and Conservation (Volume 16, Number 9 / August 2007). Springer Netherlands.doi:10.1007/s10531-006-9073-2.{{cite journal}}:|issue= has extra text (help)
↑"Country and Lending Groups". High-income economies ($12,616 or more): The World Bank. 1 July 2013. Retrieved14 September 2013.{{cite web}}: CS1 maint: location (link)
↑"Guía del Viajero" [Plan Your Journey] (in Spanish). Metro de Santiago. Archived fromthe original on 28 మార్చి 2016. Retrieved18 September 2013.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
↑"List of Chilean cities". Observatorio Urbano, Ministerio de Vivienda y Urbanismo de Chile. Archived fromthe original on 2016-03-04. Retrieved2017-10-24.
↑Durán, Hipólito (1997). "El crecimiento de la población latinoamericana y en especial de Chile • Academia Chilena de Medicina".Superpoblación. Madrid: Real Academia Nacional de Medicina. p. 217.ISBN84-923901-0-7. Retrieved16 September 2012.