క్యూబా గణతంత్రం, ఒక పెద్ద ద్వీపము 'గ్రేటర్ ఆంటిల్లెస్', కొన్నిచిన్నచిన్న ద్వీపాలు గలవు. క్యూబా ఉత్తర 'కరీబియన్' ప్రాంతంలో గలదు. ఈ ప్రాంతం కరీబియన్ సముద్రంమెక్సికో అఖాతము,అట్లాంటిక్ మహాసముద్రము ల కలయికల ప్రాంతం. క్యూబాఅమెరికా,బహామాస్కు ఆగ్నేయ దిశలోనూ, 'టర్క్స్, కైకోస్ ద్వీపాలు,హైతీ లకు పశ్చిమాన,మెక్సికోకు తూర్పున, కేమెన్ ద్వీపాలు,జమైకా లకు దక్షిణాన ఉంది.దేశరాజధాని నగరం వవానా అతిపెద్ద నగరంగా కూడా ప్రత్యేకత కలిగి ఉంది. ఇతర ప్రదాన నగరాలలో శాంటిగో డీ క్యూబా, కాంగువా నగరాలు ప్రధానమైనవి. కరీబియన్ ద్వీపాలలో క్యూబా అతిపెద్ద ద్వీపం ( వైశాల్యం 1,09,884 చ.కి.మీ. ) అలాగే జనసాంధ్రతలో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో " హిస్పానియోలా ఉంది. జనసంఖ్య 11 మిలియన్లు.[1] స్పానిష్ కాలనైజేషన్‌కు ముందు 15 వ శతాబ్ధం చివరలో క్యూబాలో అమెరిండియన్లు నివసించారు. 1898 స్పానిష్ - అమెరికన్ యుద్ధం జరిగే వరకు క్యూబా స్పానిష్ పాలనలో ఉంది. తరువాత క్యూబాకు నామమాత్ర స్వతంత్రం లభించింది. 1902 వరకు యునైటెడ్ స్టేట్స్ ప్రొటెక్టరేట్‌గా ఉంది. తాత్కాలిక రిపబ్లిక్‌గా క్యూబా 1940లో రాజ్యాంగం విధానం రూపొందించుకోవడానికి ప్రయత్నించింది.ఫుల్జెంసియొ బాటిస్టా (1952) నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ తిరుగుబాటు , ప్రజాందోళనలు ఉచ్ఛస్థాయికి చేరుకున్నాయి.[2] అశాంతి , అస్థిరత " క్యూబన్ తిరుగుబాటు 1959 " కి దారి తీసాయి. బాటిస్టా పదవి నుండి తొలగించబడిన తరువాత " ఫిడెల్ కాస్ట్రో " నాయకత్వంలో కొత్త ప్రభుత్వం స్థాపించబడింది. 1965 నుండి క్యూబాను " కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా " పాలించింది. సోవియట్ యూనియన్ , యునైటెడ్ స్టేట్స్ మద్య కోల్డ్ వార్ అకారణంగా క్యూబల్ మిస్సైల్ క్రైసిస్ (1962) లో న్యూక్లియర్ యుద్ధానికి వాతావరణం సిద్ధం అయింది. మార్కిస్టు - లెనినిస్ట్ , సోషలిస్ట్ స్టేట్ గా మిగిలిన అతికొన్ని దేశాలలో క్యూబా ఒకటి. స్వతంత్ర పర్యవేక్షకులు మానవహక్కుల ఉల్లంఘన , విచారణరహిత ఖైదు వంటి విషయాలను విమర్శిస్తూ ఉంటారు.[3] క్యూబా, కరీబియన్ ప్రాంతంలో అధికజనసాంద్రత గల దేశం. (క్యూబావో[4]) లేదా "గొప్ప ప్రదేశం" (కోబానా[5]). క్యూబా ప్రధాన ద్వీపం ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపాలలో 17వ స్థానాన్ని ఆక్రమిస్తోంది.సంస్కృతి పరంఫా క్యూబాలాటిన్ అమెరికాలో భాగంగా భావించబడుతుంది.[6] ఇది బహుళసంప్రదాయ కలిగిన దేశం.ఇక్కడ ప్రజలు, సంస్కృతి, అలవాట్లకు ఆదిమజాతికి చెందిన టైనొ ప్రజలు, సిబొనీ ప్రజలు మూలంగా ఉన్నారు. దీర్ఘకాల బానిసత్వం, ఆఫ్రికన్ బానిసల ప్రవేశం, కోల్డ్ వార్ కారణంగా సోవియట్ యూనియన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు క్యూబా సంస్కృతి మీద గణనీయమైన ప్రభావం చూపాయి. క్యూబా ఆర్థికరంగాన్నిచక్కెర,పొగాకు,కాఫీ, నైపుణ్యం కలిగిన శ్రామికుల ఆధిక్యం అధికంగా ఉంది. మానవాభివృద్ధి సూచిక ఆధారంగా ఇది ఉన్నత మానవాభివృద్ధి కలిగిన దేశంగా గుర్తించబడుతుంది. మానవాభివృద్ధిలో క్యూబా ఉత్తర అమెరికాలో 8వ స్థానంలోనూ ప్రపంచంలో 67వ స్థానంలోనూ ఉంది.[7] ఆరోగ్యసంరక్షణ, విద్యాభివృద్ధిలో కూడా క్యూబా ఉన్నత స్థితిలో ఉంది.[8][9] ప్రపంచంలో " వరల్డ్ ఫండ్ ఫర్ నేచుర్ " అందుకుంటున్న ఏకైకదేశంగా క్యూబా ప్రత్యేకత కలిగి ఉంది.[10] క్యూబా వెనుజులా నుండి సహాయం అందుకుంటున్నది (2008 - 2010 మద్య 20% జి.డి.పి) ఇదే మాదిరి సహాయం సోవియట్ యూనియన్ నుండి అందుకుంది (1985-1988).[11][12]
స్పానిష్ వారు ఇక్కడకు చేరడానికి ముందు క్యూబాలో టైనొ (అరవాక్ ప్రజలు), గునాజటబే, సిబోనీ అనే మూడు స్థానిక అమెరికన్ ప్రజలు నివసించారు.సిబోనీ ప్రజల పూర్వీకులు 5000 సంవత్సరాలకు ముందు దక్షిణ అమెరికా నుండి క్యూబా చేరుకున్నారు.[14] టైనొ ప్రజలు హిస్పనోలా నుండి సా.శ. 3 వ శతాబ్దంలో ఈప్రాంతానికి చేరుకున్నారు.కొలబస్ ఇక్కడకు చేరుకున్న సమయంలో 1,50,000 జనసంఖ్యతో టనొ ప్రజలు ఈఈప్రాంతంలో ఆధిక్యత కలిగి ఉన్నారు.[14]
టైనోభాష క్యూబా పదానికి మూలంగా ఉంది. క్యూబాకు అనేపదానికి కొయాబనా (గొప్ప ప్రదేశం అని అర్ధం) మూలంగా ఉంది.మరొక కథనం క్యుబాయో (విస్తారమైన పంటభూములు ఉన్న ప్రాంతం అని అర్ధం) మూలంగా ఉందని తెలియజేస్తుంది.[15][16]టనొ ప్రజలు వ్యవసాయదారులు. సిబోనీ ప్రజలకు వ్యవసాయంతో చేపలుపట్టడం, వేట సేకరణ జీవనోపాధిగా ఉండేది.
1492 లో యూరోపియన్లు మొదటిసారిగా ఇక్కడ ద్వీపంలో ప్రవేశించగానే వీటికి గౌనహని, బహామాస్ అని నామకరణం చేసారు.[17]1492 అక్టోబరు 28న క్రిస్టోఫర్ కొలంబస్ నాయకత్వంలో పింటా (లా పింటా), నినా (లా నినా), శాంటా మరియా అనే మూడు నౌకలు క్యూబా ఈశాన్య సముద్రతీరానికి చేరాయి.[18] అదే ప్రస్తుత హొల్గుయిన్ ప్రొవిన్స్‌లోని "బరియా". కొలంబస్ తరువాత ఈద్విపాన్ని న్యూస్పెయిన్‌కు స్వాధీనం చేసి[19] ద్వీపానికి " ఇస్లా జుయానా " అని నామకరణం చేసాడు. తరువాత అది జుయాన్, ప్రింస్ ఆఫ్ ఆస్ట్రియాగా మార్చబడింది.[20]
1511లో " డియాగో వెలజ్క్వెజ్ డీ క్యుల్లర్ " బరాకొయా వద్ద మొదటి స్పానిష్ సెటిల్మెంట్ స్థాపించాడు.1515లో శాన్ క్రిస్టోబల్ డీ లా హబానా స్త్యాపించబడింది. తరువాత అది రాజధానిగా చేయబడింది. తరువాత " ఎంకోమియండా " విధానం ద్వారా స్థానికజాతి ప్రజలతో బలవంతంగా పనిచేయించబడింది.[21] అది మధ్యయుగపు ఐరోపాలో "ఫ్యూడల్ వ్యవస్థను" పోలి ఉంటుంది.[22] ఒక శతాబ్ధకాలంలో స్థానికజాతి ప్రజలు పలు కారణాలతో తుడిచిపెట్టుకు పోయారు. ఇందులో స్పానిష్ ఆక్రమణదారులతో ప్రవేశించిన అంటువ్యాధులు ప్రధాన కారణంగా ఉంది. సాధారణంగా స్థానిక ప్రజలలో యూరోపియన్లకంటే వ్యాధినిరోధకశక్తి అతి తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.[23]1529లో స్మాల్ ఫాక్స్ బారినపడకుండా తప్పించుకున్న స్థానిక ప్రజలలో మూడింట రెండువంతుల మంది మరణానికి మీస్లెస్ వ్యాధి కారణమైంది.[24][25]1539 మే 18న విజేత " హెమాండో డీ సోటో " బంగారం, నిధి, కీర్తి, అధికార కాంక్షతో హవానా నుండి బయలుదేరి ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన " లా ఫ్లోరిడా చేరుకున్నాడు.[26]1548 సెప్టెంబరు 1 న " డాక్టర్ గంజలో పెరెజ్ డీ ఆంగ్లో " క్యూబా గవర్నరుగా నియమినబడ్డాడు.ఆయన1549 నవంబరు 4న క్యూబా చేరుకున్న వెంటనే స్థానిక ప్రజలకు స్వతంత్రం ప్రకటించాడు.[27] ఆయన శాంటియానాలోని హవనాలో నివాసం ఏర్పరుచుకున్న మొదటి గవర్నరు అయ్యాడు. ఆయన హవానాలోని మొదటి చర్చిని నిర్మించాడు.[28]1555 లో ఫ్రెంచి హవానాను స్వాధీనం చేసుకున్న తరువాత గవర్నరు కుమారూడు " డీ ఫ్రాంసిస్కో ఆంగ్లో " మెక్సికోకు వెళ్ళాడు.[29]
క్రమంగా క్యూబా అభివృద్ధి చెందసాగింది. స్పానిష్ వలస ప్రభుత్వపాలనలో క్యూబా నగరప్రాంతంగా అభివృద్ధి చెందింది. 18 వ శతాబ్ధం నాటికి క్యూబా బానిసల సంఖ్య 50,000కు చేరుకుంది. బార్బడోస్ బానిసల సంఖ్య 60,000, వర్జీనియా కాలానీ బానిసలు 30,000, బ్రిటిష్ , ఫ్రెంచి డోమింగ్యూలలో(బృహత్తర చెరకు తోటలలో పనిచేయడానికి) 4,50,000 మంది బానిసలు ఉండేవారు.[30]
Map of Cuba by Cornelius van Wytfliet in 1597 (National Library of Sweden)
1754 లో మూడు ఖండాలమద్య మొదలైన "ఏడు సంవత్సరాల యుద్ధం" స్పానిష్ కరీబియన్ వరకు విస్తరించింది. స్పెయిన్, ఫ్రెంచి సంకీర్ణదళాలు నేరుగా బ్రిటిష్ సైన్యాలను ఎదుర్కొన్నాయి.1762లోహవానా యుద్ధంలో బ్రిటిష్ ఐదు యుద్ధనౌకలతో 4,000 సైనికులతో క్యూబాను స్వాధీనం చేసుకోవడానికి పోర్ట్స్‌మౌత్ నౌకాశ్రయం చేరుకున్నాయి. బ్రిటిష్ ఇక్కడకు జూన్ 6 న చేరుకుని ఆగస్టు నాటికి హవానాను స్వాధీనం చేసుకున్నారు.[31] హవానా స్వాధీనం అయిన తరువాత బ్రిటిష్ దళాల అడ్మిరల్ " జార్జి కెప్పెల్ " (అల్బమార్లె మూడవ ప్రభువు) గవర్నరుగా పదవిని చేపట్టి ద్వీపం పశ్చిమప్రంతం అంతటినీ నియంత్రించాడు. తరువాత బ్రిటిష్ ఉత్తర అమెరికా, కరీయన్ దేశాలలోని తమ కాలనీల మద్య వ్యాపారం అభివృద్ధి చేసింది. ఇది క్యూబన్ సొసైటీలో వేగవంతమైన మార్పులకు కారణం అయింది. వారు నగరంలోకి ఆహారం, గుర్రాలు, వస్తువులను దిగుమతి చేసుకున్నారు. అలాగే చెరకు తోటలలో పని చేయడానికిఆఫ్రికా నుండి వేలాదిమంది బానిసలు కూడా దేశంలోకి తీసుకునిరాబడ్డారు.[31]
తరువాత హవానా అమెరికాలలో మూడవ బృహత్తర నగరంగా అభివృద్ధి చెందుతూ ఉత్తర అమెరికాతో సంబంధాలను అభివృద్ధి చేసుకున్నది. నగరంలో బ్రిటిష్ పాలన స్వల్పకాలంలోనే ముగింపుకు వచ్చింది. బ్రిటిష్ హవానాను ఆక్రమించుకున్న ఒకసంవత్సరకాలానికి ముందుగానే చెరుకుధరలు తగ్గిన కారణంగా వ్యాపారులలో మొదలైన వత్తిడి స్పానిష్ ప్రభుత్వంతో కాలనీ భూభాగాల గురించి చర్చలు జరపడానికి దారితీసింది.1763లో బ్రిటిష్ స్పెయిన్, పారిస్ దేశాలతో " శాంతి ఒప్పదం " కుదుర్చుకోవడంతో ఏడు సంవత్సరాల యుద్ధం ముగింపుకు వచ్చింది.ఒప్పదం కారణంగా బ్రిటన్ క్యూబాకు బదులుగా ఫ్లోరిడా మీద అధికారం సాధించింది.[31] బ్రిటన్ అధికారులకు ఈమార్పిడి అసంతృప్తిని కలిగించింది. క్యూబాకు బదులుగా ఫ్లోరిడాను స్వీకరించడం ప్రయోజనకరం కాదని వారు భావించారు.
18వ శతాబ్దం చివరిలో, 19వ శతాబ్దం ఆరంభంలో హైతీ తిరుగుబాటు తరువాత క్యూబా అభివృద్ధి వేగవంతం అయింది. కరీబియన్ సంపన్నకాలనీలోని బానిసత్వానికి లోబడిన హైతీ ప్రజలు హింసాత్మక తిరుగుబాటుద్వారా తమకుతాముగా స్వతంత్రులైనారు. ఈప్రాంతంలో సంభవించిన మార్పులు తోటపెంపకం దార్లలో భీతిని కలిగిస్తూ అదేసమయంలో నూతన అవకాశాలకు దారితీసింది. ఫ్రెంచి కాలనీలలో ఉన్నట్లు క్యూబాలో బానిసవ్యాపారంలో పలు నిబంధనలు అధికరించినందున బానిసలు తిరుగుబాటుచేస్తారని ఊహించారు. అయినప్పటికీ తోట పెంపకందారులు గతంలో చెరుకుతోటల పెంపకంలో పేరుపొందిన హైతీలు తిరుగుబాటుచేయడంతో సరికొత్తగా తోటలపెంపకం అభివృద్ధి చేయడానికి ఇది అవకాశంగా భావించారు.[32]1790 -1820 మద్య కాలంలో 3,25,000 ఆఫ్రికన్లను క్యూబా బానిసలుగా దిగుమతి చేసుకుంది. 1760-1790 మద్య కాలంలో జరిగిన దిగుమతి కంటే ఇది నాలుగు రెట్లు అధికంగా ఉంది.[33]
క్యూబా ప్రజలలో కొంతశాతం ప్రజలు బానిసలుగా మార్చబడిన తరువాత1812లో సంభవించిన బానిసల తిరుగుబాటు అణిచివేయబడింది.[34]1817లో క్యూబా జనసంఖ్య 6,30,980 వీరిలో 2,91,021 మంది శ్వేతజాతీయులు, మిశ్రితజాతులకు చెందిన స్వతంత్రులు 1,15,691, 2,24,268 మంది నల్లజాతికి చెందిన బానిసలు ఉన్నారు.[35]
వర్జీనియా, ఇతర కరీబియన్ దీవులలో ఉన్న బానిసల శాతం కంటే ఇది అధికం.[30][36] 19వ శతాబ్దం నాటికి బానిసలు నగరీకరణ చేయబడిన క్యూబాలో శ్రామికులుగా మారారు.[37] శ్వేతజాతి కార్మికుల కొరత కారణంగా నగరీకరణచేయబడిన పరిశ్రమలలో నల్లజాతి కార్మికులు ఆధిక్యత కొనసాగింది. అందువలన 19వ శతాబ్దంలో పెద్ద సంఖ్యలో క్యూబాలో ప్రవేశించిన శ్వేతజాతీయులు నల్లజాతి కార్మికుల స్థానంలో పరిశ్రమలలో ఉపాధి సాంధించడంలో విఫలమయ్యారు.[30] చిన్నవ్యవసాయదారులు, స్వల్పసంఖ్యలో బానిసలు ఏర్పాటుచేసుకున్న వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర వస్తువులు నగరప్రాంతాలకు సరఫరా చేయబడ్డాయి.[30]1820లో లాటిన్ అమెరికాలోని ఇతర స్పెయిన్ కాలనీలు తిరుగుబాటు ద్వారా స్వతంత్రదేశాలు స్థాపించిన సమయంలో క్యూబా సామ్రాజ్యానికి విశ్వాసపాత్రంగా నిలిచింది.క్యూబా ఆర్థికరంగం సామ్రాజ్యానికి సేవలందించడం మీద ఆధారపడింది.1860 నాటికి క్యూబాలో మొత్తం జనసంఖ్య 5,50,000 వీరిలో మిశ్రిత వర్ణాలకు చెందిన ప్రజలసంఖ్య 2,13,167 (39%).[30] వర్జీనియాలో అదేసంఖ్యలో ఉన్న నల్లజాతి ప్రజలలో 58,042 (11%) మంది స్వతంత్రులుగా ఉండగా మిగిలిన వారు బానిసలుగా ఉన్నారు.[30] అంతర్యుద్ధకాలంలో " నేట్ ట్యూమర్స్ స్లేవ్ రిబెల్లియన్ " (1831) తిరుగుబాటు తరువాత స్వతంత్ర నల్లజాతి ప్రజలకు వ్యతిరేకంగా నిబంధనలు కఠినతరం చేయబడ్డాయి. అదనంగా బానిసల అవసరం కూడా అధికం అయింది. వర్జీనియా దేశీయమార్కెట్లలో విక్రయించబడిన బానిసలు నౌకలలో ఇతరప్రాంతాలకు, దక్షిణాంతరప్రాంతాలకు (ఇక్కడ విస్తరించబడిన ప్రత్తి ఉత్పత్తికి బానిసలు సహకరించారు) తరలించబడ్డారు.
Carlos Manuel de Céspedes is known asFather of the Homeland in Cuba, having declared the nation's independence from Spain in 1868.
1868లో ప్లాంటర్ " కార్లోస్ మాన్యుయల్ డీ సెస్పెడెస్ "నాయకత్వంలో స్పెయిన్ నుండి సంపూర్ణ స్వతాతంత్యం లక్ష్యంగాచేసుకుని తిరుగుబాటు ఆరంభం అయింది. చెరకు తోటల పెంపకం దారుడు డీ సెస్పెడెస్ ముందుగా తనతోటలలో పనిచేస్తున్న బానిసలకు స్వతంత్రం కలిగించి వారిని తన క్యూబా స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యులను చేసుకున్నాడు. 1868 అక్టోబరులో బానిసత్వాన్ని నిరసిస్తూ డిక్రీ విడుదల చేస్తూ బానిసలను సైన్యంలో చేర్చడాన్ని ప్రోత్సహించాడు.[38] 1868 తిరుగుబాటు పొడిగించబడి 10 సంవత్సరాల యుద్ధంగా రూపుమార్చుకుంది. తిరుగుబాటులో 2 లక్షల క్యూబన్ చైనీయులు చేరారు. చైనీయులు ఒప్పంద కార్మికులుగా దిగుమతి చేసుకొనబడ్డారు.యుద్ధంలో మరణించిన క్యూబన్ చైనీయులను హవానా గౌరవించింది.[39] పలు యురేపియన్ , లాటిన్ అమెరికన్ దేశాలు కొత్తగా రూపొందిన క్యూబా ప్రభుత్వన్ని అనిగీకరించాయి.[40] 1878లో యుద్ధం ముగింపుకు వచ్చింది. స్పెయిన్ క్యూబాకు స్వయంప్రతిపత్తి కల్పించింది.1879-1880 లలో క్యూబా దేశభక్తుడు " కలిక్స్టో గార్షియా " మరొక యుద్ధం ప్రారంభించడానికి ప్రయత్నించాడు. లిటిల్ వార్‌గా అభివర్ణించబడిన ఈ పోరాటానికి తగినంత మద్దతు లభించలేదు.[41]1875లో క్యూబాలో బానిసత్వం రద్దుచేయబడింది. అయినా1886లో ఇది పూర్తి ఫలితన్ని ఇచ్చింది.[42][43]1892లో దేశం నుండి బహిష్కరించబడిన " జోస్ మార్టి " న్యూయార్కులో " క్యూబన్ రివల్యూషనరీ పార్టీ స్థాపించాడు.క్యూబా సంపూర్ణ స్వతంత్రం పార్టీకి ప్రధాన లక్ష్యంగా మారింది.[44] 1895లో మాక్సిమొ గోమెజ్ ప్రయత్నంలో భాగస్వామ్యం వహించడానికి మార్టి శాన్ ఫెర్నాండో డీ మాంటే క్రిస్టిల్, శాంటో డోమింగో లకు ప్రయాణించాడు.[44] మార్టిన్ తన " మనిఫెస్టో ఆఫ్ మాంటెక్రిస్టి " (ప్రణాళిక) లో తన రాజకీయ విధానాలను వెలువరించాడు.[45] 1895 ఫిబ్రవరిలో 24న క్యూబాలో స్పానిష్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభం అయింది. అయినప్పటికీ1895ఏప్రిల్ 11 వరకు మార్టిన్ క్యూబా చేరలేదు.[44]1895మే 19 న డోస్ రియోస్ యుద్ధంలో మార్టి మరణించాడు.[44] ఆయన మరణం క్యూబా స్వతంత్రపోరాట చరిత్రలో అమరం అయింది.[45]
Calixto García, a general of Cuban separatist rebels, (right) with U.S. Brigadier GeneralWilliam Ludlow (Cuba, 1898)
2,00,000 మంది స్పానిష్ సైన్యాలకు వ్యతిరేకంగా స్వల్పంగా ఉన్న తిరుగుబాటు సైన్యం గొరిల్లా యుద్ధం ద్వారా ఎదుర్కొన్నది. స్పానియర్లు అణిచివేత ప్రయత్నాలు మొదలుపెట్టారు.జనరల్ " వలెరియానొ వేలర్ " క్యూబా మిలటరీ గ్వర్నరుగా నియమించబడ్డాడు. ఆయన గ్రామీణ ప్రజలను " రీకాంసెంట్రేడర్లకు " తరలించాడు. వీటిని పర్యవేక్షకులు పోర్టిఫియడ్ టౌంస్ అని పేర్కొన్నారు. ఇవి 20వ శతాబ్ధపు " కాంసెంట్రేషన్ కేపులు " లను పోలి ఉనాయి.[46] కేపులలో 2-4 లక్షలమంది క్యూబన్ పౌరులు పస్తులు, వ్యాధుల కారణంగా మరణించారు.రెడ్ క్రాస్, యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ రెడ్ ఫీల్డ్ ప్రాక్టర్ అందిచిన గణాంకాలలో మృతుల సంఖ్యలో వైవిధ్యం ఉంది.స్పానిష్ చర్యలకు ఐరోపా, అమెరికన్ దేశాలు నిరసనలు తెలిపాయి.[47] యు.ఎస్. క్యూబాకు పంపిన " మైనె " యుద్ధనౌక హవానాలో బాంబుదాడికి గురై మునిగిపోయింది. సిబ్బందిలో నాల్గింట మూడు వంతులు మరణించారి. బోర్డు విచారణలో నౌక మునిగిపోవడానికి కారణాలు స్పష్టంకాలేదు.[48] 1898 ఏప్రిల్‌లో అమెరికా స్పెయిన్ దేశాలు ఒకదాని మీద ఒకటి యుద్ధం ప్రకటించాయి.గత దశాబ్ధాలలో స్పెయిన్ నుండి క్యూబా ద్వీపన్ని కొనుగోలు చేయడానికి యు.ఎస్‌కు చెందిన ఐదు మంది అధ్యక్షులు ప్రయత్నించారు; జేంస్ కే పోల్క్, ఫ్రాంక్లిన్ పియర్స్,జేంస్ బుచనన్, గ్రాంట్, మెకిన్‌లే.[49][50]
Raising the Cuban flag on the Governor General's Palace at noon on May 20, 1902
స్పానిష్ - అమెరికన్ యుద్ధం తరువాత స్పెయిన్ - యునైటెడ్ స్టేట్స్ కలిసి " ట్రీటీ ఆఫ్ పారిస్ " మీద సంతకం చేసారు. ఒప్పందం ద్వారా ప్యూరిటో రికో, ఫిలిప్పైన్, గుయాం యునైటెడ్ స్టేట్స్‌కు 20 మిలియన్ల డాలర్లకు వదులుకుంది.[51]1902 మే 20న క్యూబా యు.ఎస్. నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం పొంది " ది రిపబ్లిక్ ఆఫ్ అమెరికా "గా అవతరించింది.[52] క్యూబా సరికొత్త రాజ్యాంగంలో అమెరికాకు క్యూబన్ అఫైర్స్, ఫైనాంస్ , విదేశీ సంబంధాలలో జోక్యంచేసుకునే అధికారం కల్పించబడింది.ప్లాట్ ఆమెండమెంటు ఆధారంగా యు.ఎస్. క్యూబా నుండి " గుయాంటనమొ నావల్ బేసును " లీజుకు తీసుకుంది.1906లో నిర్వహించబడిన ఎన్నికలలో అధ్యక్షుడైన " టోమస్ ఎస్ట్రాడా పాల్మా " సాయుధతిరుగుబాటును ఎదుర్కొన్నాడు.[53] క్యూబా ఆక్రమణను యు.ఎస్. అడ్డగించి " చార్లెస్ ఎడ్వర్డ్ మాగూన్ " గవర్నర్‌గా నియమించబడ్డాడు.[54]1908లో " జోస్ మైగ్యుయల్ గోమెజ్ " అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడిన తరువాత క్యూబన్ ప్రభుత్వం పునఃఒరారంభించబడింది. యు.ఎస్. క్యూబన్ అఫైర్స్‌లో జోక్యం చేసుకునే అధికారం కొనసాగించబడింది.1912 లో " పార్టిడో ఇండిపెండెంస్ డీ కలర్ " ఓరియంటో ప్రొవింస్ "ను ప్రత్యేక బ్లాక్‌గా స్థాపించడానికి ప్రయత్నించాడు.[55] అయినప్పటికీ జనరల్ " మాంటియాగుడో " హింసాత్మకంగా దీనిని అణిచివేసాడు.1924లో " జెరాడో మచాడో " అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు.[56] ఆయన పాలనసమయంలో పర్యాటకరంగం అభివృద్ధిచేయబడింది.వరదలా వచ్చిచేరుతున్న పర్యాటకులు బస చేయడానికి అవసరమైన అమెరికన్ - యాజమాన్య హోటళ్ళు, రెస్టారెంట్లు నిర్మించబడ్డాయి.[56] విప్లవాత్మకమైన పర్యాటకాభివృద్ధి క్యూబాలో జూదం, ప్రాసిచ్యూషన్ అధికరించడానికి దారితీసింది.[56]1929లో ది వాల్ స్ట్రీట్ క్రష్ కారణంగా చక్కెర ధరలు పతనం, రాజకీయ అస్థిరత, అశాంతికి దారితీసింది.[57] 1930లో విద్యార్థుల నిరసనప్రదర్శన ప్రతిపక్షాల జోక్యంతో హింసాత్మకంగా మారింది.[57] మకాడో మద్దతుతో జనరల్ స్ట్రైక్ ప్రకటించబడింది.[58] చక్కెర కార్మికులు, సైనిక తిరుగుబాటు1933లో మకాడో దేశబహిష్కరణకు దారితీసింది.ఆయన స్థానాన్ని " కార్లోస్ మాన్యుయల్ డీ సెస్పెడెస్ వై క్యుసాడా " భర్తీచేసాడు.[57]
1933 సెప్టెంబరులో సార్జెంట్ " ఫుల్జెంసియో బటిస్టా " నాయకత్వంలో మొదలైన " సార్జెంట్ తిరుగుబాటు " సెస్పెడెస్‌ను పదవి నుండి తొలగించింది.[59] ఐదుగురు సభ్యులు కలిగిన " ది పెంటార్చీ ఆఫ్ 1933 " ఎక్జిక్యూటివ్ కమిటీ ప్రొవిషనల్ గవర్నమెంటు నాయకుడిని ఎన్నిక చేసింది.[60] ప్రొవిషనల్ అధ్యక్షుడుగా " రామన్ గ్రౌ సన్ మార్టిన్ " నియమించబడ్డాడు.[60]1934లో మాటిస్టా మార్గాన్ని సుగమంచేస్తూ గ్రౌ పదవికి రాజీనామా చేసాడు.ఆయన 25 సంవత్సరాలకాలం క్యూబారాజకీయాలను ప్రభావితం చేసాడు.ఈ కాలంలో క్యూబాలో వరుసగా బొమ్మ అధ్యక్షులు నియమించబడ్డారు.[59][61]
1940లో " సరికొత్త క్యూబా రాజ్యాంగం " రూపొందించబడింది. ఇందులో " రైట్ టొ లేబర్, హెల్త్ కేర్ " చేర్చబడ్డాయి.[62] అదే సంవత్సరం బాటిస్టా అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడి 1944 వరకు పదవిలో కొనసాగాడు.[63] శ్వేతజేతేతరుడుగా అత్యంత ఉన్నత పదవిని అధిష్టించిన క్యూబాపౌరుడుగా బాటిస్టా ప్రత్యేకత సంతరించుకున్నాడు.[64][65][66] ఆయన ప్రభుత్వంలో పలువురు కమ్యూనిస్టు సభ్యులు ప్రధానపదవులు స్వీకరించారు.ఆయన ప్రభుత్వం పలు సాంఘిక సంస్కరణలను అమలుపరచింది.[67] అధ్యక్షుడు బాటిస్టా " ఫ్రాంకోయిస్ట్ స్పెయిన్ " మీద దాడి చేసి పాలనను పతనం చేయమని " యు.ఎస్. లాటిన్ అమెరికాకు " సలహా ఇచ్చినప్పటికీ క్యూబన్ సైన్యం రెండవప్రపంచయుద్ధంలో భాగస్వామ్యం వహించలేదు.[68] 1940 లో చేసిన రాజ్యాంగ సవరణ బాటిస్టా తిరిగి ఎన్నిక చేయబడడానికి ఆటకంగా మారింది.[69]1944లో " రామన్ గ్రౌ శాన్ మార్టిన్ " అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు..[63] అప్పటికే ఊగిసలాడుతున్న క్యూబా రాజకీయాలను గ్రౌ అదనంగా కృశిపచేసాడు. ప్రత్యేకంగా దుర్బలమైన కాంగ్రెస్, సుప్రీం కోర్టులు మరింత బలహీనం చేయబడ్డాయి.[70]1948 ఎన్నికలలో " కార్లోస్ ప్రియో సొకర్రాస్ " అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు.[63] రెండుమార్లు అధికారపదవి వహించిన అటెంటియో పార్టీ పాలనాకాలంలో కొనసాగిన పెట్టుబడుల వరద శరవేగమైన ఆధికాభివృద్ధికి చేయూత ఇచ్చింది.సమాజంలోని అన్ని వర్గాలప్రజల జీవనస్థాయి అభివృద్ధి చెందింది.నగరప్రాంతాలలో మధ్యతరగతి ప్రజలజీవితం సుసంపన్నం అయింది.[71]
Slum (bohio) dwellings in Havana, Cuba in 1954, just outsideHavana baseball stadium. In the background is advertising for a nearbycasino.
1952లో బటిస్టా అధ్యక్షస్థానికి పోటీ చేసి ఓటమిని చవిచూసాడు.[72]1952లో కమ్యూనిస్టు పార్టీ చట్టవిరుద్ధం చేసాడు.[73] తిరుగుబాటు తరువాత క్యూబా తలసరి మాసం, కూరగాయలు, సీరియల్స్, ఆటోమొబైల్స్, టెలిఫోన్లు, రేడియోల ఉపయోగం అధికం అయింది. బీదవారిగా పరిగణించబడిన జనసంఖ్యలో మూడవవంతు ప్రజలు కూడా వీటిని కొంత ఉపయోగించగలిగినంతగా అభివృద్ధి చెందారు.[74]1958లో లాటిన్ అమెరికన్ దేశాలస్థాయిలో అధికంగా అభివృద్ధిచెందిన దేశాలలో క్యూబా ఒకటిగా పరిగణించబడుతుంది.[75] మరొకవైపు లాటిన్ అమెరికా దేశాలలో నెలకొన్న అత్యధికమైన లేబర్ యూనియన్ విశేషాధికారాలు క్యూబాను బాధించాయి.ఇందులో విధిలనుండి తొలగింపు, నిషేధాలు, మెకానైజేషన్ భాగస్వామ్యంవహించాయి.పెద్ద స్థాయిలో నిరుద్యోగం, వ్యవసాయదారుల సమస్యలు అసమానతలకు దారితీసాయి.[76]1933,1958 మద్య క్యూబా విస్తరించిన ఆర్థికసవరణలు ఆర్థికసమస్యలు అధికరించడానికి దారితీసాయి.[64][77] నిరుద్యోగం కారణంగా పట్టబధ్రులు ఉపాధి వెతుక్కుటూ కార్మికరంగంలో ప్రవేశించడం ప్రారంభించారు.[64] మద్యతరగతి ప్రజలు నిరుద్యోగం, రాజకీయ హింసాత్మక చర్యలు వంటి సమస్యలను యునైటెడ్ స్టేట్స్‌తో పోల్చిచూడడం ప్రారంభించారు.చాలాకాలం వరకు లేబర్ యూనియన్లు బాటిస్టాకు మద్దతుగా నిలిచారు.[64][65]1958 డిసెంబరు వరకు బాటిస్టా అధికారం కొనసాగింది.[72]
1950లో రాజకీయంగా మార్పు తీసుకురావడానికి వివిధ సంస్థలు పోటీ చేసాయి.సాయుధ తిరుగుబాటు ఇందులో భాగంగా మారింది.[78]1956లో " ఫిడెల్ కాస్ట్రో " 80 మందితో బాటిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి " యాచెట్ గ్రాన్మా " చేరుకున్నాడు.[78]1958 జూలైలో కాస్ట్రో బృందం ప్రధాన తిరుగుబాటు బృందంగా మారింది.[78]1958లో సియేరా మాస్ట్రాలో ప్రజాందోళన తీవ్రరూపందాల్చింది. కాస్ట్రో పోరాటవీరులు " శాంటా క్లారా "ను స్వాధీనం చేసుకున్న తరువాత1959 జనవరి 1న బాటిస్టా కుటుంబంతోడోమనికన్ రిపబ్లిక్కు పారిపోయాడు.తరువాత ఆయనపోర్చుగీసు లోని మాడియేరా ద్వీపానికి పోయి అఙాతజీవితం గడిపి చివరిగా అస్టోరిల్ చేరుకుని అక్కడ స్థిరపడ్డాడు. 1959 జనవరి 8న కాస్ట్రో దళాలు రాజధాని నగరంలో ప్రవేశించాయి. తరువాత ది లిబరల్ బరల " మాన్యుయేల్ ఉర్రుషియా " అధ్యక్షుడయ్యాడు.[79] 1959 నుండి 1966 మద్య క్యూబన్ పోరాటవీరులు " ఎస్కాంద్రే పర్వతప్రాంతం "లో 6 సంవత్సరాల తిరుగుబాటు కొనసాగింది.ప్రభుత్వాధికారులు చివరికి తిరుగుబాటును అణిచివేసారు.ఈ తిరుగుబాటులో అత్యధిక సంఖ్యలో సైనికులు భాగస్వామ్యం వహించారు.[80][81] యు.ఎస్. స్టేట్ గవర్నమెంటు అంచనాలు 1952 నుండి 1962 మద్య కాలంలో 3,200 మంది మరణించారని పేర్కొన్నాయి.[82] " ఆనెంస్టీ we ంటర్నేషనల " ఆధారంగా 1959-1987 మద్య 237 మంది మరణశిక్షకు గురైయ్యారని భావించారు.[83] ఇతర అంచనాలు 4,000 నుండి 33,000 మందికి మరణశిక్ష విధించబడిందని భావించారు.[84][85][86] 1959 లో మరణశిక్షకు గురైనవారిలో అధికంగా బాటిస్టా పాలనలో పనిసేసిన పోలీసులు, రాజకీయనాయకులు , వ్యవసాయదారులు నేరాలు విధించబడి మరణశిక్షకు గురైయ్యారు.[87]
Since 1959, Cuba has regarded the U.S. presence inGuantánamo Bay as illegal.[88]
యునైటెడ్ స్టేట్ గవర్నమెంటు ఆరంభకాలంలో క్యూబన్ రివల్యూషన్‌కు మద్దతు ఇచ్చింది. ఇది లాటిన్ అమెరికన్ దేశాలలో ప్రజారాజ్యస్థాపనలో భాగంగా భావించబడింది.[89] కాస్ట్రో కమ్యూనిస్టు పార్టీని , వందలాది మణశిక్షలను చట్టబద్ధం చేయడం రెండు దేశాలమద్య సంబంధం క్షీణించడానికి కారణంగా నిలిచాయి.[89] " అగ్రారియన్ రిఫార్మ్ " చట్టం ద్వారా వేలాది ఎకరాల వ్యవసాయభూములు (వీటిలో యు.ఎస్. ప్రజల యాజమాన్యంలో ఉన్న వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి) స్వాధీనం చేసుకొనడం ఇరు దేశాలమద్య సంబంధాలను మరింత చెడగొట్టాయి.[89][90] ప్రతిస్పందనగా 1960-1964 మద్య యు.ఎస్. ఇరుదేశాల మద్య వాణిజ్యాన్ని రద్దు చేసి యు.ఎస్.లోని క్యూబాకు స్వంతమైన ఆస్తులను సీల్ చేసింది.[91]1960 ఫిబ్రవరిలో కాస్ట్రో సోవియట్ వైస్ - ప్రీమియర్ " అనాస్టాస్ మికొయన్ "తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు.[89] 1960లో ఐసన్ హోవర్ సి.ఐ.ఎ. ప్రణాళికకు అనుమతి ఇచ్చిన తరువాత క్యూబన్ ఆశ్రితులకు కాస్ట్రోకు వ్యతిరేకంగా పోరాడడానికి శిక్షణ ఇవ్వబడింది.[92] 1961 ఏప్రిల్ 14 దాడి " బే ఆఫ్ పిగ్స్ ఇంవేషన్ "గా వర్ణించబడింది.[90] నౌకలద్వారా క్యూబాకు చేరుకున్న 1400 మంది " బే ఆఫ్ పిగ్స్ " దళం కాస్ట్రో ప్రభుత్వన్ని పడగొట్టడంలో విఫలం అయింది.[90]1962లో " ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ " నుండి క్యూబాను సస్పెండ్ చేయబడింది.తరువాత అదే సంవత్సరం క్యూబాకు వ్యతిరేకంగాఆర్ధిక నిర్భంధాలు విధించబడ్డాయి.[93] 1962 అక్టోబరులో " క్యూబన్ మిస్సైల్ క్రైసెస్ " సంభవించింది. 1963 నుండి క్యూబా యు.ఎస్.ఎస్.ఆర్ నేతృత్వంలో పూర్తిస్థాయి కమ్యూనిస్టు పార్టీగా మారడం మ్in దలైంది.[94]
1970లో ఫిడేల్ కాస్ట్రో సోవియట్‌కు మద్దతుగా ఆఫ్రికాలో యుద్ధం చేయడానికి లక్షలాది సైకులను బృందాలుగా పంపారు.ఆయనఅంగోలాలో " పాపులర్ మూవ్మెంటు ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అంగోలా " ,ఎథియోపియాలో " మెంగిస్ట్యూ హెయిల్ మారియం " లకు మద్దతు ఇచ్చాడు.[95] 1970 లో ప్రజాజీవనస్థాయి పతనం కావడం ప్రజలలో అసంతృప్తిని కలిగించింది.[96] 1970లో ఫిడేల్ కాస్ట్రో తన ప్రసంగంలో ఆర్థికవిధానాల వైఫల్యాన్ని అంగీకరించాడు.[96]1975లో క్యూబాకు వ్యతిరేకంగా విధించబడిన ఒ.ఎ.ఎస్. ఆర్థికనిర్భంధాలను తొలగించింది.[93]1991లో సోవియట్ యూనియన్ పతనం తరువాత కాస్ట్రో పాలనాపరంగా పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇది క్యూబా ప్రత్యేక కాలంగా పేర్కొనబడింది.4-6 బిలియన్ డాలర్ల విలువైన సోవియట్ వార్షిక రాయితీలు రద్దు చేయబడిన తరువాత క్యూబా ఆర్థికపతం ఆరంభం అయింది.ఆర్ధిక మాంధ్యం ప్రభావం ఆహారం , ఫ్యూయల్ మీద అధికంగా ప్రభావం చూపింది.[97][98]1993 వరకు క్యూబా ప్రభుత్వం అమెరికా సహాయంగా అందించబడిన ఆహారం, ఔషధాలు , నిధి సహాయాన్ని అంగీకరించలేదు.[97]1994 ఆగస్టు 5న హవానాలో స్టేట్ సెక్యూరిటీ " మాలెకొనజొ తిరుగుబాటును " అణిచివేసింది.[99]
చైనా క్యూబాకు సరికొత్తగా ఆయిల్ సరఫరా అందిస్తుంది. అదనంగావెనుజులా గత అధ్యక్షుడు హ్యూగో చావెజ్ , ఎవో మొరలెస్,బొలీవియా అధ్యక్షుడు సంకీర్ణంగా గ్రెనడాకు ఆయిల్ , గ్యాస్ సరఫరా ఎగుమతి చేస్తున్నారు.2003లో ప్రభుత్వం పలువురు అంతర్యుద్ధ పోరాటవీరులను ఖైదు చేసింది.ఈ కాలాన్ని " క్యూబా బ్లాక్ స్రింగ్ "గా అభివర్ణించారు.[100][101]2008 ఫిబ్రవరిలో ఫిడేల్ కాస్ట్రో క్యూబా అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.[102] ఫిబ్రవరి 24న ఆయన సహోదరుడు " రౌల్ కాస్ట్రో " కొత్త అధ్యక్షడుగా ఎన్నిక చేయబడ్డాడు.[103] రౌల్ తన ఆరంభ ఉపన్యాసంలో క్యూబా స్వాతంత్ర్యం మీద నిర్భంధాలను తొలగిస్తామని ప్రమాణం చేసాడు.[104]2009 మార్చిలో " రౌల్ కాస్ట్రో " తన సోదరుడు నియమించిన అధికారులను పదవి నుండి తొలగించాడు.[105] 2009 జూన్ మాసంలో " ది ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ " 47 సంవత్సరాల క్యూబన్ సభ్యాత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.[93][106] ఫిడేల్ కాస్ట్రో తిరిగి అధికారపీఠం అధిష్టించిన తరువాత ఒ.ఎ.ఎస్.లో తిరిగి చేరడం విషయంలో ఆసక్తి కనబరచలేదు.[107]
Raúl Castro meets with U.S. PresidentBarack Obama in Panama, April 11, 2015
1959 తిరుగుబాటు తరువాత దేశం నుండి వలసలకు అడ్డుకట్ట వేయడానికి 1961లో క్యూబా విస్తారమైన ప్రయాణ నిర్భంధాలను విధించింది.[108] తరువాత అది ఎగ్జిట్ వీసాలకు అరుదైన సందర్భాలలో మాత్రమే అంగీకారం తెలిపింది.[109] దేశం వదిలి వెళ్ళడానికి తక్కువగా వివరాలను మాత్రమే కోరబడింది. ప్రయాణీకులు పాస్ పోర్ట్, దేశీయ గుర్తింపు కార్డు మాత్రమే కోరబడింది. వారు మొదటిసారిగా భార్యాబిడ్డలను తీసుకురావడానికి పౌరులను అంగీకరించింది.[110] పాస్ పోర్టు కొరకు ఐదు మాసాల వేతనం వ్యయం చేయవలసిన అవసరం ఏర్పడింది. కొత్త విధానం విదేశీనివాసిత క్యూబన్లకు అవకాశంగా మారిందని పరిశీలకులు భావించారు.[111] మొదటి ప్రయత్నంలో 1,80,000 మంది క్యూబన్లు తిరిగి దేశంలో ప్రవేశించారు.[112]2014 డిసెంబరులో క్యూబన్ అధికారులు, అమెరికన్ అధికారులు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో కలిసి చర్చలు జరిగాయి. చర్చల ఫలితంగా అలాన్ గ్రాస్, 50 మంది ఖైదీలు, అనామధేయ యునైటెడ్ స్టేట్స్ ప్రతినిధులు విడుదల చేయబడ్డారు. ప్రతిగా యునైటెడ్ స్టేట్స్ ఖైదు చేసిన 3 మంది క్యూబన్ ప్రతినిధులు విడుదల చేయబడ్డారు. క్యూబా, యునైటెడ్ స్టేట్స్ మద్య విభేదాలు వెంటనే తొలగిమచబడనప్పటికీ ఎగుమతి, దిగుమతి కొన్ని వాణిజ్య పరిమితులు తొలగించబడ్డాయి.[113]
క్యూబా కరీబియన్ సముద్రంలోని ఒక ద్వీపసమూహ దేశం. ఇది గల్ఫ్ ఓఫ్ మెక్సికో సంగమం, అట్లాంటిక్ మహాసముద్రం సమీపంలో ఉంది. ఇది 19 నుండి 24 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 74 నుండి 85 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.క్యూబా ఉత్తరదిశలో 150 కి.మీ దూరంలో యునైటెడ్ స్టేట్స్, 21కి.మీ ఉత్తరంలోబహామాస్, పశ్చిమంలో 210కి.మీ దూరంలోమెక్సికో, తూర్పున 77కి.మీ దూరంలోహైతీ, దక్షిణంలో 140కి.మీ దూరంలోజమైకా, కేమన్ ద్వీపాలు ఉన్నాయి.ప్రధాన ద్వీపం క్యూబా చుట్టూ నాలుగు ద్వీపాలు ఉన్నాయి. వాయవ్యంలో కొలరాడో ద్వీపసమూహం ఉన్నాయి. ఉత్తర మద్య అట్లాంటిక్ సముద్రతీరం సమీపంలో సబనా - కమాగుయా ద్వీపసమూహం, దక్షిణ మద్య సముద్రతీరంలో జార్డైంస్ డీ రెయినా, ఆగ్నేయ సముద్రతీరంలో కెనరోస్ ద్వీపసమూహం ఉన్నాయి.
ప్రధానా భూభాగం క్యూబా ద్వీపం పొడవు 1250 కి.మీ, వైశాల్యం 104556 చ.కి.మీ. ఇది కరీబియన్ సముద్రంలో అతిపెద్ద ద్వీపం. వైశాల్యపరంగా ప్రపంచంలోని ద్వీపాలలో క్యూబా 17వ స్థానంలో ఉంది.ప్రభానభూభాగం క్యూబాద్వీపంలో అధికంగా చదునైన మైదానాలు ఉన్నాయి. ఆగ్నేయంలో సియెర్రా మీస్ట్రా పర్వతాలు ఉన్నాయి.ఇందులో ఉన్న సముద్రమట్టానికి 1974 మీ ఎత్తైన " పికొ టర్క్వియానో " శిఖరం దేశంలో ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతుంది.దేశంలోని రెండవ అతిపెద్ద ద్వీపం 2200 చ.కి.మీ.వైశాల్యం కలిగిన " ఇస్లా డీ లా జువెంటడ్ " (ఇస్లే ఆఫ్ యూత్) కనరాయెస్ ద్వీపసమూహంలో ఉంది. క్యూబా అధికారిక భాభాగ వైశాల్యం 1,09,884 చ.కి.మీ. జలభాగం, భూభాగం కలిసిన వైశాల్యం 1,10,860చ.కి.మీ.
క్యూబా వాతావరణం ఉష్ణమండల వాతావరణంగా వర్గీకరించబడింది. సంవత్సరంతా వీచే నైరుతీ ఋతుపవనాలు వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తూ ఉంటాయి. డ్రై సెషంస్ నవంబరు, ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. వర్షాకాలం మే నుండి అక్టోబరు వరకు కొనసాగుతుంది. సరాసరి ఉష్ణోగ్రత జనవరిలో సరాసరి ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెంటీగ్రేడ్, జూలైలో 27డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కరీబియన్ సముద్ర వెచ్చని ఉష్ణోగ్రత, మెక్సికో గల్ఫ్ మద్యలో ఉన్న ఉపస్థితి తరచుగా తుఫానులు సంభవించడానికి కారణంగా ఉన్నాయి.సెప్టెంబరు, అక్టోబరు మాసాలమద్య తుఫానులు అధికంగా సంభవిస్తుంటాయి.
1992 జూన్ 12న క్యూబా " రియో కాంవెంషన్ ఆన్ బయోలాజికల్ డైవర్శిటీ " కొరకు సంతకం చేసింది.[114] పర్యవసానంగా క్యూబా " నేషనల్ బయోడైవర్శిటీ స్ట్రేటజీ , యాక్షన్ ప్లాన్ " రూపొందించింది.[115] క్యూబాలో 17,801 జాతుల జంతువులు, 270 బాక్టీరియా, 707 క్రొమిస్టా,5,844 జాతుల ఫంగై (లిచెన్), 9107 మొక్కల జాతులు, 1440 ప్రొటోజొయా జాతులు ఉన్నాయి.[116]
క్యూబా ప్రభుత్వం సోషలిస్టు విధానాలకు కట్టుబడి ఉంది. ప్రభుత్వం ఆర్థికరంగాన్ని అధికంగా స్వయంగా నియత్రిస్తుంది.ఉత్పాత్తిలో అధికభాగం ప్రభుత్వానికి స్వంతమైన సంస్థల నుండి ఉత్పత్తి చేయబడుతూ ఉంటుంది. ఉద్యోగులకు అధికంగా ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది. సమీపకాలంలో ప్రైవేట్ రంగం నుండి ఉపాధి సౌకర్యాలు అభివృద్ధి చెందాయి. 1981లో ప్రభుత్వరంగ ఉపాధి 91.8%, ప్రైవేట్ రంగ ఉపాధి 8.2% ఉండగా 2006 నాటికి ప్రభుత్వరంగ ఉపాధి 78%, ప్రైవేట్ రంగ ఉపాధి 22% నికి చేరుకుంది.[117] ప్రభుత్వం జి.డి.పి.లో 78.1% వ్యయం చేస్తుంది.[118] ఏ సంస్థ అయినా క్యూబన్ పౌరుని ఉద్యోగంలో నియమించిన తరువాత వేతనం ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వం ఉద్యోగికి వేతనం చెల్లిస్తుంది.[119] 2013 గణాంకాల ఆధారంగా సారాసరి నెలజీతం 466 క్యూబన్ పెసొస్, ఇవి 19 యు.ఎస్. డాలర్లకు సమానం.[120]
క్యూబాలో డ్యూయల్ కరెంసీ విధానం అమలులో ఉంది. ధరలు క్యూబన్ పెసొస్‌లో ఏర్పాటు చేయబడతాయి. పర్యాటకరంగం ఆర్థికవ్యవహారాలు కన్వర్టబుల్ పెసొస్ రూపంలో యు.ఎస్.డాలర్లకు సమానంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి.[120] క్యూబన్ కుంటుంబాలన్నింటికీ రేషన్ పుస్తకాలు (లిబర్టా) వినియోగించబడతాయి. రేషన్ పుస్తకం సాయంతో ఆహారం, ఇతర సరఫరాలు కనీస ధరలలో కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించబడుతుంది.[121] ఫిడేల్ కాస్ట్రో 1959 తిరిగుబాటుకు ముందు లాటిన్ అమెరికా దేశాలలో అభివృద్ధిచెందిన, విజయంతంగా నిర్వహించబడుతున్న దేశాలలో క్యూబా ఒకటిగా ఉంది.[122] క్యూబా రాజధాని హవానా " ప్రకాశవంతమైన , అద్భుతమైన " నగరంగా గుర్తించబడుతూ ఉంది.[122] శతాబ్దం ఆరంభంలో క్యూబా ఆర్థికరంగం యునైటెడ్ స్టేట్స్‌కు చక్కెర ఎగుమతి చేస్తూ సుసంపన్నంగా ఉండేది. అర్ధగోళంలో తలసరి ఆదాయంలో క్యూబా 5వ స్థానంలో, ఆయుఃపరిమితిలో 3వ స్థానంలో, ఆటోమొబైల్స్ యాజమాన్యం, మొబైల్స్ యాజమాన్యంలో 2వ స్థానంలో, నివాసగృహాలలో టెలివిజన్ సెట్ల సంఖ్యలో 1వ స్థానంలోనూ ఉంది. క్యూబా అక్షరాస్యత 76%, లాటిన్ అమెరికా దేశాలలో అక్షరాస్యతలో క్యూబా 4వ స్థానంలో ఉంది. జనంఖ్య ఆధారంగా సరాసరి వైద్యుల సంఖ్యలో క్యూబా ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. ప్రైవేట్ క్లినిక్స్, హాస్పిటల్స్ బీదవారికి వైద్యసేవలు అందిస్తూ ఉన్నాయి.ఇతర లాటిన్ అమెరికన్ దేశాల కంటే క్యూబా ఆదాయవితరణ ప్రజానుకూలంగా ఉంది.అయినప్పటికీ నగరప్రాంత ప్రజలు, గ్రామప్రాంత ప్రజల మద్య ఆర్థిక అసమాతలు తీవ్రంగా ఉన్నాయి. ప్రత్యేకంగా శ్వేతజాతీయులు, నల్లజాతీయుల మద్య ఇది అధికంగా ఉంది. పి.బి.ఎస్.గణాంకాల ఆధారంగా గ్రామీణప్రాంతంలోని క్యూబన్లు అంతులేని దారిద్యంలో ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. మద్యతరగతి ప్రజల ఆర్థికాభివృద్ధి అధికరిస్తుంది.[122] చాపెల్ హిల్ సమీపంలో ఉన్న " యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా "కు చెందిన క్యూబా చరిత్రకారుడు " లూయిస్ పెరెజ్ " హవానా లాస్ వెగాస్‌లా మారుతుంది అని అభివర్ణించాడు.[123] 2016లో మైమి హెరాల్డ్ " 27% క్యూబన్లు మాసానికి $50 సంపాదిస్తుండగా, 34% ప్రజలు $50 నుండి $100 సంపాదిస్తున్నారు, 20% ప్రజలు $101 నుండి $200 సంపాదిస్తున్నారు, 12% ప్రజలు $201 నుండి $ 500 సంపాదిస్తున్నారు, 4% ప్రజలు $ 500 కంటే అధికం సంపాదిస్తున్నారు, 1.5% ప్రజలు $1000 కంటే అధికంగా సంపాదిస్తున్నాడని " వ్రాసాడు.[124]
సోవియట్ యూనియన్ పతనం కావడానికి ముందు , క్యూబన్ తిరుగుబాటు తరువాత క్యూబా సహాయం కొరకు , ఊగిసలాడుతున్న ఎగుమతి మార్కెట్ క్రమబద్ధీకరణ కొరకు మాస్కో మీద ఆధారపడింది.సంసిడీస్ కొరత క్యూబన్ ఆర్థికరంగం అతివేగంగా వత్తిడికి (స్పెషల్ పీరియడ్) గురైంది.ఆహారం, అత్యావసర వస్తువులు , సేవలను ప్రజలకు అందించడానికి క్యూబా పరిమితమైన స్వేచ్ఛా విఫణికి అనుమతి ఇచ్చింది. ఈ విధానాలు చిల్లరవ్యాపారం , చిన్నతరహా వస్తూత్పత్తి రంగం అభివృద్ధి చెందడం ద్వారా కొంత స్వయం ఉపాధి లభించడానికి, వ్యాపారంలో యు.ఎస్. డాలర్లు ఉపయోగించడాన్ని చట్టబద్ధం చేయడం , పర్యాటక రంగం అభివృద్ధికి సహకరించాయి. క్యూబా సోవియట్ యూనియన్ నుండి ఆహారాన్ని దిగుమతి చేయడం తగ్గించడానికి " ఆర్గనోపొనిక్స్ " పేరుతో నగరప్రాంత తోటల విధానం అభివృద్ధి చేసింది. యు.ఎస్. పౌరుల ఆస్తులను జాతీయం చేసిమందుకు ప్రతిగా " యు.ఎస్. ఎంబార్గొ " రూపొందించబడింది. ఎంబార్గో క్యూబన్ ఆర్థికరంగానికి హాని చేస్తుందని పర్యవేక్షకులు భావించారు.2009లో క్యూబన్ ప్రభుత్వ అంచనాల ఆధారంగా వార్షిక నష్టం $685 మిలియన్లు ఉంటుందని భావిస్తున్నారు.[125] క్యూబా ప్రభుత్వం వ్యవసాయరంగంలో సంస్కరణలకు పిలుపు ఇచ్చింది. 2008 లో రౌల్ కాస్ట్రో నాణ్యమైన ఆహార ఉత్పత్తి సాధించడానికి వ్యవసాయరంగంలో సంస్కరణలు ప్రారంభించాడు.దేశానికి అవసరమైన 80% ఆహారం దిగుమతి చేసుకోవడమే ఇందుకు ప్రధానకారణం. వ్యవసాయక్షేత్రాల విస్తరణ , ఉత్పత్తి అధికరణ సంస్కరణల లక్ష్యంగా స్వీకరించబడ్డాయి.[126]వెనుజులా క్యూబాకు అవసరమైన ఆయిల్ (దినసరి 1,10,000 క్యూబిక్ మీటర్లు) సరఫరా చేస్తుంది. ప్రతిగా క్యూబా నుండి ధనం , సేవలను (ప్రధానంగా వైద్య రంగానికి చెందిన ఉద్యోగులు) అందుకున్నది.[11] 2008 - 2010 క్యూబన్ జి.డి.పి.లో 20% వెనుజులా నుండి లభించింది.1985 - 1988 మద్య ఈసహాయాన్ని క్యూబాకు సోవియట్ యూనియన్ అందించింది.[12]
Cubans are now permitted to own small businesses in certain sectors.
2005 లో క్యూబా ఎగుమతులు $2.4 బిలియన్లు. 226 ప్రపంచదేశాలలో క్యూబా ఎగుమతులు 114వ స్థానంలో ఉన్నాయి.దిగుమతులు $ 6.9 బిలియన్లు. 226 ప్రపంచదేశాలలో క్యూబా దిగుమతులు 87వ స్థానంలో ఉన్నాయి.[127] 2012 గణాంకాల ఆధారంగా క్యూబా కెనడా (17.7%), చైనా (16.9%),వెనుజులా (12.5%, నెదర్లాండ్ (9%) ,స్పెయిన్ 5.9%, దేశాలకు ప్రధానంగా ఎగుమతులు కొనసాగాయి.[128] క్యూబా ఎగుమతులలో చక్కెర,నికెల్, పొగాకు, చేపలు, వైద్య ఉత్పత్తులు, నిమ్మజాతి పండ్లు , కాఫీ ప్రధానపాత్ర వహిస్తున్నాయి.[128] దిగుమతులలో ఆహారం, ఫ్యూయల్, వస్త్రాలు , మెషినరీ ప్రధానమైనవి. క్యూబా ప్రస్తుతం $13 బిలియన్ల ఋణాన్ని కలిగి ఉంది.$13 billion,[129] ఎగుమతులు దాదాపు 38% జి.డి.పి.కి భాగస్వామ్యం వహిస్తున్నాయి.[130] క్యూబా ప్రభుత్వం నిర్వహించడానికి ఋణాలమీద ఆధారపడి ఉందని " హెరిటేజ్ ఫౌండేషన్ " భావిస్తుంది.[131] ఒకప్పుడు ప్రపంచ చెక్కెర ఎగుమతులలో 35% భాగస్వామ్యం వహిస్తున్న క్యూబా ఎగుమతులు పలువిధ కారణాలతో 10% పడిపోయింది.అంతర్జాతీయ చక్కెర ధరలు తగ్గడం క్యూబా ప్రపంచమార్కెట్ పోటీకి నిలవలేక పోవడానికి కారణంగా ఉంది.[132] 2006లో ఉత్పత్తిని అధికరించడానికి వేతనవిధానంలో సవరణలు ప్రకటించింది.[133] 2010 నాటికి క్యూబన్లు వారి స్వంతగృహాలను నిర్మించడానికి అనుమతి లభించింది. అయినప్పటికీ కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం నుండి సహాయం అందించలేదు.[134] వాస్తవానికి క్యూబాలో నివాసగృహాల కొరత లేదు. 85% క్యూబన్లకు స్వంత నివాసగృహం ఉంది. వారు ఆస్తిపన్ను కాని తనఖా వడ్డి కాని చెల్లించవలసిన అవసరం లేదు. క్యూబాలో తనఖా చెల్లింపు కుటుంబ ఆదాయంలో 10% కంటే అధికం లేదు.[125][135]2011 ఆగస్టు 2న " ది న్యూయార్క్ టైంస్ " క్యూబా ప్రైవేట్ ఆస్తుల క్రయవిక్రయాలను చట్టబద్ధం చేసిందని అభిప్రాయం వెలిబుచ్చింది.[136] సంస్కరణల తరువాత దేశంలో ఒక మిలియన్ కంటే అధికమైన ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. మార్పులను పార్టీ అధికరులు వ్యతిరేకించారు.[137] సంస్కరణలను కొందరు " న్యూ క్యూబన్ ఎకానమీ " అని అభివర్ణించారు.[138][139] 2013 అక్టోబరులో రౌల్ రెండు కరెంసీలను విలీనం చేయడానికి సుముఖత వ్యక్తం చేసాడు. అయినప్పటికీ 2016 వరకు రెండు కరెంసీ విధానం కొనసాగింది.2012 ఆగస్టులో క్యూబనెర్జియా కంపెనీ స్పెషలిస్ట్ క్యూబా మొదటి సోలార్ ప్లాంటును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. క్యూబాసోలార్ సభ్యుడుగా 2012 లో అదనంగా 10 ప్లాంట్ల ప్రతిపాదన చేయబడింది.[140]
క్యూబా సహజవనరులలో చెరకు,పొగాకు, చేపలు, నిమ్మజాతి పండ్లు, కాఫీ, బీంస్, బియ్యం, ఉర్లగడ్డలు , జంతువుల పెంపకం ప్రధానమైనవి.[141] క్యూబా గనుల నుండి 71,000 ఉత్పత్తులు వెలువడుతున్నాయి. ఇది ప్రంపంచ ఉత్పత్తిలో 4% శాతం ఉంది.[142] 2013 లో క్యూబా రిజర్వులు 5.5 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది. ప్రంపంచం మొత్తం నిలవలలో ఇది 7% ఉంది.[142]కెనడాకు చెందిన " షెర్రిట్ ఇంటర్నేషనల్ " మొయా (క్యూబా) లో అతిపెద్ద నికెల్ ఫెసిలిటీ నిర్వహిస్తుంది.క్యూబాలో నికెల్ బై ప్రొడక్ట్ అయిన రిఫైన్ కోబాల్ట్ ఉత్పత్తి చేయబడుతుంది.[143]2005 లో యునైటెడ్ స్టేట్స్ గియోలాజికల్ సర్వే క్యూబాలో ఆయిల్ అంవేషణ ఆరంభించింది. నార్త్ క్యూబా బేసిన్ నుండి 4.6 billion barrels (730,000,000 మీ3) నుండి 9.3 billion barrels (1.48×109 మీ3) ఆయిల్ లభించగలదని అంచనా వేయబడింది. 2006 లో టెస్ట్ డ్రిల్ మొదలైంది.[144]
పర్యాటకం ఆరంభంనుండి స్వదేశీ రిసార్టులకు మాత్రం పరిమితం చేయబడింది. పర్యాటకులు క్యూబన్ సొసైటీ నుండి విభజించబడుతుంటారు. పర్యాటకం ఎంక్లేవ్ పర్యాటకం , పర్యాటకం అపార్థియడ్ అని పేర్కొనబడుతుంటుంది.[145] 1992 , 1997 మద్య పర్యాటకులు , సాధారణ మద్య సంబంధాలు " డి ఫాక్టో " చట్టవిరుద్ధం చేయబడింది.[146] క్యూబాలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేయబడడం క్యూబా అంతటా ప్రత్యేకమైన సాంఘిక, ఆర్థిక పరిణామాలను సృష్టించింది.[147] గత దశాబ్ధంలో కరీబియన్ పర్యాటకంలో క్యూబా మార్కెట్ షేర్ మూడింతలు అయింది.[ఎప్పుడు?] ఫలితంగా పర్యాటక ఇంఫ్రాస్ట్రక్చర్ రంగంలో గణనీయమైన పెట్టుబడులు అభివృద్ధి చెందాయి. అభివృద్ధి శాతం కొనసాగుతుందని భావించబడింది.[148] 2003 లో 9 మిలియన్ల పర్యాటకులు క్యూబాను సందర్శించారు. పర్యాటకులు అధికంగా కెనడా, యురేపియన్ యూనియన్ లకు చెందిన వారు ఉన్నారు. పర్యాటకం నుండి దేశానికి $ 2.1 బిలియన్లు లభించింది.[149] 2011 లో క్యూబా పర్యాటకుల సంఖ్య 26,88,000. పర్యాటకుల సంఖ్యలో కరీబియన్ ప్రాంతంలో క్యూబా 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలోడొమినికా, ప్యూర్టో రికో ఉన్నాయి.[150] మెడికల్ పర్యాటకం ద్వారా క్యూబా వార్షికంగా వేలాది యురేపియన్, లాటిన్ అమెరికన్, అమెరికన్ వాడుకరులను ఆకర్షిస్తుంది.[151]
2010 గణాంకాల ఆధారంగా క్యూబా జనసంఖ్య 1,12,41,161. వీరిలో 56,28,996 మంది పురుషులు, 56,12,165 స్త్రీలు ఉన్నారు.[153] 2006 గణాంకాల ఆధారంగా జననాల నిష్పత్తి 1000:9.88.[154] ఇది పశ్చిమార్ధగోళంలో అత్యంత అల్పం. 1961 నాటికి దేశజనసంఖ్య 4 మిలియన్లకు చేరింది.2006 నాటికి విదేశాలకు వలసలు అధికమైన కారణంగా జననాల నిష్పత్తి 1.43 మాత్రమే ఉంది.[155] పశ్చిమార్ధగోళంలో క్యూబా ఫర్టిలిటీ పతనం అత్యధికస్థాయికి చేరింది.[156] గర్భవిచ్ఛిత్తిని క్యూబా చట్టబద్ధం చేసిన కారణంగా జనసంఖ్యాభివృద్ధి తగ్గడానికి ఒక కారణంగా ఉంది. క్యూబాలో గర్ధవిచ్ఛిత్తి నిష్పత్తి 1000:58.6. (1996).కరీబియన్ సరాసరి 35, లాటిన్ అమెరికా సరాసరి 27, ఐరోపా సరాసరి 48.గర్భనిరోధ విధానాలు దేశమంతటా విస్తరించి ఉన్నాయి. 79% స్త్రీలు గర్భనిరోధ విధానాలను అనుసరిస్తున్నారని అంచనా.[157]
క్యూబాలో బహుళజాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వైవిధ్యమైన సంప్రయాలకు చెందిన ప్రజలమద్య జాత్యంతర వివాహాలు దేశమంటా సహజంగా పరిణమించాయి. ఫలితంగా దేశంలో జాతివివరణలు సేకరించడంలో వ్యాత్యాసం చోటుచేసుకుంటుంది. యూనివర్శిటీ ఆఫ్ మియామి వద్ద ఇంస్టిట్యూట్ ఫర్ క్యూబన్, క్యూబన్ - అమెరికన్ స్టడీస్ సాంగించిన అధ్యయనాల ఆధారంగా క్యూబాలో 62% నల్లజాతీయులని భావిస్తున్నారు.[158] 2002 క్యూబన్ గణాంకాల ఆధారంగా ప్రజలలో 65.05% శ్వేతజాతీయులు ఉన్నారని తెలియజేస్తున్నాయి.2014 గణాంకాలు క్యూబాలో 72% యురేపియన్లు, 20% ఆఫ్రికన్లు, 8% స్థానిక అమెరికన్లు ఉన్నారని తెలియజేస్తున్నాయి.[159] స్త్రీలలో 35% క్యూబన్ స్థానిక అమెరికన్లు, 39% ఆఫ్రికన్లు, 26% యురేపియన్లు ఉన్నరని పురుషులలో 82% యురేపియన్లు, 18% ఆఫ్రికన్లు ఉన్నారని భావిస్తున్నారు.[159]
Ancestral contributions in Cubans as inferred from autosomal AIMs.
Ancestral contributions in Cubans as inferred from Y-chromosome markers.
Ancestral contributions in Cubans as inferred from mtDNA markers.
ఆసియన్లు 1% ఉన్నారు. వీరిలో క్యూబన్ చైనీయులు, ఫిలిప్పైనీయులు,[మూలం అవసరం] జపానీయులు,[160][161] వియత్నామీయులు ఉన్నారు.[మూలం అవసరం] వీరిలో అధికంగా 19వ, 20వ శతాబ్దంలో స్పానిషులు, అమెరికన్లు ఒప్పంద విధానంలో కూలీలుగా ద్వీపానికి తీసుకుని రాబడ్డారు.[162] ప్రస్తుతం క్యూబాలో చైనా పూర్వీకత కలిగిన ప్రజలసంఖ్య 1,14,240.[163]ఆఫ్రో క్యూబన్లు అధికంగా యొరూబా సంతకిచెందిన వారై ఉన్నారు.[మూలం అవసరం] ఉత్తర ఆఫ్రికన్ ఆశ్రితులు, పశ్చిమ షహారా లోని సహ్రవి అరబ్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు.[164]
స్వదేశీ వలసలు, విదేశాలకు వలసలు క్యూబా గణాంకాలలో ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. 18వ శతాబ్దం, 20వ శతాబ్దం ఆరంభంలో కరీబియన్ ప్రజలు, కాటలన్ ప్రజలు, అండలూసియన్ ప్రజలు, గలిసియన్ ప్రజలు, ఇతర స్పానిష్ ప్రజలు పెద్దసంఖ్యలో క్యూబాకు అలలు అలలుగా వచ్చిచేరారు. 1899-1930 మద్య కాలంలో మాత్రమే మిలియన్ స్పానియన్లు క్యూబాలో ప్రవేశించారు.వీరిలో చాలామంది స్పెయిన్‌కు తిరిగి వెళ్ళారు.[165] ఇతర వలస ప్రజలలో ఫ్రెంచి,[166] పోర్చుగీసు, ఇటాలియన్, రష్యన్, డచ్చి, గ్రీకు, బ్రిటిష్, ఐరిష్ ప్రజలు అధికంగా ఉన్నారు. 19వ శతాబ్దం, 20వ శతాబ్దంలో యు.ఎస్.పౌరులు క్యూబాకు వచ్చి చేరారు.తిరుగుబాటు తరువాత గణనీయమైన సంఖ్యలో ప్రజలు క్యూబాను విడిచి విదేశాలకు వలసగా వెళ్ళారు. 1959 జనవరి తరువాత మూడుదశాబ్ధాల ఒక మిలియన్ కంటే అధికమైన క్యూబన్లు (మొత్తం జనసంఖ్యలో 10%) యు.ఎస్.కు వలగా వెళ్ళారు.[167][168][169][170][171] క్యూబన్ల వలసలు సాగిన ఇతరదేశాలలోకెనడా,మెక్సికో,స్వీడన్ దేశాలు ప్రధానమైనవి.దేశాన్ని వదిలి పోయేవారు అధికంగా చిన్నచిన్న బోట్లలో సముద్రమార్గంలో వెళ్ళారు. కొందరు 1994 సెప్టెంబరు 9న యు.ఎస్., క్యూబా ప్రభుత్వాలు అంగీకరించిన ఒప్పదం ఆధారంగా యు.ఎస్. చిన్న చిన్న బోట్లలో సాగుతున్న చట్టవిరుద్ధమైన చొరబాట్లను నిరోధించడానికి క్యూబాకు 20,000 వీసాలు మంజూరు చేసింది.[172]
2010 గణాంకాల ఆధారంగా క్యూబాలో ప్రజలలో 65% క్రైస్తవులు ఉన్నారని భావిస్తున్నారు. 2016 గణాంకాల ఆధారంగా వీరిలో 60% రోమన్ కాథలిక్కులు ( 6.9 మిలియన్లు), ప్రొటెస్టెంట్లు 5% (5,75,000) ఉన్నారు. 23% జాతినిర్ణయించబడని ప్రజలు, 17% స్థానిక మతాలకు చెందిన ప్రజలు (సాంటరియా మొదలైన మతాలు) ఉన్నారు.మిగిలిన 0.4% ప్రజలు ఇతర మతాలకు చెందిన ప్రజలు ఉన్నారు.[173]క్యూబా అధికారికంగా లౌకికవాద దేశం. 1980 నుండి దేశంలో మతస్వాతంత్ర్యం అధికరిస్తూ ఉంది.[174] 1992లో రాజ్యాంగపరమైన సవరణల తరువాత దేశంలో నాస్థికుల సంఖ్య తగ్గుంది.[175] స్పానిష్ కాలనైజేషన్ ఫలితంగా దేశంలో రోమన్ కాథలిక్కులు అధికరించిన కారణంగా క్యూబాలో రోమన్ కాథలిజం అతిపెద్ద మతంగా ఉంది.[131] రెండవ పోప్ జాన్ పౌల్, పోప్ బెనెడిక్ట్ 1998, 2011లో క్యూబాను సందర్శించాడు. 2015 సెప్టెంబరులో పోప్ ఫ్రాంసిస్ క్యూబాను సందర్శించాడు.[176][177] ఈచ్ పాపల్ సందర్శనకు ముందు క్యూబా ప్రభుత్వం మానవత్వదృక్పధంతో ఖైదీలను క్షమాపణ కూరింది.[178][179] 1990లో క్యూబన్ ప్రభుత్వం హౌస్ చర్చీల మీద ఉన్న నిర్భంధాన్ని తొలగించడం విప్లవాత్మకంగా పెంటెకొస్టలిజం అభివృద్ధి చెందడానికి దారితీసింది. ఇందులో దాదాపు 1,00,000 సభ్యులు ఉన్నారు. ఎవాంజికల్ ప్రొటెస్టెంట్ మతాలు " అంబ్రెల్లా క్యూబన్ కౌంసిల్ ఆఫ్ చర్చీలు " నిర్వహణ చేస్తుంది.[180] 2012 గణాంకాల ఆధారంగా క్యూబాలో యూదులు (500), ముస్లిములు, బహై మతస్థులు ఉన్నారు.[181]
క్యూబా అధికార భాష స్పానిష్. అత్యధికమైన క్యూబన్లకు స్పానిష్ వాడుక భాషగా ఉంది. క్యూబాలో వాడుకలో ఉన్న స్పానిష్ భాషను " క్యూబన్ స్పానిష్ " అంటారు. పశ్చిమ ఆఫ్రికన్ యురూబా భాషాకుటుంబానికి చెందిన లుకుమి భాష సాంటారియా ప్రజలకు వాడుక భాషగా ఉంది.[182] ఇది ద్వీతీయ భాషగా ఉంది.[183] హతియన్ క్రియోల్ భాష క్యూబాలో అత్యధికంగా వాడుకలో ఉంది. హతియన్ వలస ప్రజలు, హతియన్ సంతతికి చెందిన ప్రజలకు ఇది వాడుక భాషగా ఉంది.[184] ఇతర భాషలలో గలిసియన్, కొరిసియన్ భాషలు ప్రధానమైనవి.[185]
A local musical house, Casa de la Trova in Santiago de Cuba
క్యూబా సంస్కృతి స్పెయిన్, ఆఫ్రికా సంస్కృతుల ప్రభావం ఉంది. 1959 తిరుగుబాటు తరువాత ప్రభుత్వం అందరీకీ ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకురావడం, కఠినమైన క్రీడల శిక్షణ, బాలెట్, సంగీతాలలో శిక్షణ భాగంగా జాతీయ ఆక్షరాశ్యత పోరాటం ప్రారంభించింది.[186]
సుసంపన్నమైన క్యూబా సంగీతం సాధారణంగా క్యూబన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ప్రఖ్యాతి గాంచిన సన్ సంగీతబాణికి " డాంజన్ డీ న్యువొ రిత్మొ ", మాంబొ, చా-చా-చా, సల్సా సంగీతం ఆధారంగా ఉన్నాయి. రుంబా (డీ కాజన్ ఒ డీ సోలార్ ) సంగీతానికి ఆరంభకాల ఆఫ్రో- క్యూబన్ సంస్కృతి, మిశ్రిత హిస్పానిక్ సంగీతబాణి ఆధారంగా ఉన్నాయి.[187] క్యూబాలో హిస్పానిక్ సంగీత ఉపకరణాల (స్పానిష్ గిటార్, వేణువు) నుండి ట్రెస్ అనే ఊహాజనిత సంగీత వాయిద్యం రూపొందించబడింది. ఇతర క్యూబా ఆఫ్రికన్ సంప్రదాయ సంగీత పరికరాలలో నియో- టైనొ వాయిద్యానికి మర్కాస్, గుయిరొ, మరింబులా, వైవిధ్యమైన వుడన్ డ్రమ్ములు మయొహుయాకన్ ఆధారంగా ఉన్నాయి.
ప్రబల క్యూబన్ సంగీతబాణీలు అన్నీ ప్రంపంచం అంతటా ఆనందించబడుతూ ప్రశంసించబడుతున్నాయి. క్యూబా సంప్రదాయ సంగీతంలో ఆఫ్రికన్, యురేపియన్ సంగీతాలతో ప్రభావితమై ఉంది. మదురమైన ఈఈగాయకులు అంతర్జాతీయ ప్రశంసలను అందుకుంటున్నారు. సంగీత కూర్పులను అందిస్తున్న వారిలో " ఎర్నెస్టో లెకుయానా " ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. అదేసమయంలో రెగ్గీటన్ సంగీతానికి ప్రాబల్యత అధికరిస్తూ ఉంది. 2011లో క్యూబా ప్రభుత్వం రెగ్గీటన్ సంగీతం దిగజారిన స్థితికి చేరింది అని ప్రకటించింది. అయినప్పటికీ పూర్తిగా రెగ్గీటన్ సంగీతాన్ని నిషేధించలేదు.[188] 2012 డిసెంబరులో క్యూబా ప్రభుత్వం టెలివిజన్, ఋఏడియోలలో రెగ్గీటన్ సంగీతప్రసారాలను నిషేధించింది.[189][190]క్యూబాలో పాప్, సంప్రదాయ, రాక్ అత్యధికంగా ప్రాబల్యత కలిగి ఉంది.
A traditional meal ofropa vieja (shredded flank steak in a tomato sauce base), black beans, yellow rice, plantains and fried yuca with beerCuban-style tamales
క్యూబా ఆహారశైలి స్పానిష్, కరీబియన్ ఆహారాల మిశ్రితశైలిలో ఉంటుంది. క్యూబా వంటలు మసాలాలు, తయారీ మెళుకువలు స్పానిష్ వంటల తయారీ విధానం నుండి స్వీకరిస్తుంది. అలాగే కొన్ని మసాలాలు, రుచులు కరీబియన్ వంటల ప్రభావం కలిగి ఉంటుంది.గత నాలుగు డశాబ్ధాలుగా కొనసాగుతున్న ఆహారపదార్ధాల రేషన్ కారణంగా ఇవి ప్రస్తుతం అరుదుగా లభిస్తున్నాయి. నిర్బంధాల అధికంగా ఉన్న కారణంగా ఈ ఆహార లభ్యత తక్కువగా ఉంది.[191] సంప్రదాయ క్యూబా ఆహారం ప్రత్యేకంగా అందించబడం లేదు. అన్ని ఆహారాలు ఒకేసారి అందించబడుతుంటాయి.
క్యూబా భోజనంలో అరటికాయ, బ్లాక్ బీంస్, అన్నం ఉంటాయి. " రోపా వియేజా " (ష్రెడ్డెడ్ బీఫ్), క్యూబన్ రొట్టె, పంది మాసం ఎర్రగడ్డ ముక్కలు, ఉష్ణమండల పండ్లు భాగంగా ఉంటాయి. బ్లాక్ బీంస్, అన్నం " మొరొస్ వై క్రిస్టియానోస్ " (మొరొస్) అంటారు. క్యూబన్ ఆహారంలో అరటికాయ ప్రధాన ఆహారంగా ఉంటుంది.పలు మాంసాహారాలు మితమైన సాసెస్‌తో చేర్చి నిదానంగా వండబడుతూ ఉంటుంది. వంటలో తెల్లగడ్డలు, జిలకర, ఒరెగానొ, బే లీవ్స్ మొదలైన మసాలాలు ప్రాధాన్యత వహిస్తాయి.
క్యూబా సాహిత్యం 19వ శతాబ్దం నుండి అభివృద్ధి పధంలో పయనించింది.స్వతంత్రేచ్ఛ, స్వేచ్ఛా భావాలు ప్రాధాన్యత వంహించిన కథాంశాలు " జోస్ మర్టి " రచనలలో చోటుచేకున్నాయి. ఆయన క్యూబాలో అధునికీకరణ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. నికోలస్ గుయిల్లన్, జోస్ జెడ్. రచయితలు మరియా టాల్లెట్ సాంఘిక భావాల వ్యక్తీకరణ పట్ల దృష్టి కేంద్రీకరించారు. డల్స్ మరియా లయ్నాజ్, జోస్ లెజమా కవిత్వంలో తమ ప్రతిభను చాటుకున్నారు. మైకేల్ బార్నెట్ వ్రాసిన " ఎవ్విరి ఒన్ డ్రీం క్యూబా " క్యూబా దైన్యస్థితిని వివరిస్తుంది.[192]మాజిక్ రియలిజం ఉద్యమంలో అలెజొ కారెంటియర్ ప్రధాన్యత కలిగి ఉంది.రచయితలలో రెనాల్డో అరెనాస్, గుయిల్లెర్మొ కాబ్రెరా ఇంఫంటే, సమీపకాలంలో డయానా చావియానొ, పెడ్రొ జుయాన్ గుటియర్రెజ్, జోవాలెస్, గుయిల్లెర్మొ రోసలెస్, లియొనార్డో పడురా రివల్యూషనరీ శకం తరువాత అంతర్జాతీయ గుర్తింపు పొదారు.
క్యూబా సంస్కృతిలో నృత్యం విశేషప్రాధాన్యత వహిస్తుంది. పాపులర్ డాంస్ జనజీవితంలో భాగంగా ఉంది. కంసర్ట్ డాంస్ నృత్యానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. బ్యాలెట్ డీ క్యూబా అంతర్జాతీయ గుర్తింపు పొందింది.[193]
Cuban former boxerTeófilo Stevenson, widely considered to be one of the greatest boxers of all-time
యునైటెడ్ స్టేట్స్ చారిత్రక అసోసియేషన్లు లాటిన్ అమెరికన్ దేశాల క్రీడాకారులు పాల్గొంటున్న క్రీడకారులకంటే క్యూబన్లు పాల్గొంటున్న అనేక క్రీడలు ఉత్తర అమెరికాలో ప్రాచుర్యత కలిగి ఉన్నాయని భావిస్తున్నారు. బేస్‌బాల్ క్యూబాలో అత్యధిక ప్రాల్యత కలిగి ఉంది.ఇతరక్రీడలలో అసోసియేటెడ్ ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ ప్రధానమైనవి. అమెచ్యూర్ బాక్సింగ్‌లో క్యూబా ఆధిక్యత కలిగి ఉంది. ప్రధాన అంతర్జాతీయ క్రీడలలో క్యూబా పలు పతకాలను సాధించింది. క్యూబా నేషనల్ టీం ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటూ ఉంటుంది.[194]
1728 లో " యూనివర్శిటీ ఆఫ్ హవానా " స్థాపించబడింది. క్యూబాలో చక్కగా అభివృద్ధి చేయబడిన కాలేజీలు, యూనివర్శిటీలు ఉన్నాయి.ఐక్యరాజ్యసమితి నివేదిక ఆధారంగా 1957 లో కాస్ట్రొ అధికారానికి వచ్చే ముందు అక్షరాస్యత 80% ఉంది. ఇది స్పెయిన్ కంటే అధికం.[75][195] కాస్ట్రో పూర్తిగా ప్రభుత్వ నిర్వహణ విద్యావిధానం ప్రవేశపెట్టి ప్రైవేట్ విద్యాసంస్థలను రద్దు చేసాడు. మాధ్యమిక విద్య వరకు (15 సంవత్సరాల వరకు) నిర్భంధ విద్య అమలు చేయబడింది. లింగ బేధం, వయోబేధం లేకుండా గ్రేడుల ఆధారితమైన వర్ణబేధంతో యూనిఫాం ధరించాలని నిబంధన అమలుచేయబడింది.ఆరు సంవత్సరాల ప్రాథమిక విద్య తరువాత కొనసాగే మాధ్యమిక విద్య బేసిక్, ప్రీ - యూనివర్శిటీ విద్యగా విభజించబడుతుంది.[196] క్యూబా అక్షరాస్యత 99.8%.[128][197] ఉచిత నిర్బంధ విధానం ద్వారా క్యూబా విద్యాభివృద్ధి సాధించింది. క్యూబా అత్యధిక అక్షరాస్యత కలిగిన ప్రంపంచదేశాల జాబితాలో 10వ స్థానంలో ఉంది.[198] క్యూబా ఉన్నత పాఠశాల గ్రాజ్యుయేషన్ శాతం 94%.[199]యూనివర్శిటీలు, విద్యాసంస్థలు, సాంకేతిక, పాలిటెక్నిక్ విద్యాసంస్థలు ఉన్నతవిద్యాభ్యాసానికి అవకాశం కల్పిస్తున్నాయి. క్యూబన్ మినిస్టరీ ఆఫ్ హయ్యర్ ఎజ్యుకేషంస్ దూరవిద్యావిధానం ప్రవేశపెట్టింది.ఈ విధానంలో గ్రామీణ వ్యవసాయదారులకు రెగ్యులర్, ఈవినింగ్ కోర్సులను అందిస్తుంది. క్యూబా లక్ష్యసాధన సాంధించడానికి అనువుగా ఉన్నతవిధ్యా విధానం కొనసాగుతూ ఉంది.[196] లాటిన్ అమెరికన్ దేశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు క్యూబా పరిమితమైన సంఖ్యలో స్కాలర్‌షిప్పులు అందిస్తుంది.[200][201]" వెబ్ మెట్రిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్శిటీస్ " ఆధారంగా దేశంలో అత్యున్నత ర్యాకులో ఉన్న విశ్వవిద్యాలయాలలో " యూనివర్శిడాడ్ డీ లా హబానా " (ప్రపంచంలో 1680 వ స్థానం), ఇంస్టిట్యూటొ సుపీరియర్ పొలిటెస్నికొ జోస్ అంటానియొ ఎచ్వర్రియా (ప్రపంచంలో 2893 వ స్థానం), ది యూనివర్శిటీ ఆఫ్ సాంటియాగొ డీ క్యూబా (ప్రంపంచంలో 3831వ స్థానం) ప్రధానమైనవి.[202]
క్యూబా ఆయుఃప్రమాణం 78.3 సంవత్సరాలు. పురుషుల ఆయుఃప్రమాణం 76.2 సంవత్సరాలు, స్త్రీల ఆయుఃప్రమాణం 80.4 సంవత్సరాలు ఉంటుంది.[128] ఆయుఃపరిమితిలో క్యూబా ప్రంపంచంలో 55వ స్థానంలో, అమెరికా ఖండాలలో 5వ స్థానంలో ఉంది. మొదటి నాలుగు స్థానాలలోకెనడా,కోస్టారీకా,చిలీ,యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి.శిశుమరణాల నిష్పత్తి 1000:32 (1957), 1990-1995 మద్య 10.[203] 2000-2005 మద్య 6.1, 2009లో 5.13.[128][197] వైద్య నిపుణుల సంఖ్యలో క్యూబా ఉన్నత స్థానంలో ఉంది. 19వ శతాబ్దంలో వరల్డ్ హెల్త్ సైన్సులో క్యూబా గణీయమైన స్థానానికి చేరుకుంది.[75] ప్రస్తుతం క్యూబా " యూనివర్సల్ హెల్త్ కేర్ " సౌకర్యాన్ని కలిగి ఉంది. మెడికల్ సరఫరాలు తక్కువగా ఉన్నప్పటికీ వైద్యనిపుణులు కొరత మాత్రం లేదు.[204] ద్వీపం అంతటా ప్రాథమిక ఆరోగ్యరక్షణ అందుబాటులో ఉంది. మాతాశిశు సంరక్షణ అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉంది.[204]1960లో రివల్యూషన్ తరువాత క్యూబా నుండి 60,000 మంది వైద్యులు వెలుపలకు వెళ్ళిన తరువాత అంటు వ్యాధులు, శిశుమరణాలు అధికం అయ్యాయి.[205] 1980 నుండి పరిస్థితులు మెరుగుపడ్డాయి.[65] దేశం ఆరోగ్య సంరక్షణా విధానం విస్తారంగా ప్రశంసించబడింది.[206] కమ్యూనిస్ట్ ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ కేర్ గ్రామప్రాంత ప్రజల ఆరోగ్యసంరక్షణ కొరకు ప్రణాళికచేస్తుందని ప్రకటించింది.[207] 1991లో సోయియట్ సహాయం నిలిపివేయడం, 1992లో యు.ఎస్.ఆంక్షలు కఠినతరం చేసిన తరువాత క్యూబా ఆర్థిక సమస్యలు, ఆరోగ్యసంరక్షణా విధానంకూడా మెటీరియల్ సరఫరా కొరత సమస్యలను ఎదుర్కొన్నది.[208]వైద్యులకు తక్కువ వేతనం ఇవ్వడం ఒక సవాలుగా మారింది.[209] నాణ్యత లేని సౌకర్యాలు, ఉపకరణాల కొరత తరచుగా అత్యవసర ఔషధాల కొరత[210] క్యూబాలో వైద్యుల సంఖ్య అత్యధికంగా ఉంది.క్యూబాకు చెందిన వేలాది వైద్యులు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలో పనిచేస్తున్నారు.[211] వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధారంగా అత్యుత్తమ వైద్యులకు, నర్సులకు శిక్షణ అందించడంలో క్యూబా అంతర్జాతీయ గుర్తింపును కలిగి ఉంది.క్యూబన్ వైద్యసిబ్బంధి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి వైద్యసేవలు అందిస్తుంటారు.2014 గణాంకాల ఆధారంగా క్యూబాలో శిక్షణ పొందిన వైద్యసిబ్బంధి 66 దేశాలలో వైసేవలందిస్తున్నారని భావిస్తున్నారు.[212] పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ ఎపిడిమిక్ వ్యాధితో పోరాడడంలో క్యూబా వైద్యులు ప్రధానపాత్ర వహించారు.[213]" క్విమెఫా ఫార్మాస్యూటికల్ బిజినెస్ గ్రూప్ " ది మినిస్టరీ ఆఫ్ బేసిక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఫార్మాస్యూటికల్ డ్రగ్ ఎగుమతి, దిగుమతి చేస్తుంది.ఈ బృందం ఈ డ్రగ్ తయారీకి అవసరమైన సాంకేతిక సహకారం కూడా అందిస్తుంది.[214] యు.ఎస్. ఆంక్షల కారణంగా పశ్చిమప్రాంతాల నుండి ఏకాకికా మారిన క్యూబా లంగ్ కేంసర్ వ్యాక్సిన్, సిమా వ్యాక్సిన్ తయారుచేయడంలో విజయం సాధించింది. ఇది యు.ఎస్. పరిశోధకులకు తక్కువగా లభిస్తాయి.2011 నుండి క్యూబన్లకు ఈ ఔషధాలు ఉచితంగా అందించబడుతున్నాయి.[215] 2015 లో తల్లి నుండి శిశువుకు సంక్రమిస్తున్న హెచ్.ఐ.వి.ని నిర్మూలించడంలో క్యూబా ప్రథమ స్థానంలో ఉంది.[216]
↑Andrea, Alfred J.; Overfield, James H. (2005). "Letter by Christopher Columbus concerning recently discovered islands".The Human Record. Vol. 1. Houghton Mifflin Company. p. 8.ISBN0-618-37040-4.
↑Childs, Matt D. (2006).The 1813 Aponte Rebellion in Cuba and the Struggle against Atlantic Slavery. The University of North Carolina Press. p. 320 pages.ISBN0-8078-5772-6.
↑Scheina 2003, p. 352 harv error: no target: CITEREFScheina2003 (help).
↑Magnus Mõrner,Race Mixture in Latin America, Boston,1967, pp. 124–125
↑Herbert S. Klein,Slavery in the Americas: A Comparative Study of Virginia and Cuba, Chicago: University of Chicago Press, 1967, p. 196
↑Morison, Samuel Loring; Morison, Samuel Eliot; Polmar, Norman (2003).The American Battleship. St. Paul, Minn.: MBI Publishing Company. p. 18.ISBN0-7603-0989-2. RetrievedSeptember 15, 2009.
↑Falk 1988, p. 64 harv error: no target: CITEREFFalk1988 (help).
↑"World Competitiveness Map".International Trade Center. Archived fromthe original on 2013-11-09. Retrieved2017-09-05.ఉల్లేఖన లోపం: చెల్లని<ref> ట్యాగు; తప్పు పేర్లు, ఉదాహరణకు మరీ ఎక్కువ
↑142.0142.1"Nickel"(PDF).United States Geological Survey. Archived fromthe original(PDF) on 2013-05-09. RetrievedNovember 9, 2013.
↑Corbett 2002, p. 33 harv error: no target: CITEREFCorbett2002 (help).
↑Facio, Elisa; Maura Toro-Morn, and Anne R. Roschelle (Spring 2004)."Tourism in Cuba During the Special Period"(PDF).Transnational Law & Contemporary Problems.14. University of Iowa College of Law: 119. Archived fromthe original(PDF) on August 22, 2006.
↑Stanley K. Henshaw; Susheela Singh; Taylor Haas."The Incidence of Abortion Worldwide".International Family Planning Perspectives, 1999, 25(Supplement):S30 – S38. Archived fromthe original on 2012-05-30. RetrievedMay 11, 2006.
↑Powell, John (2005)."Cuban immigration".Encyclopedia of North American Immigration. Facts on File. pp. 68–71. RetrievedNovember 30, 2016.
↑Pedraza 2007, p. ? harv error: no target: CITEREFPedraza2007 (help).
↑Falk 1988, p. 74 harv error: no target: CITEREFFalk1988 (help): "[A] tenth of the entire Caribbean population has . . . [emigrated to the U.S.] over the past 30 years".
↑Smith 1996, p. 105 harv error: no target: CITEREFSmith1996 (help): "The expansion of religious liberty began more than a decade ago, for example, and Cuban citizens, by and large, are free to practice their faiths without fear of persecution."
↑Cuba: A Different America, By Wilber A. Chaffee, Gary Prevost, Rowland and Littlefield, 1992, p. 106
↑Feinsilver 1989, pp. 4–5 harv error: no target: CITEREFFeinsilver1989 (help): "Its success has been acclaimed by Dr. Halfdan Mahler, the Director-General of the World Health Organization (WHO), and Dr. Carlysle Guerra de Macedo, Director-General of the Pan American Health Organization (PAHO), as well as by medical professionals from the United States and other capitalist countries who have observed the Cuban health system in action. Despite U.S. hostility toward Cuba, a U.S. government document stated in 1982 that the 'Cuban Revolution has managed social achievements, especially in education and health care, that are highly respected in the Third World ..., [including] a national health care program that is superior in the Third World and rivals that of numerous developed countries.మూస:' "
↑Lundy, Karen Saucier.Community Health Nursing: Caring for the Public's Health. Jones and Bartlett: 2005, p. 377.