ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి.
మానవుని కన్ను
కన్ను (Eye)కాంతిని గుర్తించి నేత్ర నరాల ద్వారామెదడుకు సమాచారాన్ని అందించే అవయవం. ఇవి మానవులలో ముఖ్యమైనజ్ఞానేంద్రియం. మానవునికిముఖంలో రెండువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి మనుషులలోకెమెరా వలె పనిచేసి, బాహ్య రూపాల్ని రంగులతో సహా ఉన్నది ఉన్నట్లుగా మెదడుకి పంపుతాయి.వివిధ జీవులలో నిర్మాణాత్మకంగా పది వేరువేరు డిజైన్లలో కళ్ళుంటాయి. వీనిలో 96% జంతు జాతులలో ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది.[1] ప్రతిబింబాన్ని స్పస్టంగా చూపించే కళ్ళునిడేరియా,మొలస్కా,కార్డేటా,అనెలిడా,ఆర్థ్రోపోడా జీవులలో కనిపిస్తాయి.[2] కన్ను కి సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని
'ఆప్తమాలజీ' అంటారు. కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య ' 16 '. ప్రతిబింబం ఏర్పడడానికి పట్టుకాలం - 0.1 సెకన్లు.
జీవులన్నింటిలోకెల్లా సరళమైన కళ్ళు సూక్ష్మజీవులలో ఉంటాయి. ఇవి పరిసరాలలో కాంతి ఉనికి గుర్తించివెలుగుచీకటి ల మధ్య భేదాన్ని మాత్రమే తెలియజేస్తాయి. వీటి ఆధారంగా జీవ వలయాలు (Circadian rhythm) నిర్దేశించబడతాయి. క్లిష్టమైన జీవులలోని కళ్ళు రెటినాలోని కణాల ద్వారా సమాచారం మెదడుకు
కన్ను నిర్మాణంలో 3 పొరలు ఉంటాయి అవి 1.బయటి పొర (ధృడస్తరం) ఇది మొదటి పొర.2.మధ్య పొర (రక్త పటలం) దీనిలో అనేక రక్త నాళాలుంటాయి.3.లోపలి పొర (నేత్ర పటలం)దీనినే రెటీనా అంటారు. దీనినే కంటిలో జ్ఞానభాగం అంటారు.
కళ్ళు మెదడు కంటే ముందే ప్రమాదాన్ని పసిగడితాయని తేలింది. అంటే, మెదడు సాయం లేకుండానే కళ్లలోని కొన్ని కణాలు ప్రమాదాన్ని పసిగడతాయని వెల్లడైంది.ఈ కణాలు మెదడు సాయం లేకుండానే ప్రమాదం గురించి హెచ్చరిస్తాయని స్విట్జర్లాండ్‌లోని బయోమెడికల్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు. పరిణామక్రమంలోశత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈ తరహా వ్యవస్థ కళ్లలో అభివృద్ధి చెంది ఉండవచ్చని వారి అంచనా.[3]
'ఆర్గస్ 2' గా పిలిచే బయోనిక్ కన్ను (Bionic eye) నిఅమెరికాలోని 'సెకండ్ సైట్' రూపొందించింది. ఇది కళ్లద్దాలపై అమర్చినకెమెరా, వీడియో ప్రాసెసర్ల సాయంతో పనిచేస్తుంది. వీటి నుంచి అందిన దృశ్యాలను కంటి బయట ఓ సూక్ష్మమైన రిసీవర్ గ్రహించి సన్నని తీగ ద్వారారెటీనా మీది ఎలక్ట్రోడ్ల సముదాయానికి పంపుతుంది. అప్పుడు ఎలక్ట్రోడ్లు ప్రేరేపణ పొందిదృశ్యనాడి ద్వారా ఆ సమాచారాన్నిమెదడుకు అందిస్తాయి. దాంతో దృశ్యాలు కనబడతాయి.
టీ.వీ. చూస్తున్నపుడు శరీరాన్ని పలురకాల భంగిమల్లో ఉంచడం చాలామందికి అలవాటు, అయితే వెన్నెముకకి ఊతమిచ్చే కుర్చీలో కూర్చొని టీ.వీ. చూడడము కంటికి మేలుచేస్తుంది.
చూసేటపుడు మనకు టీ.వీ.కి కనీసము 3 మీటర్లు దూరము ఉండాలి.
చీకటిగా ఉన్న గదిలో కూర్చోని టీ.వీ. చూడడం కంటికి శ్రేయస్కరము కాదు. టివి చూస్తున్నపుడు వెలుతురు సరిపడా ఉండాలి. ఆ లైటు కూడా టివి వెనకవైపు ఎత్తులో ఉంటే మంచిది.
కంప్యూటర్ తో పనిచేస్తున్నపుడు
కంప్యూటర్ తెర మధ్యభాగానికి కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది.
రెప్ప వేయకుండా పనిచేయడము మంచిదికాదు. తరచుగా రెప్పలు వేస్తూ ఉండాలి. నిరంతరము పనిచేయకుండా మధ్యలో విరామము ఇవ్వాలి.
కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చొవాలి. మీ దృష్టి మరీ అంత తీక్షణముగా ఉండకూడదు.
మరింత కాంతివంతముగా కనిపించేలా మానిటర్ లైటింగ్ యేర్పాటు చేసుకోవాలి. మానిటర్ మీద యాంటిగ్లేర్ స్క్రీన్ యేర్పాటు చేసుకుంటే మంచిది.
మీరు ఎక్కువగా కంప్యూటర్ ముందు పని చేసేవారైతే మీ కళ్లు ఎక్కువగా అలసటకు గురవుతాయి. ఆ సమయంలో ఈ 20-20-20 రూల్ ని పాటించండి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మీరు బ్రేక్ తీసుకుని కంప్యూటర్ ని కాకుండా 20 మీటర్ల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్ల పాటు చూడండి . ఇదే 20-20-20 రూల్. ఇది కళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
బండి నడిపేటప్పుడు
బండి నడిపేటప్పుడు సన్ గ్లాసెస్ ని వాడాలి.సూర్యుని నుంచి వచ్చే అతి నీలిలోహిత కిరణాలు యు.వి. (ultra violet rays) కిరణాలు తాకిడికి కళ్ళకు హానికలగకుండా, దుమ్మి, ధూళి పడకుండా కళ్ళకు రక్షణగా ఉంటాయి.
రాత్రులు బండి నడిపేటప్పుడు యాంటి గ్లేర్ గ్లాస్లు వాడాలి,ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ల కాంతిని తగ్గించి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి.
కొన్ని కంటి వ్యాయామాలు
తలను బాగా విశ్రాంతిగా ఉంచి చూపును కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పూర్తిగా చివర్లకు తిప్పాలి. కనుగుడ్లు ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు ; ఆ ప్రక్కనుంచి ఈ ప్రక్కకు తిప్పాలి.
తలను విశ్రాంతిగా ఉంచి చూపును సవ్యదిశ లోను,అపసవ్య దిశ లోనూ,తిప్పాలి, ఇలా 3 సార్లు చేయాలి.
తలను ఏమాత్రము కదల్చకుండానే వీలైన పైకి, మళ్ళీ వీలైనంత క్రిందకూ చూడాలి
తలను నిటారుగా వుంచిచూపును పైకి తిప్పుతూ పూర్తి కుడివైపు నుండి చూడండి, అలాగే చూపును క్రిందకి దించి పూర్తిగా ఎడమవైపు నుంచి చూడండి.
మన కంటిలో 6 కండరాలు ఉంటాయి. ఇవి కన్నుగ్రుడును కదల్చడానికి సహాయపడతాయి. కన్నుగ్రుడు కదలడానికి కంటిలోని 6 కండరాలు సహకరించాలంటే ఈవ్యాయామాలు చేయాలి.
ప్రస్తుతం మనదేశంలో 12 లక్షల మందికికార్నియాలు (నల్లగుడ్డ) అవసరం. వీరితోపాటు ప్రతి సంవత్సరం మరో 40 నుంచి 50 వేల మందికి అదనంగా అవసరం వస్తోంది. కంటిలో అన్ని భాగాలు బాగా ఉండి కేవలం నల్లగుడ్డు దెబ్బతిని అంధత్వం వచ్చిన వారికి నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాలు అమర్చుతారు. తర్వాత వారు అందరిలా చూడగలుగుతారు. నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు ఫోన్ చేస్తే వారే అక్కడకు వచ్చి నేత్రాలను సేకరిస్తారు. వాటిని అవసరమైన వారికి శస్త్రచికిత్స ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ విధానం అంతా పైసా ఖర్చులేకుండా ఉచితంగా చేస్తారు. సేకరించిన నేత్రాలు తమ దగ్గర ఉన్న జాబితాలోని వ్యక్తులకు సరిపడకపోతే ఇతర ఐ బ్యాంకులకు పంపిస్తారు. కార్నియా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు. కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకొన్నవారు, రక్తపోటు ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, కళ్ళజోడు పెట్టుకొనేవారు, ఉబ్బసం వ్యాధి ఉన్నవారు కూడా చేయవచ్చు. హెచ్.ఐ.వి., ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారు, పచ్చకామెర్లుకు గురైన వారు, రేబీస్ (కుక్కకాటు వలన) వ్యాధిగ్రస్తులు, బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారు, మెదడువాపు జబ్బు ఉన్న వారు, కార్నియల్ మచ్చలు, రెటినోబ్లాస్టోమా ఉన్నవారు నేత్రదానం చేయకూడదు.
నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు నిర్ణీత దరఖాస్తులో ప్రమాణ పత్రాన్ని పూర్తిచేసి ఇవ్వాలి. దానిమీద నేత్రదానం చేసే వ్యక్తికి చెందిన ఇద్దరు కుటుంబసభ్యులు సాక్షి సంతకం పెట్టాల్సి ఉంటుంది. వారికి గుర్తింపు కార్డులు అందజేస్తారు.
వ్యక్తి మృతిచెందిన వెంటనే నేత్రదానం చేస్తామని ఆ కుటుంబ సభ్యులు సంబంధిత ఆసుపత్రులకు తెలియజేయాలి.
ఆరు గంటల లోపు నేత్రాలను మృతిచెందిన వ్యక్తి నుంచి తీసుకోవాల్సి ఉంది.
సమాచారం తెలియగానే సంబంధిత ఆసుపత్రుల వైద్యుల బృందం అక్కడికి చేరుకుంటుంది.
అప్పటివరకు మృతుని నల్లగుడ్డు ఎండిపోకుండా చూడాలి. కళ్ళు రెండు మూసి తడిగుడ్డ పెట్టడం మంచిది. తలకింద తలగడపెట్టి తల ఎత్తుగా ఉండేలా చూడాలి. ఫ్యాన్ వేయకూడదు. ఏసీ సౌకర్యం ఉంటే ఆ గదిలో ఉంచవచ్చు.
మృతిచెందిన వ్యక్తి నుంచి సేకరించిన కార్నియాలను అవసరమైన వ్యక్తులకు 72 గంటల లోపు ఏర్పాటు చేయాలి. పెద్ద ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉన్నచోట నాలుగు రోజులు వరకు నిల్వ చేయవచ్చు.