1845:ఆస్ట్రేలియా లోని 'కింగ్ ఐలేండ్' ద్వీపానికి దగ్గరలో జరిగిన ఘోరమైన ఓడ (పేరు: కేటరక్వి) ప్రమాదంలో, 407 మంది మరణించారు.
1858: మొట్టమొదటి ట్రాన్స్ అట్లాంటిక్ టెలిగ్రఫ్ కేబుల్ లైను వేసారు.
1861:అమెరికా సైనిక దళాలు, 'సైనికులను కర్రలతో ఒక పద్ధతిగా చావబాదే' శిక్షను రద్దు చేసింది. (క్రమశిక్షణను పాటించని కొందరి సైనికులకు ఈ శిక్ష విధించేవారు) .
1861:అమెరికా మొట్టమొదటి సారి ఆదాయపు పన్నును విధించింది. (800 డాలర్ల ఆదాయం దాటితే 3% పన్ను చెల్లించాలి)
1864:తోకచుక్క వర్ణపటలము (సూర్యకాంతి ఏడురంగులను వర్ణపటలము అంటారు) ను మొదటిసారిగా చూసిన శాస్త్రవేత్తజియోవన్ని దొనాతి
1874:ఇంగ్లాండ్లో ఉన్న పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ఆదర్శంగా తీసుకుని,జపాన్ తన సొంత పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ప్రవేశపెట్టింది.
1879: రాత్రి సమయంలో మొట్టమొదటిసారిగా,ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 'గ్యాస్ లైట్ల' వెలుతురులో క్రికెట్ ఆడారు.
1882: స్టీలుతో తయారయిన యుద్ధనౌకలను, అమెరికా నౌకాదళంలో వాడటానికిఅమెరికా అనుమతించి, ఆధునిక నౌకాదళానికి నాంది పలికింది.
1963: ఆణ్వస్త్రాలు, భూమిలోపలే పరీక్షించాలి (వాతావరణంలో గాని, రోదసీలో గాని, నీటిలోపల గాని పరీక్షించకూడదు) అన్న మినహాయింపుతో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపైఅమెరికా,సోవియట్ యూనియన్,బ్రిటన్ దేశాలు సంతకాలు చేసాయి