Movatterモバイル変換


[0]ホーム

URL:


Jump to content
వికీపీడియాఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
వెతుకు

ఆగష్టు 2

వికీపీడియా నుండి

ఆగష్టు 2,గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 214వ రోజు (లీపు సంవత్సరములో 215వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 151 రోజులు మిగిలినవి.


<<ఆగస్టు>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
12
3456789
10111213141516
17181920212223
24252627282930
31
2025


సంఘటనలు

[మార్చు]
  • 0216 బి.సి.: రెండో పునిక్ యుద్ధం: ‘కేన్నే దగ్గర జరిగిన యుద్ధం’ అంటారు – రోమన్ సైన్యం ఓడిపోయింది.
  • 0338 బి.సి.:మసడోనియన్ సైన్యం,ఫిలిప్ II నేతృత్వంలో ఖరొనియా యుద్ధంలో, ఎథెన్స్ దళాలను, తేబెస్ దళాలను కలిపి ఓడించాడు. ఈ యుద్ధం వలన, మసడోనియన్ రాజ్యపు పెత్తనం (అధికారం) సురక్షితమైంది.
  • 1375: మొదటిరోలర్ స్కేటింగ్ రింక్లండన్లో మొదలు పెట్టారు. (రెండు కాళ్ళకు చక్రాలున్న జోళ్ళు కట్టుకుని, తిరగటాన్ని రోలర్ స్కేటింగ్ అంటారు) . ప్రత్యేకంగా తయారైన వలయంలో ఈ రోలర్ స్కేటింగ్ ని నేర్చుకోవటం, పోటీలు వగైరా జరుగుతాయి.
  • 1769: ఈ రోజు ’లాస్ ఏంజిల్స్‘ నగరానికిబారసాల జరిగిన రోజు. ఇదే రోజున ఈ నగరానికిలాస్ ఏంజిల్స్ అని పేరు పెట్టారు.గాస్పర్ ’డి’ పోర్టోల, ఒకస్పానిష్ సైనిక కెప్టెన్,, ఫ్రాన్సిస్కాన్ పూజారి అయినజువాన్ క్రెస్పి, లు ఇద్దరినీ,శాన్ డీగో ( డియాగొ) నుండి ఉత్తరం వైపు వెళ్ళకుండగా అడ్డుకున్నారు. కానీ, వారిద్దరికీ, ఆ ప్రాంతం చాలా బాగా నచ్చింది. అందుకని దానికొక పేరు పెట్టారు ‘ఇది పొగమంచు లేని స్వర్గం’ అనే అర్ధం వచ్చేలాస్పానిష్ భాషలో . ఆ పేరు ‘ న్యూస్ట్రా సెనొరా ల రీనా డి లాస్ ఏంజెలెస్ డి పోర్సిఉన్సుల’ . ఆ పదాలకి అర్ధం దేవతల మహారాణి పోర్సిఉన్సిల, మా దేవత. పోర్సిఉన్సిలకిఇటలీలో ఒక ఒక చిన్న గుడి ఉంది.
  • 1776:హెన్రీ హడ్సన్ పసిఫిక్ మహాసముద్రం లోనిహడ్సన్ బేని కనుగొన్నాడు. హడ్సన్ పేరుతో, ఆ ప్రాంతాన్నిహడ్సన్ బేగా పేరు పెట్టారు..
  • 1776: కాంటినెంటల్ కాంగ్రెస్ కి హాజరు కావటానికి వచ్చిన ప్రతినిధులు అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్య ప్రకటన పై సంతకాలు చేయటం మొదలు పెట్టారు.
  • 1790: మొదటి సారిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలోజనాభా లెక్కలు మొదలు పెట్టారు.
  • 1823: ‘ది న్యూయార్క్ మిర్రర్ , లేడీస్ లిటరరీ గెజెట్] స్థాపించబడింది. తరువాత కాలంలో ఈ వార పత్రిక,న్యూయార్క్ మిర్రర్ దినపత్రిక గా మారింది
  • 1824:ఫిప్త్ ఎవెన్యూ న్యూయార్క్ నగరంలో ఆరంభించారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రోడ్లలో ఒకటి, అనేక అందమైన దుకాణాలు, ఫ్యాషన్ దుకాణాలకు నెలవు అయ్యింది.
  • 1870: ప్రపంచంలో మొదటి భూగర్భ ట్యూబ్ రైల్వే,టవర్ సబ్‍వే, లండన్ లో ప్రారంభించారు..
  • 1887:బెలాయిట్ నగరానికి (విస్కాన్సిన్ రాష్ట్రం,అమెరికా) చెందిన చెస్టర్ ఎ. హాడ్జ్ కిముళ్ళ తీగ (ముళ్ళకంచె పేటెంట్ హక్కులు ఇచ్చారు. ఈ ముళ్ళ కంచెనే మనం ఇప్పుడు, స్థలాలకు, రక్షణకు కంచెగా, హద్దులుగా వాడుతున్నాము.
  • 1903:ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం అయ్యింది.
  • 1914:షెర్లాక్ హోమ్స్ సాహస గాధ "హిజ్ లాస్ట్ బౌ" నవల విడుదలైంది.
  • 1916: మొదటి ప్రపంచ యుద్ధం: ఆస్ట్రియన్ విద్రోహ చర్యవలన ఇటాలియన్ యుద్ధనౌకలియోనార్డో డా విన్సీటరంటొలో మునిగి పోయింది.
  • 1931: సైన్యానికి సంబంధించిన ఏ పనినైనా, తిరస్కరించమని,ఐన్‌స్టీన్, విజ్ఞానవేత్తలను కోరాడు.
  • 1937:మారిజునా, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులను నిషేధిస్తూ,అమెరికా, 1937 లో ’ది మారిహున టాక్స్ చట్టము’ చేసింది. (మారిజునా – ప్రమాదకరమైన మత్తు పదార్ధము) .
  • 1939:మన్‌హట్టన్ ప్రాజెక్టు (అణుబాంబుని తయారు చేసే కార్యక్రమం) ని మొదలు పెట్టమని,ఆల్బర్ట్ ఐన్‌స్టీన్,,లి జిల్డ్ (Le Szilrd) ఇద్దరూ, నాటిఅమెరికన్ అధ్యక్షుడికి లేఖ ద్వారా విన్నవించుకున్నారు.
  • 1943: ఈ రోజు లెఫ్టినెంట్ (జె.జి – జూనియర్ గ్రేడ్)జాన్ ఎఫ్ కెన్నెడీ (తరువాత అమెరికన్ అధ్యక్షుడు) ki ఒక చెడ్డ రోజు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, అమెరికాకి చెందినపి.టి. 109 (పెట్రోల్ టార్పెడో బోట్)జాన్ ఎప్ కెన్నెడి నడుపుతున్న సమయంలో, ’అమగిరి లేదా అమిగిరి’ పేరుగలజపాన్ వారిడిస్ట్రాయర్ యుద్ధనౌక ఆపి.టి. 109ని ముంచివేసింది. ఆ సమయంలో,కెన్నెడీ, తన బోట్ లోని సిబ్బందిని అందరినీ (ఇద్దరిని తప్ప) రక్షించి, యుద్ధ హీరో అయ్యాడు. ఆ సంఘటన,జాన్ కెన్నెడీకి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని ఇచ్చి, అమెరికా అధ్యక్షపదవిని కట్టబెట్టింది. ఆ సమయంలో, వెన్నుపూసకు తగిలిన గాయం కూడా అలాగే జీవితాంతం వెంటాడింది.పి.టి 109 యొక్కకథ జాన్ ఎప్ కెన్నెడీగాక్లిఫ్ రాబర్ట్సన్ నటించిన, 1963సంవత్సరంలో తీసిన చిత్రం,పి.టి. 109లో హాలీవుడ్ శైలిలో చెప్పారు.
  • 1943:ట్రెబ్లింకా లోనినాజీ మరణం శిబిరంలో తిరుగుబాటు జరిగింది.
  • 1945: రెండవ ప్రపంచ యుద్ధం: మిత్ర రాజ్యాలు ఓడిపోయిన జర్మనీ యొక్క భవిష్యత్తు చర్చించడానికి,పోట్స్ డామ్ సమావేశం జరిపి, ఒక నిర్ణయం తీసుకున్నారు.
  • 1967: రెండవ బ్లాక్‌వాల్ టన్నెల్ (సొరంగం)లండన్ లోనిగ్రీన్‌విచ్ దగ్గర ప్రారంభమైంది. ఇదిథేమ్స్ నది అడుగు భాగంలో తవ్విన సొరంగం.
  • 1984:ఎ. సర్రే అనే వ్యాపారి, చట్టవిరుద్ధంగా తన ఫోన్ ను పోలీసులు టాపింగ్ చేసారని ఆరోపించాడు. మానవ హక్కుల యూరోపియన్ కోర్ట్ ఇలా ఫోన్ టాపింగ్ చేయటం తప్పు అని, పోలీసులను మందలించింది.
  • 1985: "లాక్‌హీడ్ ఎల్-1011 ట్రైస్టార్"కి చెందిన "డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 191", "డల్లాస్ / ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం" వద్ద కూలిపోయింది. 137 మంది ప్రయాణీకులు, సిబ్బంది మరణించారు.
  • 1990: ఈ రోజు ఉదయాన్నే,ఇరాక్, లక్షమంది సైనికులతో, 700 యుద్దటాంకుల దన్ను రాగా, కువైట్ మీద దురాక్రమణ చేసింది.
  • 1990ఇరాక్కువైట్ను ఆక్రమించగానే,ఎమీర్సౌది అరేబియా పారిపోయాడు.ఐక్యరాజ్య సమితిభద్రతా మండలి ఏకగ్రీవంగా ఇరాకీ అక్రమణను ఖండించింది. అంతే కాదు, ఇరాక్ మీద పూర్తి దిగ్బంధం విధించింది.
  • 2009 16మంది ప్రయాణికులతో బయలుదేరిన మెర్పాతి నుసంతారా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 9760, ట్విన్ ఓట్టర్ విమానం, పాపువా, ఇండోనేషియా ప్రాంతంలో కనిపించకుండా పోయింది.
  • 2009ఎయిడ్స్ (AIDS) కలిగించే కొత్తరకంవైరస్ ను,కామెరూన్ దేశంలో నివసిస్తున్న ఒక మహిళలో కనుగొన్నారు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
Alexander Graham Bell

పండుగలు , జాతీయ దినాల

[మార్చు]
  • స్నేహితుల దినోత్సవం.
  • తల్లిపాల వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్/తెలంగాణాలో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు).
  • ఆంగ్లో ఇండియన్. దినోత్సవం.

బయటి లింకులు

[మార్చు]

ఆగష్టు 1 -ఆగష్టు 3 -జూలై 2 -సెప్టెంబర్ 2 --అన్ని తేదీలు

జనవరి |ఫిబ్రవరి |మార్చి |ఏప్రిల్ |మే |జూన్ |జూలై |ఆగష్టు |సెప్టెంబరు |అక్టోబరు |నవంబరు |డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి12345678910111213141516171819202122232425262728293031
ఫిబ్రవరి1234567891011121314151617181920212223242526272829
మార్చి12345678910111213141516171819202122232425262728293031
ఏప్రిల్123456789101112131415161718192021222324252627282930
మే12345678910111213141516171819202122232425262728293031
జూన్123456789101112131415161718192021222324252627282930
జూలై12345678910111213141516171819202122232425262728293031
ఆగష్టు12345678910111213141516171819202122232425262728293031
సెప్టెంబర్123456789101112131415161718192021222324252627282930
అక్టోబర్12345678910111213141516171819202122232425262728293031
నవంబర్123456789101112131415161718192021222324252627282930
డిసెంబర్12345678910111213141516171819202122232425262728293031
"https://te.wikipedia.org/w/index.php?title=ఆగష్టు_2&oldid=4483383" నుండి వెలికితీశారు
వర్గాలు:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp