వికీపీడియాఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,16,521 వ్యాసాలున్నాయి.పూర్తి గణాంకాలు చూడండి.
వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ అలియాస్ చట్టో, (1880 అక్టోబరు 31 - 1937 సెప్టెంబరు 2, మాస్కో), సాయుధ శక్తిని ఉపయోగించి భారతదేశంలో బ్రిటిష్ రాజ్‌ను పడగొట్టడానికి పనిచేసిన ప్రముఖ విప్లవకారుడు. అతను మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్లతో పొత్తులు ఏర్పరచుకున్నాడు. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా ఐరోపాలో భారతీయ విద్యార్థులను సమీకరించే బెర్లిన్ కమిటీలో భాగంగా ఉండేవాడు. ఆ సమయంలో జపనీయులు చేపడుతున్న చర్యలను అధ్యయనం చేసేవాడు. అతను భారత ఉద్యమానికి కమ్యూనిస్టుల మద్దతును పెంపొందించడానికీ, విప్లవ ఉద్యమాలపై పనిచేస్తున్న ఆసియన్ల మద్దతు సాధించడానికీ 1920లో అతను మాస్కో వెళ్ళాడు. జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ (KPD) లో చేరాడు. అతను 1930 లలో చాలా సంవత్సరాలు మాస్కోలో నివసించాడు. జోసెఫ్ స్టాలిన్ పెద్దయెత్తున చేపట్టిన ఏరివేతలో భాగంగా చట్టో, 1937 జూలైలో అరెస్టయ్యాడు. చట్టో 1937 సెప్టెంబరు 2 న అతన్ని ఉరితీసారు. ప్రముఖ రాజకీయ నాయకురాలు, కవయిత్రీ అయిన సరోజినీ నాయుడు వీరేంద్రనాథ్‌కు సోదరి. డాక్టర్ అఘోరనాథ్ ఛటోపాధ్యాయ (ఛటర్జీ), ఒక శాస్త్రవేత్త-తత్వవేత్త, విద్యావేత్త. అతను నిజాం కళాశాలలో మాజీ ప్రిన్సిపాల్, సైన్స్ ప్రొఫెసరు. అతని భార్య వరద సుందరీ దేవి. హైదరాబాద్‌లో స్థిరపడిన బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కవయిత్రి, గాయకురాలు. వారి పిల్లలలో వీరేంద్రనాథ్ అందరిలోకీ పెద్ద కుమారుడు, మొత్తం ఎనిమిది మంది సంతానంలో రెండవవాడు. (ఇంకా…)
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగాసర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.