Movatterモバイル変換


[0]ホーム

URL:


Skip to main content
Sakshi News home page

Trending News:

నిమ్స్ పనులను వేగవంతం చేయాలి

Jun 21 2014 5:29 AM | Updated onSep 2 2017 9:10 AM

నిమ్స్ పనులను వేగవంతం చేయాలి

నిమ్స్ పనులను వేగవంతం చేయాలి

తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం చేపట్టిన నిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సంబంధిత నిర్మాణ సంస్థ అయిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ అధికారులను ఆదేశించారు.

 భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
 బీబీనగర్: తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం చేపట్టిన నిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సంబంధిత నిర్మాణ సంస్థ అయిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ అధికారులను ఆదేశించారు. నిమ్స్ యూనివర్సిటీ భవనంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పునఃప్రారంభించారు. అంతకుముందు భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు నెలల్లో నిమ్స్ భవనంలోని బీ, డీ బ్లాక్‌ల నిర్మాణ పనులను పూర్తిచేసి వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

నిమ్స్ విషయంలో అలసత్వం వహించకుండా అధికారులు ముమ్మరంగా పనులు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయించామని, బకాయి ఉన్న రూ.34 లక్షల విద్యుత్ బిల్లును ట్రాన్స్‌కో శాఖకు చెల్లించినట్లు తెలిపారు. అలాగే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. నిమ్స్ అధికారులకు, కాంట్రాక్టర్‌కు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో నిమ్స్ డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి, నాగార్జున కాంట్రాక్ట్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణారెడ్డి, నాయకులు జడల అమరేందర్, పిట్టల అశోక్, గాదె నరేందర్‌రెడ్డి, కొల్పుల అమరేందర్, కొలను దేవేందర్‌రెడ్డి, పంజాల బాల్‌రాజు, రవికుమార్, కిరణ్‌కుమార్, నరహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

    Related News By Tags

    Advertisement
     
    Advertisement

    Photos

    View all

    Daily HoroscopeWeekly Horoscope

    Advertisement

    [8]ページ先頭

    ©2009-2025 Movatter.jp